దమ్ముంటే ఆ వీడియో మాధవ్‌దని నిరూపించండి

టీడీపీకి మంత్రి సురేష్‌ సవాల్‌

ఆ వీడియోపై విచారణ చేస్తాం

ఐటీడీపీ వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం

తాడేప‌ల్లి: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌పై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని, దమ్ముంటే ఆ వీడియో నిజమైనదేనని నిరూపించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ఒక ప్రకటనలో సవాల్‌ విసిరారు. సోషల్‌ మీడియాలో వచ్చిన వీడియో మార్ఫింగ్‌ చేసినదేనని ఆయన చెప్పారు.

దమ్ముంటే అది మాధవ్‌దే అని నిరూపించాలి తప్ప రోజూ అదే పనిగా రాజకీయ విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఈ వీడియోపై పూర్తిస్థాయి విచారణ చేసి దీన్ని సృష్టించిన ఐటీడీపీ వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దోషులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, వైఎస్సార్‌సీపీకి పెరుగుతున్న జనాదరణ చూసి టీడీపీ నాయకులకు దిక్కుతోచటంలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు టీడీపీని తిరస్కరిస్తున్నా ఆ పార్టీ నేతలకు బుద్ధి రావటంలేదని, ప్రజాక్షేత్రంలో వారు మరోసారి అభాసుపాలు కాక తప్పదని మంత్రి చెప్పారు.  

Back to Top