అన్నా ఆదుకోండి...జీడి కార్మికుల వినతి

పలాస: జీడి కార్మికుల సమస్యల పరిష్కారానికి  చొరవ చూపుతామని, వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. పలాస నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జననేతను పలువురు జీడి పల్పింగ్ కేందారల కార్మికులు కలుసుకుని తాము పడుతున్న అగచాట్లను వివరించారు. రోజంతా పనిచేసినా కనీస కూలీ రావడం లేదని, తాము ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నామని, పల్పింగ్ కారణంగా , చేతి ముద్రలు చెరిగిపోతు్నాయని, ఫలితంగా రేషన్ షాపుల్లో సరుకులు ఇవ్వడం లేదని వారు ఆవేదన వెలిబుచ్చారు. వీరి బాధలన్నిటినీ విన్న జననేత అధికారంలోకి రాగానే 45 ఏళ్లు నిండిన వారందరికీ ఫించను ఇచ్చే పథకంలో వీరికి లబ్ధి చేకూర్చడంతోపాటు ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top