చేతగానితనానికి కేరాఫ్ అడ్రస్ నారా లోకేష్  

రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌

 నెల్లూరు: చేతగానితనానికి కేరాఫ్ అడ్రస్ నారా లోకేష్‌ అని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఎద్దేవా చేశారు. తండ్రి, తాతలను అడ్డం పెట్టుకుని లోకేష్‌లా తాము రాజకీయాలు చేయడం లేదని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఆశీస్సులతోనే రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 7 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తయినట్లు  ఆయ‌న తెలిపారు.

శనివారం జిల్లాలో మంత్రి ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా అనిల్‌కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ.. నారా లోకేష్ విమర్శలు హాస్యాస్పదమని విమర్శించారు. లోకేష్‌ను చూసి ఎవరూ భయపడరని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేసిందని మండిపడ్డారు. లక్షా 30 వేల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిదని ప్రశంసించారు.
చిల్లర రాజకీయాలు లోకేష్ ఇకనైనా మానాలని మంత్రి అనిల్‌ కుమార్‌ హితవు పలికారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top