అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం 9.00 గంటలకు ఆంధ్రప్రదేశ్ శానససభ సమావేశాలు ప్రారంభం కాగా, మండలి సమావేశాలు 10.00 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత శాసన సభా వ్యవహారాలు సలహా కమిటీ సమావేశం కానుంది. ముందుగా అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ప్రారంభం కాగా చంద్రబాబు అరెస్టుపై టీడీపీ వాయిదా తీర్మానం కోరింది. పదే పదే ప్రశ్నోత్తరాలను టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. స్పీకర్‌పై టీడీపీ సభ్యులు పేపర్లు విసిరారు. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయనుంది. సమావేశాలు సజావుగా సాగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.