స‌చివాల‌యాల మీదే బాబు ఏడుపు

-  ఏపీ `మ‌ద్యం పాల‌సీ` మీద ఇత‌ర రాష్ట్రాల ఫోక‌స్‌
అక్టోబ‌ర్ 3న  బాబు ప్రెస్‌మీట్ అందుకే

సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి మంచి పేరు వ‌స్తుంద‌ని త‌ట్టుకోలేక‌నే

మీడియాలో ప్ర‌భుత్వ అనుకూల క‌థ‌నాలు రాకుండా జాగ్ర‌త్త‌లు

 టీడీపీ అనుకూల కుటుంబాలు జ‌గ‌న్ `ఫ్యాన్` అవుతున్నాయ‌ని గుర్తించిన బాబు 

అబ‌ద్ధాలే త‌ప్ప‌.. ఆధారాలు లేని విమ‌ర్శ‌లు బాబు నైజం

నేను, నా కొడుకు లోకేష్ క‌లిసి జ‌గ‌న్ మీద చెరో రాయి వేస్తే.. మా కార్య‌కర్త‌లు త‌లో ప‌ది రాళ్లు వేస్తూ పోతుంటారు అనేది చంద్ర‌బాబు స్ట్రాట‌జీ. ప్ర‌భుత్వం మీద రాయి వేయాలంటే వాళ్లు త‌ప్పు చేయాల్సిన ప‌నిలేదు. త‌ప్పును వాళ్ల‌కు అంట‌గ‌డితే స‌రి అనేది ఎన్నాళ్ల నుంచి శ్రీమాన్ సంద్రాల్ సార్ అనుస‌రిస్తున్న వ్యూహం. ప్ర‌భుత్వానికి మంచి పేరు వ‌స్తున్న సంద‌ర్భం చూసుకుని ట‌క‌ట‌కా ప్రెస్‌మీట్ పెట్టేయ‌డం.. ట‌పీట‌పీమ‌ని నాలుగు రాళ్లు జ‌గ‌న్ మీద‌నో.. ప్ర‌భుత్వం మీదనో వేసేసి కార్య‌కర్త‌ల‌ను ఉసిగొల్ప‌డం మామూలే. అలాంటి చంద్ర‌బాబు ఉన్న‌ట్టుండి ఉరుములు మెరుపులు లేకుండా నిన్న‌నే ప్రెస్‌మీట్ ఎందుకు పెట్టిన‌ట్టు. దానికి కార‌ణం గ్రామ స‌చివాల‌యాలు. నిజానికి నిన్న ప్రెస్‌మీట్ పెట్టిన కార‌ణం.. మ‌ద్యం అమ్ముతున్నార‌నో, టీడీపీ సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌ల‌ను జైళ్లో పెడుతున్నారో అస‌లు కానేకాదు. మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిగిందే నిజ‌మైతే ఖ‌చ్చితంగా చంద్ర‌బాబు ఆధారాలు చూపేవాడు. సీఎం కాగానే మ‌ద్య నిషేధం ఎత్తేసిన ఈయ‌నే... గాంధీ మ‌హాత్ముడి క‌జిన్ బ్ర‌ద‌ర్‌లా రాష్ట్ర‌వ్యాప్త ఆందోళ‌న‌ల‌కు శ్రీకారం చుట్టేవాడు. ఇంకోప‌క్క టీడీపీ సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌ల మీద కేసుల గురించి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చాడు. అస‌లు సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌ల మీద కేసులు బ‌నాయించ‌డం, అక్ర‌మ నిర్బంధాలు, అరెస్టులు ఆయ‌న సీఎంగా ఉండ‌గా తెచ్చిన సంస్కృతే. 
నిన్న‌నే ఎందుకు... 
చంద్ర‌బాబు నిన్న (అక్టోబ‌ర్ 3)న ప్రెస్‌మీట్ పెట్ట‌డానికి కార‌ణం.. ఆ ముందురోజునే గ్రామ స‌చివాల‌యాలు ప్రారంభించ‌డం. చరిత్ర‌లో నిలిచిపోయే విధంగా అధికారంలోకి వ‌చ్చిన నాలుగు నెలల్లోనే నాలుగు ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పించిన సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మీద దేశవ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. వలంటీర్ ఉద్యోగాల గురించి ఎంతలా దిగ‌జారిపోయి చంద్ర‌బాబు నాయుడు మాట్లాడాడో చూశాం.. దానిపై జ‌నం మండిప‌డ్డ వైనాన్ని చూశాం. గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ మీద కూడా చంద్ర‌బాబు ఎన్ని అస‌త్య ప్రచారాలు చేసినా న‌మ్మ‌కుండా టీడీపీ నాయ‌కుల కుటుంబ స‌భ్యులు, కార్య‌క‌ర్త‌లు కూడా ప‌రీక్ష‌లు రాసి ఉద్యోగాలు సంపాదించారు. కులం చూడం మ‌తం చూడం రాజ‌కీయాలు చేయం... అన్న జ‌గ‌న్ త‌న మాట నిల‌బెట్టుకున్నాడ‌ని యువ‌త మాట్లాడుకోవ‌డం మొద‌లైంది. చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు ఏం చేయ‌క‌పోయినా ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారో మాత్రం వెంట‌నే ఫీడ్‌బ్యాక్ తెప్పించుకోవ‌డం ఆయ‌న‌కు అలవాటు. ఆయ‌నకు అందిన రిపోర్టులో అనాదిగా పార్టీని అంటిపెట్ట‌కుని ఉన్న చాలా టీడీపీ కుటుంబాలు రాబోయే రోజుల్లో జ‌గ‌న్ అభిమానులుగా మారిపోయే ప‌రిస్థితులు రావ‌చ్చ‌ని తేలింది. ఆరు నెల‌ల్లో మంచి పేరు తెచ్చుకుంటాన‌ని ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చిన జ‌గ‌న్‌.. నాలుగు నెల‌ల్లోనే జ‌నాన్ని త‌న‌వైపు తిప్పుకోగ‌లిగార‌ని చంద్రబాబు గ్ర‌హించాడు. మీడియాలో కూడా ఇదే చ‌ర్చ జ‌రుగుతోంది. పైగా ఇంత‌టి భారీ స్థాయిలో ఉద్యోగాలు ఇచ్చిన‌ప్ప‌డు కొత్త త‌ర‌హా పాల‌నా విధానం అమ‌ల్లోకి వ‌స్తున్న‌ప్పుడు మీడియా కూడా కొంచెం ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తుంది. ప్ర‌త్యేక క‌థ‌నాల‌తో టీఆర్‌పీలు పెంచుకోవాల‌ని చూస్తుంది. అక్టోబ‌ర్ 2న గ్రామ స‌చివాల‌యాలు ప్రారంభిస్తే 3న చంద్ర‌బాబు ప్రెస్‌మీట్ పెట్టి దుమ్మెత్తి పోయ‌డం వెనుక అస‌లు కార‌ణం.. మీడియా అటెన్ష‌న్‌ను త‌న‌వైపున‌కు తిప్పుకోవ‌డానికే. అందుకే సామాన్య జ‌నం మాట్టాడుకునేలా చెయ్య‌డానికి గాంధీ జ‌యంతి రోజున మ‌ద్యం అమ్మ‌కాలు, సోష‌ల్ మీడియాలో కేసులు ప్ర‌స్తావించాడు. చంద్ర‌బాబుకు విమ‌ర్శించ‌డం త‌ప్ప‌.. ఏనాడూ విమర్శ‌ల‌కు స్పందించ‌డు. క‌నీసం త‌న ఆరోప‌ణ‌లకు ఆధారాలు చూపించ‌డు. కాక‌పోతే సామాన్య ప్ర‌జ‌లు సైతం మాట్లాడుకునేలా అంశాన్ని త‌ల‌కెత్తుకుని బుర‌ద జ‌ల్లుతాడు. జ‌న బాహుళ్యంలోకి మ‌రింత చొచ్చుకెళ్లేలా బ‌హిరంగ ప్ర‌దేశాల్లో.., మీడియాలో త‌న‌ వాళ్లతోటి చ‌ర్చ‌లు జ‌రిపిస్తాడు. జ‌గ‌న్ మీద అక్ర‌మాస్తుల కేసు కూడా ఇలాంటిది. కేవ‌లం రూ. 1300 కోట్లు అక్ర‌మాల కేసులో అరెస్టు చేస్తే.. టీడీపీ నాయ‌కులు మాత్రం ల‌క్ష కోట్లంటూ అర్థం లేని ఆరోప‌ణ‌లు చేసి అప్ప‌ట్లో స‌క్సెస్ అయ్యారు. ఇప్పుడు జ‌రిగిందీ అదే.. ఇక ముందు కూడా జ‌ర‌గ‌బోయేది కూడా అదే. కానీ దీనికి శాశ్వ‌త ప‌రిష్కారం చూపాల్సిన బాధ్య‌త మాత్రం ప్ర‌భుత్వానిదే. ఇలాంటి వాగుడుకు క‌ళ్లెం వేసే చ‌ట్టాలు ఏవైనా ఉంటే వాటిని చంద్ర‌బాబుపై ప్ర‌యోగించ‌డం త‌ప్ప ప్ర‌త్యామ్నాయం లేదు.

Back to Top