సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కుప్పం ప‌ర్య‌ట‌న‌కు చ‌క‌చ‌కా ఏర్పాట్లు

 చిత్తూరు జిల్లా : సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 22న కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్యటించ‌నున్నారు. ఈ మేర‌కు ఏర్పాట్లు చ‌క‌చ‌కా సాగుతున్నాయి. శ‌నివారం ఏర్పాట్ల‌ను జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్‌, మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ కె.నారాయణస్వామి, సీఎం ప్రోగ్రాం కో-ఆర్డినేట‌ర్ త‌ల‌శీల ర‌ఘురామ్ ప‌రిశీలించారు.   ముఖ్యమంత్రి పర్యటనకు హెలిప్యాడ్‌ స్థలాలను, స‌భా వేదిక‌ను, కుప్పం మున్సిపాలిటీలో రూ.66 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు సంబంధించి ఏర్పాట్ల‌పై స‌మీక్షించారు. కార్య‌క్ర‌మంలో ఎంపీ రెడ్డ‌ప్ప‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్‌, అధికారులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top