స్థానిక ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ దూకుడు

చేతులెత్తేసిన చంద్రన్న

ఓటమి భయంతో హడలెత్తిపోతున్న తమ్ముళ్లు  

పోటీకి ముందుకు రాని పచ్చ పార్టీ నేతలు

సంక్షేమమే ప్రచారాస్త్రం..అభివృద్ధే వైయస్‌ఆర్‌సీపీ ఆయుధం

అమరావతి:  పల్లెపోరు మొదలైంది. గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది. ఎన్నికలకు ముందే చంద్రబాబు చేతులెత్తేశారు. ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. స్థానిక ఎన్నికలంటే చంద్రబాబు హడలి పోతున్నారు.  వైయస్‌ఆర్‌సీపీ దూకుడుతో వెళ్తోంది. అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారైంది. టీడీపీకి మాత్రం లోకల్‌ వార్‌ చెమటలు పట్టిస్తోంది. సరైన అభ్యర్థులు దొరక్క ఆ పార్టీ ఆపసోపాలు పడుతోంది. ఎంపీటీసీల పరిస్థితైతే మరింత దయనీయంగా ఉంది. క్రియాశీలక కార్యకర్తలు, నాయకులు టీడీపీ తరఫున పోటీ చేసేందుకు గ్రామాల్లో ముందుకు రావడం లేదు. ఓడిపోతామన్న భయం వారిని పట్టుకుంది. జెడ్పీటీసీల విషయంలోనైతే ఎక్కడా క్లారిటీ లేదు. ఇంతవరకు అభ్యర్థుల ఎంపికపై సమావేశం కావడం లేదంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. సమయం దగ్గరపడటంతో ఎవరో ఒకర్ని నిలబెట్టి, మమ అనిపించేద్దామనే అభిప్రాయానికొచ్చేశారు. 

వైయస్‌ఆర్‌సీపీలో రెట్టింపు ఉత్సాహం..
 టీడీపీ ఒకపక్క నీరసంతో కుదేలు కాగా.. వైయస్‌ఆర్‌ సీపీ రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతోంది.  ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్ష అని భావిస్తున్నది. నిరంతరం ప్రజల మధ్యనే ఉండటం ఒక ప్లస్‌ అయి తే, ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందడం మరో ప్లస్‌గా నిలిచింది.  ఇప్పుడెక్కడ చూసినా వైయస్‌ఆర్‌సీపీ  తరపున పోటీ చేయాలన్న ఆత్రుతే కనబడుతున్నది. విజయం సాధిస్తామన్న ధీమాతో ఆశావహులు పోటీ పడుతున్నారు. అభ్యర్థుల ఎంపిక నియోజకవర్గ ఎమ్మెల్యేలకు, ఇన్‌చార్జ్‌లకు అప్పగించడంతో ఆశావహుల తాకిడి మరింత ఎక్కువైంది. అయినప్పటికీ ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడిన గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించడంతో అభ్యర్థుల ఎంపిక సులువైంది.  

టీడీపీలో ఉక్కిరిబిక్కిరి
టీడీపీకి స్థానిక ఎన్నికల భయం పట్టుకుంది. ఇటీవల చంద్రబాబు అనుసరిస్తున్న తీరు ఆ పార్టీ నేతలకు శాపంగా మారింది. ఇంగ్లీష్‌ మీడియం వద్దన్నారు. అమరావతి ఒక్కటే ముద్దు అన్నారు. బీసీలకు వైయస్‌ జగన్‌ 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకోగా చంద్రబాబు తన మనిషి బిర్రు ప్రతాప్‌రెడ్డితో సుప్రీం కోర్టులో కేసు వేయించారు.  ఎన్నికలే జరగకుండా మరికొన్ని సాకులతో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కానీ ప్రభుత్వం ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి తీరాలని పట్టుదలతో ముందుకెళ్లింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది.   ఎన్నికలు నిర్వహిస్తే స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులొస్తాయి. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా టీడీపీ ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వహించలేదు. ఎన్నికలకు వెళితే ఓడిపోతామన్న భయంతో జాప్యం చేస్తూ వచ్చింది. ఈలోగా సార్వత్రిక ఎన్నికలు జరగడం, వైయస్‌ఆర్‌సీపీ  అధికారంలోకి రావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక అధికారంలోకి వచ్చిన వైయస్‌ఆర్‌సీపీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని మొదటి నుంచి ఆలోచిస్తూ వచ్చింది. కోర్టు చిక్కులను అధిగమించి ఎట్టకేలకు ఎన్నికలకు ముందుకెళ్లింది. 

వైయస్‌ జగన్‌ 9 నెలల పాలన ఇలా.. 

 వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక: 28,83,815 మంది కి  రూ. 6,406.59 కోట్లు పంపిణీ చేశారు.

 అమ్మఒడి :
పిల్లలను బడికి పంపించిన తల్లి ఖాతాలో రూ.15 వేల చొప్పున జమా చేశారు. 1వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదివే విద్యార్థులకు ఈ పథకాన్ని అమలు చేశారు. రాష్ట్రంలో 19,65,589 మంది విద్యార్థుల చదువు కోసం రూ.2, 948.38 కోట్లు ఖర్చు పెట్టారు.

 వైయస్‌ఆర్‌ రైతు భరోసా:
రాష్ట్రంలో రైతులకు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వైయస్‌ఆర్‌ రైతు భరోసా పేరుతో పెట్టుబడి సాయం రూ.13,500 చొప్పున అందజేశారు. రాష్ట్రంలో 21,79,146 మంది రైతులకు రూ.3,061.23 కోట్లతో భరోసా కల్పించారు.

 ఆరోగ్యశ్రీ :
దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేసేలా చట్టం తెచ్చారు. రాష్ట్రంలో 3,26,597 మందికి రూ.792.59 కోట్లు ఖర్చు పెట్టారు.

 జగనన్న వసతి దీవెన :
పాలిటెక్నిక్‌, డిగ్రీ, పీజీ వంటి చదువులు చదువుతున్న విద్యార్థులకు హాస్టల్‌ ఖర్చులు, బోర్డింగ్‌ చార్జీల నిమిత్తం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జననన్న వసతి దీవెన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇటీవలే విజయనగరం జిల్లాలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి ఒక విడత డబ్బులు తల్లుల ఖాతాల్లో జమా చేశారు. రాష్ట్రంలో 4,75,992 మంది విద్యార్థుల హాస్టల్‌ వసతి కోసం రూ.455.08 తల్లుల అకౌంట్‌లో వేశారు.

 వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం :
రాష్ట్రంలోని చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం వైయస్‌ జగన్‌ వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేశారు. రాష్ట్రంలోని 71,980 మంది చేనేతలకు రూ.172.75 కోట్లు పంపిణీ చేశారు.

వైయస్‌ఆర్‌ వాహన మిత్ర :
ఆటో, ట్యాక్సీలు నడుపుకుంటున్న వారికి ఇన్సూరెన్స్‌, మరమ్మతులు, ఇతర అవసరాల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున సీఎం వైయస్‌ జగన్‌ అందజేశారు. రాష్ట్రంలో 1,07,337 మంది వాహనదారుల (ఆటో, టాక్సీ)కు రూ.107.34 కోట్లు ఇచ్చారు. 

 మత్స్యకార భరోసా :
రాష్ట్రంలోని మత్స్యకారులను ఆదుకునేందుకు, వేట సమయంలో ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందజేశారు. 94,706 మంది మత్సకారులకు చేపల వేట లేని సమయంలో రూ.94.71 కోట్లు చెల్లించి భరోసా కల్పించారు.

 వైయస్‌ఆర్‌ లా నేస్తం :
రాష్ట్రంలో న్యాయవాద కోర్సులు చదువుతూ, ప్రాక్టిస్‌ చేస్తున్న యువ న్యాయవాదులకు వైయస్‌ఆర్‌ లా నేస్తం ప్రవేశపెట్టారు. 708 మంది  లాయర్ల కోసం రూ.1.06 కోట్లు ఖర్చు చేశారు. 

బీసీల సంక్షేమం:
సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బీసీల సంక్షేమానికి పెద్ద పీఠ వేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే శాశ్వత బీసీ కమిషన్‌ ఏర్పాటు చేశారు. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. మొత్తం 81,05,870 మంది  బీసీ లబ్దిదారుల కోసం 14,039.73 కోట్లు ఖర్చు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున బీసీలకు అదనంగా 10 శాతం సీట్లు ఇస్తున్నారు.  ఈ క్రమంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ఖాయమైంది.

Back to Top