బాబు, పవన్‌, కన్నా విధానాలు ఒక్కటే 

 విపత్కర పరిస్థితుల్లో కూడా రాజకీయ విమర్శలు సిగ్గుచేటు

ఆర్థికసాయం పంపిణీలో అవినీతి జరిగినట్లు చూపిస్తే చర్యలు

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

అమరావతి : కరోనా వైరస్‌ను ఎదుర్కునేందుకు దేశమంతా సంఘటితంగా పోరాడుతుంటే.. టీడీపీ నేతలు మాత్రం రాజకీయ విమర్శలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా చంద్రబాబు రాజకీయ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, కన్నా లక్ష్మీనారాయణ విధానాలు ఒకేలా ఉన్నాయని విమర్శించారు. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోటి 33 లక్షల మందికి రూ.1000 అందిస్తే.. దాన్ని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు.

ఆ వీడియో ఎక్కడిదో బయటపెట్టాలి..
రూ.1000 పంపిణీలో అవినీతి జరిగినట్లు చూపిస్తే ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకుంటుందన్నారు. రూ. 1000 ఇచ్చి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలన్నట్లుగా కన్నా లక్ష్మీనారాయణ ఓ వీడియో పెట్టారని.. చిత్తశుద్ధి ఉంటే ఆ వీడియో ఎక్కడిదో బయటపెట్టాలని సవాల్‌ విసిరారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రెవెన్యూ లోటు కింద కేంద్రం నిధులు విడుదల చేసిందన్నారు. ఏపీతో పాటు 13 రాష్ట్రాలకు ఆ నిధులు విడుదలయ్యాయని, అంతేకాని ఏపీకి ప్రత్యేకంగా ఇచ్చిదేమీ లేదని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top