బీసీల తోకలు కత్తిరిస్తానన్న బాబెక్కడ..? 

మీడియా స‌మావేశంలో  బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్  

బీసీల రక్షణ కోసం చట్టాలు చేసిన జగన్ ఎక్కడా? 

ఇద్దరు పీకేల మధ్య పాకుతున్న లోకేశ్

బీసీలను అణగదొక్కడంలో మొదటి ముద్దాయి చంద్రబాబే

సామాజిక న్యాయానికి చిరునామా ఆంధ్రప్రదేశ్‌

ఏనాడైనా ఒక్క బీసీని రాజ్యసభకు పంపారా..? 

బీసీలను కేవలం కులవృత్తులకే పరిమితం చేసింది చంద్రబాబే. 

బీసీల రిజర్వేషన్లపై కేసులు వేయించి అడ్డుకున్నది చంద్రబాబు కాదా..?: మంత్రి శ్రీ వేణుగోపాల్‌

రాజ‌మండ్రి: బీసీల తోకలు కత్తిరిస్తానన్న చంద్ర‌బాబెక్కడ..? అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ప్ర‌శ్నించారు. తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిని అని చెప్పుకుంటున్న లోకేశ్‌..ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి కాదు...జాతికి మాత్రమే ప్రధాన కార్యదర్శి అని  ఎద్దేవా చేశారు.  బీసీలకు ఆయన ఒక రక్షణ చట్టం తీసుకొస్తానని చెప్తున్నాడు. 
చరిత్ర తెలుసుకో...లోకేశ్‌...ఎస్సీ, ఎస్టీల తరహాలో బీసీలకు అట్రాసిటీ చట్టం తెస్తాడట అని ధ్వ‌జ‌మెత్తారు.  అలాంటి చట్టాన్ని ముందుగా దాన్ని నీ తండ్రి నారా చంద్రబాబునాయుడు పైనే ప్రయోగించాల్సి వస్తుంద‌న్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌ ఇంకా మీడియాతో ఏం మాట్లాడారంటే:

బీసీలను అణగదొక్కడంలో మొదటి ముద్దాయి చంద్రబాబే:
– తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిని అని చెప్పుకుంటున్న లోకేశ్‌..ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి కాదు...జాతికి మాత్రమే ప్రధాన కార్యదర్శి అని చెప్పుకోవచ్చు. 
– బీసీలకు ఆయన ఒక రక్షణ చట్టం తీసుకొస్తానని చెప్తున్నాడు. 
– చరిత్ర తెలుసుకో...లోకేశ్‌...ఎస్సీ, ఎస్టీల తరహాలో బీసీలకు అట్రాసిటీ చట్టం తెస్తాడట. 
– అలాంటి చట్టాన్ని ముందుగా దాన్ని నీ తండ్రి నారా చంద్రబాబునాయుడు పైనే ప్రయోగించాల్సి వస్తుంది. 
– ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని ఎస్సీల చట్టాన్ని అపహాస్యం చేశాడు. 
– బీసీలను నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తాను అన్నాడు. 
– బీసీలకు రక్షణ చట్టాన్ని మేం ఎప్పుడో తీసుకొచ్చాం. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు నాయి బ్రాహ్మణులను మంగళి అని పిలిస్తే శిక్షార్హుడవుతాడు. 
– అలా నాయీ బ్రాహ్మణులను మాట్లాడిన నీ తండ్రి మొదట శిక్షార్హుడు. 
– మత్స్యకారులను తోలు తీస్తాను అన్నాడు. ఇప్పుడు బీసీల రక్షణ చట్టం అంటే ఎవరు నమ్ముతారు. 
– బీసీల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన మొదటి ముద్దాయి చంద్రబాబు. 

మీరు బీసీలను చైతన్యవంతులను చేసేదేంటి..?:
– లోక్‌సభ, శాసనసభల స్థానాల్లో బీసీలకు ప్రత్యేక కేటాయింపులంటూ ఇప్పుడు లోకేశ్‌ మాట్లాడుతున్నాడు. 
– 1999లో మీ నాన్న బీసీలకు వంద సీట్లు ఇస్తానన్నాడు. ఎన్నిచ్చాడు..? 
– 33.33 శాతం బీసీలకు సీట్లు కేటాయిస్తానన్న టీడీపీ అలా కేటాయించకుండా బీసీలను మోసం చేసిన నీ తండ్రి శిక్షార్హుడా..? కాదా? 
– మార్కెట్‌ కమిటీల్లో 33.3 శాతం ఇస్తానన్నాడు..ఇచ్చాడా? 
– బీసీలకు చైతన్యం ఉండదని నీ అభిప్రాయమా..? నువ్వు బీసీలను చైతన్యవంతులను చేసేందేంటి? మేమెప్పుడూ చైతన్యవంతులమే. 
– మా నాయకుడిని సైకో అంటున్నావు కానీ..నువ్వు సైకోగా మారిపోయావు. 
– మా నాయకుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు 50 శాతం రిజర్వేషన్లను మార్కెట్‌ కమిటీల్లో కల్పించారు. 
– 56 బీసీ కార్పొరేషన్లతో పాటు వివిధ కార్పోరేషన్లు, పదవుల్లో బీసీలకు 50 శాతానికి పైగా పదవులిచ్చి వారి ఎదుగుదలకు తోడ్పడిన వ్యక్తి శ్రీ జగన్‌ గారు. 
– రాజ్యసభలో నాలుగు స్థానాలను బీసీలకు కేటాయించి సామాజిక న్యాయానికి ఒక చిరునామా ఆంధ్రప్రదేశ్‌ అని చేసి చూపించారు. 

బీసీలు చైతన్యవంతులయ్యారు కాబట్టే మీకు 23 సీట్లిచ్చారు:
– మీ పరిపాలనలో ఒక్కరినైనా బీసీలను రాజ్యసభకు పంపారా? 
– బీసీలు చైతన్యవంతులు అయ్యారు కాబట్టే నీ పార్టీని సరైన విధంగా బుద్ధి చెప్పారు. 
– బీసీలను పక్కన పెట్టి ఏ అర్హత లేని నిన్ను మంత్రిని చేసి మూడు శాఖలు కట్టబెట్టిన మీరా మాట్లాడేది..? 
– మళ్లీ ఇప్పుడు వచ్చి మీరు చైతన్యవంతులను చేసేదేంటి? 
– మీ దగ్గర ఒకే అరిగిపోయిన రికార్డు ఉంది..16వేల మంది పదవులు తగ్గిపోయాయని మాట్లాడుతున్నారు. 
– 2014–19 మధ్యలో అధికారంలో ఉండి ఎన్నికలు నిర్వహించని కారణంగా ఈ దుస్థితి ఏర్పడింది. 
– సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్‌ ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయలేమని ఆనాడు కిరణ్‌ కుమార్‌ రెడ్డి అఫడవిట్‌ వేశాడు. 

బీసీ రిజర్వేషన్లపై కోర్టులో కేసు వేయించింది నీ బాబు కాదా?: 
– జగన్‌ గారు 34 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తే కోర్టులో కేసు వేసింది ఎవరు..? 
– నీ తండ్రి భుజం మీద చేయి వేసుకుని తిరిగే ప్రతాప్‌ రెడ్డి కదా కోర్టులో వేసింది..? బీసీల ద్రోహులు మీరా..మేమా..? 
– 16 వేల పదవులు పోవడానికి కారణం తెలుగుదేశం పార్టీ కాదా? 
– మీ నాన్న పాదయాత్ర చేస్తున్నప్పుడు శెట్టిబలిజ సామాజికవర్గ పెద్దలు తమకు రెండు సీట్లు ఇవ్వండి అని అడిగితే..సీటిస్తే గెలుస్తారా అని హేళన చేశాడు. 
– నేడు జగన్‌ గారు మూడు అసెంబ్లీ  స్థానాలు, 2 మండలి స్థానాలు, ఒక రాజ్యసభ ఇచ్చారు. మళ్లీ లోక్‌సభ స్థానం ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. 
– నువ్వు కాదు..నువ్వు పదితలకాయలు పెట్టుకున్నా జగన్‌ గారి సామాజిక న్యాయం ముందు మీరు పనికిరాదు. 
– ఏదో వాగేస్తే చూపించే మీడియా ఉందనుకుంటే పనవ్వదు. 

బీసీలను కేవలం కులవృత్తులకే పరిమితం చేసింది మీరూ:
– మాట్లాడితే ఆదరణ అంటూ బీసీలను కేవలం కులవృత్తులకే పరిమితం చేయాలని చూస్తున్నారు. 
– బీసీలు మీ వద్దే అప్పుల పాలై అణగారిన వర్గాలుగా, చైతన్య హీనులుగా బతకాలనేదే మీ అలోచన. 
– బీసీలు చైతన్యవంతులయ్యారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ వచ్చాక బీసీల జీవితాల్లో మార్పులు వచ్చాయి. 
– ఐటీ 1997లో వస్తే ఏ బీసీ అయినా ఐటీలోకి వెళ్లాలని మీ తండ్రి భావించాడా? 
– 2004లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వచ్చిన తర్వాత బీసీలు ఉన్నత చదువులు చదివారు. 
– ఐదేళ్లకోసారి ఒక ఇస్త్రీ పెట్టె ఇచ్చి బీసీలు ఇక అలానే ఉండాలని కోరుకుంటన్నారు. 
– బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ లక్ష్యం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారికి ఉంది. ఆయన గురించి మీకు మాట్లాడే అర్హత లేదు. 
– చేసిన తప్పులన్నీ మీవి...మీ వల్ల ఈ రాష్ట్రం నాశనం అయ్యింది. 
– రెండు పీకేలను పెట్టి..మధ్య లోకేశ్‌ ఉన్నాడు. ఒక పీకే పనికిరాడని ఇంకో పీకేని తెచ్చారు..మధ్యలో లోకేశ్‌ దూరుతున్నాడు. 
– ప్రజలందరూ నిన్ను పప్పు అన్నారు. ఈ పప్పులో ఉప్పు కలుపుదామని పీకేను తెచ్చాడు. 
– ఆ పీకే పనికి రాడని..ఇంకో పీకేని రాకీ సాల్ట్‌లా తీసుకొచ్చాడు.
– ప్రజల్ని మోసం చేయడానికి ఇంత మంది మారువేషగాళ్లు అవసరమా? 
– పోలవరం ఏటీఎంలా బాబు ఉపయోగించుకున్నాడని సాక్షాత్తు ప్రధాని మోడీనే అన్నాడు. 
– మీ వాడు బాగుపడాలని మీరు చేపట్టిన ఏ స్కీం తీసినా స్కామే. 
– పీజు రీయింబర్స్‌మెంట్‌ 50 శాతానికి తగ్గించింది చంద్రబాబే. 
– ఆరోగ్యశ్రీకి 25 లక్షలు ఇస్తూ దేశంలోనే చరిత్ర సృష్టిస్తున్న నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. 
– అలాంటి వ్యక్తి సైకోనా...ఈ వాగుడు వాగే నువ్వు సైకోనా..? ప్రజలు ఎవరు సైకోనో తెలుసుకోలేరనుకుంటున్నావా? 
– బీసీలను మోసగించిన, వంచించిన, ద్రోహం చేసిన మీ గురించి తెలుసుకునే మీకు 23 ఇచ్చారు. 
– రేపు రానున్న ఎన్నికల్లో మరింతగా బుద్ధిచెప్పబోతున్నారు. 
– సంస్కార హీనుడవైన నువ్వు సైకో అనే పదం వాడుతున్నావు. 

Back to Top