ముఖ్య‌మంత్రికి ఆర్య‌వైశ్య సంఘం కృత‌జ్ఞ‌త‌లు

స‌చివాల‌యం: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డికి రాష్ట్ర ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. స‌చివాల‌యంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను ఆర్య‌వైశ్య సంఘం నేత‌లు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఆర్య వైశ్య సత్రాలు, ఆర్య వైశ్య అన్నదాన సత్రాల నిర్వహణ ఆర్య వైశ్యులకే అప్పగిస్తూ కేబినెట్‌లో తీర్మానం చేసి ఆమోదించిన సందర్భంగా ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు వెంకటేశ్వర స్వామివారి జ్ఞాపిక, పుష్పగుచ్చం అందజేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఏపీ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్, ఆర్టీఐ కమిషనర్‌ రేపాల శ్రీనివాస్, విజయవాడ అర్బన్‌ జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు కొనకళ్ళ విద్యాధర రావు ఉన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top