మాట ఇచ్చాను... వెనక్కు తగ్గేది లేదు

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్   

మానవ సంబంధాలు నాశనం కానివ్వను

అక్క చెల్లెమ్మల కన్నీళ్లు తుడుస్తా 

అమ‌రావ‌తి:  మద్య నిషేధం విషయంలో మాటిచ్చిన తాను, వెనక్కు తగ్గేది లేదని ఏపీ సీఎం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టిన ఆయన, "మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయని, అక్క చెల్లెమ్మల కన్నీళ్లు తుడుస్తానని మాట ఇచ్చాను. నిషేధం దిశగా అడుగులేస్తూ బెల్టుషాపుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. మద్యం అమ్మకాల బాధ్యతను ప్రభుత్వానికే అప్పగిస్తూ చట్టాన్ని తెచ్చాం. తద్వారా గ్రామాల్లో బెల్టుషాపులు పూర్తిగా మూతబడతాయి" అని పేర్కొన్నారు. 

Back to Top