సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కొత్త జిల్లాల ఏర్పాటు అధ్యయన కమిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని నేతృత్వంలో అధ్యయన కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయించింది. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు జిల్లాల ఏర్పాటుకు అవసరమైన ప్రక్రియ పూర్తిచేయాలని కేబినెట్ నిర్ణయించింది. జిల్లాల ఏర్పాటుపై మంత్రుల అభిప్రాయాన్ని తీసుకున్న అనంతరం పార్లమెంట్ సరిహద్దుల ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటు ఉంటుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మంత్రివర్గ సభ్యులకు తెలియజేశారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం వైయస్ జగన్ తెలిపారు. పాఠశాలల్లో జరిగే `నాడు - నేడు` పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా ఇసుక కార్పొరేషన్ ఏర్పాటుపై మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సీపీఎస్ రద్దు కోసం ఆందోళనలు చేసిన ఉద్యోగులపై గత ప్రభుత్వం పెట్టిన కేసులు ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రత్యేక కార్పొరేషన్, ట్రిపుల్ ఐటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.