కులాలు, మతాలు, పార్టీలకతీతంగా సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ 
 

తూర్పుగోదావరి:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో జనరంజక పాలన సాగుతుంద‌ని, కులాలు, మతాలు, పార్టీలకతీతంగా సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్నాయ‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు.  మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం రాజమండ్రిలో పర్యటించారు. ఈ క్రమంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు విశ్వరూప్‌, కన్నబాబు, వేణు, ఎంపీ భరత్‌ల‌తో క‌లిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అర్హులంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్నాయ‌ని చెప్పారు. ఇంకా ఎవ‌రైనా మిగిలిపోతే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. 
చదువుల్లో నాణ్యత ప్రమాణాలను పెంపొందించి అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులు రాణించేలా రాష్ట్రంలో నూతన విద్యావిధానానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శ్రీకారం చుట్టార‌ని తెలిపారు.
 నూతన విద్యా విధానంలో ఆరు రకాలుగా స్కూళ్లు ఉంటాయని, మొత్తం 57 వేల పాఠశాలలను ‘నాడు–నేడు’ ద్వారా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించార‌ని తెలిపారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top