విజయవాడ: అక్రమ మద్యం కేసులో వైయస్ఆర్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. విజయవాడలో విచారణకు హాజరైన ఆయన్ని సిట్ అదుపులోకి తీసుకుంది. రేపు కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ కేసులో ఆయన ఏ4 నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. విచారణకు ముందు.. ఆయన ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి సిట్ కార్యాలయానికి వెళ్లారు. శనివారం ఉదయం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తనపై కేసులు రాజకీయ కక్షతో పెట్టినవే అని అన్నారు. తానొక ఎంపీనని, మద్యం పాలసీ రూపకల్పనలో తన ప్రమేయం ఎందుకు ఉంటుంది? అని ప్రశ్నించారు. అదే సమయంలో వైయస్ఆర్‌సీపీ కీలక నేతలు ఇదంతా కూటమి ప్రభుత్వ కుట్రేనని మండిపడ్డారు. విచారణ సమయంలో సిట్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.