అమరావతి : గుడివాడలో పేర్నినాని కారుపై దాడి ఘటనను వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఖండించారు. ఈ మేరకు బొత్స పోలీసు అధికారులు ఫోన్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సన్నగిల్లుతున్నాయని అన్నారు. పార్టీ నాయకులకు ఏమైనా జరిగితే పోలీసులు బాధ్యత వహించాల్సి ఉంటుందని బొత్స సత్యనారాయణ ఎస్పీకి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆటవిక పాలనకు ఇలాంటి ఘటనలే నిదర్శనమని బొత్స మండిపడ్డారు. కొనసాగుతున్న రెడ్ బుక్ రాజ్యంగం రాష్ట్రంలో ఆటవిక పాలన, రెడ్‌బుక్ రాజ్యాంగం కొనసాగుతుంది. గుడివాడలో పేర్ని నాని లక్ష్యంగా రెండు సార్లు దాడులు జరిగాయి. సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్‌కు అండగా న్యాయ సహాయం కోసం గుడివాడ వెళ్లారు పేర్నినాని,కైలే అనిల్. ఇంటూరిని విడిపించిన తర్వాత స్నేహితుడి ఆహ్వానం మేరకు టీ తాగేందుకు వారి ఇంటికి వెళ్లారు పేర్ని నాని. దీంతో రెచ్చి పోయిన జనసేన, టీడీపీ కార్యకర్తలు పేర్నినాని కారుపై రాళ్ల దాడి చేశారు. అద్దాలు పగుల గొట్టారు. పోలీసుల సమక్షంలో ఇక ఈ ఏపిసోడ్ మొత్తం పోలీసుల సమక్షంలో జరగడం గమనార్హం. పోలీసుల సమక్షంలో దాడులకు తెగబడ్డారు టీడీపీ, జనసేన కార్యకర్తలు. అటు దాడులు గురించి సమాచారం తెలుసుకుని టిడ్కో గృహాల వద్ద మరో కారును ఉంచారు పేర్ని నాని కారు డ్రైవర్. అయితే, అక్కడకు వెళ్లిమరీ కారుపై దాడి చేశారు.