వైయ‌స్ఆర్‌సీపీలోకి అన‌కాప‌ల్లి టీడీపీ నేత 

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరిన మ‌ల‌శాల భ‌ర‌త్‌కుమార్ కుటుంబం

తాడేప‌ల్లి:  అన‌కాప‌ల్లి టీడీపీ నేత మ‌ల‌శాల భ‌ర‌త్ కుమార్ కుటుంబం వైయ‌స్ఆర్‌సీపీ గూటికి చేరింది. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయ‌స్‌ జగన్‌ సమక్షంలో అనకాపల్లి టీడీపీ నేత మలశాల భరత్‌ కుమార్, తల్లిదండ్రులు రమణారావు (విశాఖ డెయిరీ డైరెక్టర్‌), ధనమ్మ (మాజీ ఎంపీపీ) వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.

ఈ సందర్భంగా భరత్‌కుమార్‌తో పాటు గంగుపాం నాగేశ్వరరావు (మాజీ డీసీఎంఎస్‌ ఛైర్మన్‌), మలశాల కుమార్‌ రాజా (విశాఖ జిల్లా తెలుగుయువత ప్రధాన కార్యదర్శి) త‌దిత‌రులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. వీరికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 
కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల వైయ‌స్ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, అనకాపల్లి జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top