ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు ప్రారంభం 

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ రెండో రోజు సమావేశాలు  ప్రారంభమయ్యాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్‌ శంబంగి చిన వెంకట అప్పల నాయుడు... గుంటూరు జిల్లా నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తన తల్లి మరణం కారణంగా తొలి రోజు శాసనసభలో ప్రమాణం చెయ్యలేదు. బుధవారం ప్రమాణాస్వీకారం చేయని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డితో నేడు ప్రొటెం స్పీకర్‌ చిన అప్పలనాయుడు ప్రమాణాస్వీకారం చేయించారు. దీంతో మొత్తం సభ్యుల ప్రమాణ స్వీకార ఘట్టం పూర్తయ్యింది. అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు ప్రొటెం స్పీకర్‌ ప్రకటించారు. కాగా ఆంధ్రప్రదేశ్‌ 15వ శాసనసభలో 173 మంది శాసనసభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం నిరాడంబరంగా, సంప్రదాయబద్ధంగా పూర్తయిన విషయం తెలిసిందే.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top