తిత్లీ బాధితులతో పరిహాసం ఆడుతున్న ప్రభుత్వం

జననేతను కలుసుకున్న ప్రజా సంఘాలు

తిత్లీ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయినప్పటికీ పరిహారం పేరుతో ప్రభుత్వం పరిహాసం చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్వచ్ఛంధంగా వచ్చి సాయం అందించిన వారితో సహా, పరిహారం గురించి ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టారంటూ వాపోయారు.

పలాస నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని పలు ప్రజా సంఘాల నేతల కలుసుకున్నారు. తిత్లీ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయినప్పటికీ పరిహారం పేరుతో ప్రభుత్వం పరిహాసం చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్వచ్ఛంధంగా వచ్చి సాయం అందించిన వారితో సహా, పరిహారం గురించి ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టారంటూ వాపోయారు. అలాగే మహేంద్ర తనయ ఆఫ్ షోర్ రిజర్వాయర్ నుంచి జంతిబంద వరకు పొడిగిస్తే ఉద్ధానం నీటి సమస్య పరిష్కారమవుతుందని వారు సూచిస్తూ వారు జననేతకు మెమొరాండం సమర్పించారు. టిడిపి నేతలు, వారి అనుచరులకు తప్ప మరెవరికీ పరిహారం అందలేదని ఈప్రతినిధి బృందంలోని రైతులు జననేతకు వివరించారు. వీరి సమస్యలన్నిటినీ విన్న వైయస్ జగన్ , మన అందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేసులు ఎత్తివేయడంతో పాటు పరిహారం అందరికీ చెల్లిస్తామని భరోసా ఇచ్చారు.

Back to Top