సీఎం వైయ‌స్ జగన్‌కు రుణపడి ఉంటాం 

 సీఎం వైయ‌స్ జగన్‌ ప్రత్యేక చొరవ.. 48 గంటల్లో భూవివాదం పరిష్కారం

సెల్ఫీ వీడియో తీసుకున్న రైతు కుటుంబం

వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం

వైయ‌స్సార్‌ జిల్లా: భూవివాదం విషయంలో సెల్ఫీ వీడియో తీసుకున్న కుటుంబం వార్త కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఆ కుటుంబ సమస్య పరిష్కారమైంది. ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఆ సమస్యకు  పరిష్కారం లభించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వైయ‌స్సార్‌ కడప జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లె గ్రామానికి చెందిన అక్బర్‌ బాషాకు సంబంధించిన పొలం వివాదం ఉంది. తనకు న్యాయం చేయాలని అక్బర్ కుటుంబంతో కలిసి సెల్ఫీ వీడియో తీసుకున్నారు.

అతడి సమస్యపై ముఖ్యమంత్రి కార్యాలయం తక్షణం స్పందించింది. ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ చొరవతో సమస్యను 48 గంటల్లోనే పరిష్కారమైంది. ఆ పొలం వివాదం సమసిపోయింది. ఈ విషయాన్ని బాధితుడు అక్బర్‌ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలిపాడు. తమకు సీఎం వైయ‌స్ జగన్‌ న్యాయం చేశారని చెప్పారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ తిరుపాల్ రెడ్డి సమష్టి కృషితో సమస్య పరిష్కారమైందని వివరించాడు. తమ పొలం సమస్య పరిష్కారానికి కృషి చేసిన సీఎం వైయ‌స్ జగన్‌కు రుణపడి ఉంటామని ప్రకటించాడు.

తాజా వీడియోలు

Back to Top