మ‌లేసియాలో చిక్కుకున్న యువ‌కుల‌ను ర‌క్షించాలి

కేంద్ర మంత్రికి విజ‌య‌సాయిరెడ్డి లేఖ‌
 

హైదరాబాద్‌: మలేసియాలో చిక్కుకున్న నలుగురు తెలుగు యువకులను రక్షించాలంటూ వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, విదేశాంగ శాఖా మంత్రి సుష్మాస్వరాజ్‌కు లేఖ రాశారు. బాధితులు విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం రాజాంకు చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు. ఉపాధి నిమిత్తం వారు మలేసియాకు వెళ్లినట్లు తెలిసిందని,  మలేసియాకు వెళ్లిన వెంటనే వారి పాస్‌పోర్టులు లాక్కుని ఏజెంట్‌ చించేశాడని ఆ తర్వాత గదిలో బంధించాడని తెలిపారు. మలేసియాలో చిక్కుకున్న యువకుల్ని సహృదయంతో కాపాలడాలని సుష్మను కోరారు.
 
 

తాజా ఫోటోలు

Back to Top