అసెంబ్లీ కమిటీల నియామక ఉత్తర్వులు జారీ

తాడేపల్లి: అసెంబ్లీలో పలు కమిటీలు నియమిస్తూ అసెంబ్లీ కార్యదర్శి కృష్ణమాచార్యులు ఉత్తర్వులు జారీచేశారు. రూల్స్‌ కమిటీ చైర్మన్‌గా స్పీకర్‌ తమ్మినేని సీతారాం నియమితులయ్యారు.  సభ్యులు ఆనం రాంనారాయణరెడ్డి, వెంకట చిన్నఅప్పలనాయుడు, ధర్మాన ప్రసాదరావు, మానుగుంట మహీధర్‌రెడ్డి,  బద్దుకొండ అప్పలనాయుడు, వల్లభనేని వంశీని నియామించారు.

పిటీషన్‌ కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, సభ్యులుగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వసంత కృష్ణప్రసాద్, కాసు మహేష్, ముదునూరి ప్రసాదరాజు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఏలూరి సాంబశివరావులను నియమించారు.

సభాహక్కుల కమిటీ చైర్మన్‌గా కాకాణి గోవర్ధన్‌రెడ్డి నియామకం. సభ్యులుగా మల్లాది విష్ణు, వెంకట రమణమూర్తిరాజు, చిన్నఅప్పలనాయుడు, వరప్రసాదరావు, శిల్పా చక్రపాణి, అనగాని సత్యప్రసాద్‌లను నియమించారు.

ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా కొట్టు సత్యనారాయణను నియమించారు. సభ్యులుగా పర్వత పూర్ణచంద్రప్రసాద్, అబ్బయ్య చౌదరి, మేడా వెంకట మల్లికార్జునరెడ్డి, అబ్దుల్‌ హఫీజ్‌ ఖాన్, పీ.జీ.వీ.ఆర్‌ నాయుడులను నియమించారు.

ఎథిక్స్‌ కమిటీ చైర్మన్‌గా అంబటి రాంబాబు నియమితులయ్యారు. సభ్యులుగా చెన్నకేశవరెడ్డి, మొండితోక జగన్‌మోహన్‌రావు, రఘురామిరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరిలను నియమిస్తూ అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు.

Read Also: చంద్రబాబు చిన్న మెదడు చితికినట్లుంది

Back to Top