20న వైయ‌స్ఆర్‌సీపీ విస్తృత‌స్థాయి స‌మావేశం

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైయ‌స్ జ‌గ‌న్‌ కార్యక్రమాల్లో మార్పులు 

తాడేపల్లి: ఈనెల 21న అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్ మోహన్ రెడ్డి కార్యక్రమాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. 

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని పార్టీ ముందుకు జరిపింది. ఈనెల 22కు బదులుగా ఈనెల 20నే విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనుంది. ఇటీవలి ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీచేసిన అభ్యర్థులు ఈ స‌మావేశానికి హాజరవుతారు. అలాగే పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీచేసిన అభ్యర్థులు (ఎంపీలు మినహా) ఈ సమావేశానికి హాజరవుతారు. పార్టీ అధ్యక్షుడు వీరికి దిశానిర్దేశం చేయనున్నారు.
అలాగే రేపటి (జూన్‌ 19నాటి) పులివెందుల పర్యటనను వైయస్‌.జగన్ మోహన్ రెడ్డి వాయిదా వేసుకున్నారు.
 

Back to Top