కేబినెట్‌ భేటీ ప్రారంభం

సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం  సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో భౌతిక దూరం పాటిస్తూ జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రిమండ‌లి సభ్యులందరూ హాజరయ్యారు. భేటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల వైయస్‌ఆర్‌ చేయూత పథకంపై, చిరువ్యాపారుల ప్రభుత్వ సహాయం పథకం ప్రధానంగా సమావేశంలో చర్చకు రానున్నాయి. వీటితో పాటు మూడు సవరణ బిల్లుల ముసాయిదాలపై కేబినెట్‌ చర్చించే అవకాశం ఉంది. పర్యావరణ, జీఎస్టీ, ఉన్నత విద్యా కమిషన్‌ సవరణ బిల్లులపై చర్చించనున్నారు. ఇక అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ, కురుపాం ఇంజినీరింగ్‌ కాలేజీ, 3 నర్సింగ్‌ కాలేజీలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వైద్య, ఆరోగ్య శాఖలో భారీగా పోస్టుల భర్తీపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top