జీవితాల్లో వెలుగులు

10 నుండి వైయస్‌ఆర్‌ కంటి వెలుగు ప్రారంభం 

వైయస్‌ఆర్‌ కంటి వెలుగు ద్వారా దృష్టిదోషాలు ఇకదూరం

ప్రాంతీయ, సర్వజన ఆసుపత్రుల్లో నేత్ర చికిత్సలు పూర్తి ఉచితం

ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం

అమరావతి: సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. శరీరంలో కళ్లు అతి ముఖ్యమైనవి. అవి సరిగా లేకుంటే ప్రపంచం అంతా చీకటే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు నడివయస్కులు ఎంతో మంది నేత్ర సంబంధిత వ్యాధులతో సతమతం అవుతున్నారు. చిన్నారులకు సైతం కంటి సమస్యలు ఎక్కువౌతున్నాయి. రాష్ట్రంలో ఏ ఒక్కరికీ కంటి సమస్యలు ఉండకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 10 నుంచి వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒకప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వినికిడి సమస్యతో బాధపడే ఎందరో చిన్నారులకు ఉచిత శస్త్ర చికిత్సలు చేసి వారి జీవితాల్లో సంతోషాలు నింపారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఎందరో గుండెజబ్బులు, తీవ్రమైన వ్యాధులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్సలు అందించారు. ఆ తండ్రి బాటలోనే సాగుతున్న వైయస్ జగన్ మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో పెరుగుతున్న కంటి సమస్యలకు పరిష్కారంగా వైయస్సార్ కంటివెలుగు పథకాన్ని ప్రారంభించారు.
వైయస్సార్ కంటివెలుగు కార్యక్రమం ద్వారా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నుంచి, ప్రాంతీయ, సర్వజన ఆసుపత్రుల వరకూ నేత్ర చికిత్సలను పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నారు. అత్యాధునిక యంత్రాలతో కంటి పరీక్షలు నిర్వహించి, దృష్టిదోషాలు ఉన్నవారికి తగిన వైద్యం అందించనున్నారు. కంటిచూపులోపం ఉందని గుర్తించిన వారికి కళ్లజోళ్లు అందింజేస్తారు. శుక్లాలు, ఇతర సమస్యలకు ఆధునిక చికిత్సలు కూడా నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అక్టోబర్‌ 10 నుండి వైయస్సార్ కంటి వెలుగు ప్రారంభం కానుండగా అక్టోబర్  11 ప్రపంచ కంటి చూపు దినోత్సవం కావడం యాధృచ్ఛికం. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top