మీడియా ప్ర‌తినిధుల‌పై దాడి టీడీపీ చ‌ర్యే

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నందిగం సురేష్‌

విజయవాడ: మీడియా సోదరులపై దాడి చేయడం దారుణమని, రైతుల ముసుగులో ఉన్న టీడీపీ వారే దాడి చేశార‌ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు. ఉద్దండరాయునిపాలెం వద్ద బీజేపీ నేత కన్నాలక్ష్మీనారాయణ చేస్తున్న నిరసనను కవర్‌ చేయడానికి వెళ్లిన మీడియా సోదరులపై జరిగిన దాడిని ఎంపీ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమస్య ఉంటే నిరసన తెలియజేయాలి.. పోలీస్‌ వ్యవస్థ కూడా పర్మిషన్‌ ఇచ్చింది.. నిరసన రూపంలో ఏదైనా తెలియజేయాలని కానీ, దాడులకు తెగబడడం మంచిపద్ధతి కాదన్నారు. నాయకులు, ప్రజల ప్రతికష్టాన్ని ప్రపంచానికి చూపించే మీడియా సోదరులు మాత్రమేనని, అలాంటి వారిపై దాడి చేయడం బాధాకరమన్నారు. టీడీపీ వారే కొంతమంది మీడియా సోదరులపై దాడి చేశారని, రైతులకు దాడి చేసే ఉద్దేశం ఉండదన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్‌ వ్యవస్థ గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. 

తాజా ఫోటోలు

Back to Top