రేపు విజయవాడలో కౌంటింగ్‌ ఏజెంట్లకు శిక్షణ

విజయవాడ: కౌంటింగ్‌ రోజు అనుసరించాల్సిన విధానాలపై 16వ తేదీ గురువారం విజయవాడలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. చంద్రబాబు ప్రవర్తన చూస్తుంటే అలర్లు సృష్టించే అవకాశం ఉన్నట్లుందని, పోలింగ్‌ రోజు టీడీపీ నేతలు, కార్యకర్తలు అనేక గొడవలు చేశారన్నారు. పోలింగ్‌ రోజు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఏ విధంగా పనిచేశారో.. కౌంటింగ్‌ రోజు చివరి ఈవీఎం లెక్కింపు వరకు ప్రశాంతంగా జరిగేలా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లెక్కింపును ఏ విధంగా పర్యవేక్షించాలని, జరిగే అవకతవకలను అధికారుల దృష్టికి ఏ విధంగా తీసుకెళ్లి ప్రశ్నించాలని 16న విజయవాడలో మీటింగ్‌ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కౌంటింగ్‌ కోసం వచ్చే లీడర్లకు అందరికీ అనుసరించాల్సిన విధానాలపై దిశా నిర్దేశం చేయడం జరుగుతుందన్నారు. 

Back to Top