ఏపీలో వైయ‌స్ఆర్‌సీపీదే హవా

టైమ్స్‌ నౌ-ETG లోక్‌సభ ఎన్నికల సర్వే వెల్ల‌డి
 

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీదే హవా అని మరో సర్వే స్పష్టం చేసింది.  టైమ్స్‌ నౌ ETG సర్వేలో.. మొత్తం 25 సీట్లలో వైయ‌స్ఆర్‌సీపీ 21 నుంచి 22 స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. అలాగే టీడీపీ జనసేన కూటమికి 3 నుంచి 4 స్థానాలు మాత్రమే వచ్చే ఛాన్స్‌ ఉందని తెలిపింది.
 
ఎన్టీయే కూటమికి 0(ఇంకా టీడీపీ-జనసేనలతో పొత్తు ఖరారు కాలేదు), ఇతరులు సున్నా కైవసం చేసుకుంటారని వెల్లడించింది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీకి 49 శాతం ఓటింగ్‌, టీడీపీ-జనసేన కూటమికి 45 శాతం, ఎన్డీయే కూటమికి 2 శాతం, ఇతరులకు 4 శాతం ఓటింగ్‌ నమోదు కావొచ్చని అంచనా వేసింది.

2023 డిసెంబర్‌  13వ తేదీ నుంచి మార్చి  7వ తేదీ మధ్య ఏపీలో ఈ సర్వేను ఈటీజీ నిర్వహించింది. ఇందుకోసం మొత్తం 3లక్షల 20 వేల మంది నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఇందులో క్షేత్రస్థాయి అభిప్రాయ సేకరణ 85 శాతం కాగా.. ఫోన్ల ద్వారా మరో 15 శాతం అభిప్రాయాలను సేకరించారు. 

Back to Top