తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో సెంట్రల్ ఆఫీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై, మరీ ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలు, యాక్టివిస్ట్లపై పెడుతున్న అక్రమ కేసులను ధీటుగా ఎదుర్కొని, అన్ని విధాలుగా వారికి అందుబాటులో ఉండేందుకు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు "సెంట్రల్ ఆఫీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్"ను ఏర్పాటు చేసినట్లు ప్రకటనలో తెలిపారు. సెంట్రల్ ఆఫీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సభ్యుల వివరాలు... 1) జె. సుదర్శన్ రెడ్డి (సీనియర్ అడ్వకేట్) - 9440284455 2) కొమ్మూరి కనకారావు (మాజీ ఛైర్మన్, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్) - 9963425526 3) దొడ్డా అంజిరెడ్డి (రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ అర్గనైజింగ్ ప్రెసిడెంట్) - 9912205535 పార్టీ క్యాడర్‌పై అక్రమ కేసులకు సంబంధించి ఎవరికి ఎలాంటి సహాయం కావాల్సి వచ్చినా వెంటనే వీరిని సంప్రదిస్తే తగిన చర్యలు తీసుకుంటారు.