రైతులకు అసలైన పండుగ రోజు

వరుణుడి ఎవరి పార్టీయో ఎప్పుడో వైయస్ జగన్ చెప్పేసారు. రైతు గురించి ఆలోచించే మనిషి ఉన్న చోట, అన్నదాత ఆర్తిని తీర్చే మనసున్న పాలకుడు పాలించే చోట, కర్షకుడి కంట కన్నీరు లేకుండా చూసే రాజున్న చోట వరుణుడు తనంతట తానుగా వస్తాడు. కరువును ఆమడదూరం తరముతాడు. వాగులు, వంకలు, చెరువులు, నదులూ ఉప్పొంగి ఉల్లాసమౌతాయి. పల్లెలు పచ్చగా, పొలాలు సమృద్ధిగా, ప్రజలు సంతోషంగా ఉంటారు. ఇది పదేళ్ల కిందట రాజన్న రాసిన చరిత్ర. నేడు ఆయన కుమారుడు వైయస్ జగన్ తిరిగి రాస్తున్న నవ చరిత. వైయస్సార్ రైతు భరోసా ద్వారా 13,500 రూపాయిల పెట్టుబడి సాయం అందిస్తూ రైతు పక్షపాతిగా నేల పుత్రల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్నారు సీఎం వైయస్ జగన్. నేడు నెల్లూరు జిల్లాలో వైయస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ కార్యక్రమం ప్రారంభిస్తున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన రెడ్డి. 
ఏ పాదం అడుగుపెడితే 
చంద్రబాబు వస్తున్నాడనే అనుమానం వస్తే చాలు వరుణుడు పారిపోతాడు అనేవారు వైయస్సార్. అది అక్షర సత్యం అని గత ఐదేళ్లలో మరోసారి రూఢీ అయ్యింది. రైతు బాంధువుడిలా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆలస్యంగా మొదలైనా కరువు జిల్లాల్లోనూ సిరుల వర్షం కురుస్తూనే ఉంది. యువ ముఖ్యమంత్రి రాష్రంలో ఏ మూల అడుగుపెట్టినా చిరుచినుకుల స్వాగతం లభిస్తూనే ఉంది. అన్నదాతలకు ఆప్తుడు కనుకే వరుణుడూ కరుణిస్తున్నాడంటున్నారు రైతులు. 
పండుగలా వైయస్సార్ రైతు భరోసా 
మేనిఫెస్టో ప్రకారం 2020లో ప్రారంభం కావాల్సిన రైతు భరోసా - పిం.ఎం కిసాన్  పథకం  ఏడాది ముందుగానే ఆరంభించారు సీఎం వైయస్ జగన్. 12500 ను మరో వేయి పెంచి 13500 రూపాయిలు రైతు పెట్టుబడిసాయంగా అందిస్తున్నారు. జూన్ నెలలో 2000 ఇప్పటికే అందించారు. మరో 9,500 అక్టోబర్ నెలలో అందిస్తున్నారు. మరో 2000 సంక్రాంతి నాడు అందించనున్నారు. ఈ సొమ్ము బ్యాంకులో పాత అప్పులకు జమ కట్టకుండా రైతుల చేతికి అందేవిధంగా బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన కుటుంబాలకు పెట్టుబడి సాయం ఐదేళ్లకు కలిపి 67,500 అందనుంది. దాదాపు 54 లక్షల మంది ఈ పథకంలో లబ్దిదారులయ్యారు. కౌలు రైతుల కుటుంబాలకూ సాగు కుటుంబాలతో పాటుగా ఈ పథకాన్ని వర్తింప చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కే చెల్లుతుంది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో కౌలు రైతులకు మేలు చేసిన ముఖ్యమంత్రి లేడు. గిరిజన ప్రాంతాల్లో రిజిస్టర్ అటవీ భూములు సాగు చేస్తున్న, డి పాట్టాలు పొందిన వారికి కూడా వైయస్సార్ రైతు భరోసా వర్తింపు చేస్తున్న ఏకైక ప్రభుత్వం వైయస్సార్ కాంగ్రెస్ రైతు ప్రభుత్వం మాత్రమే అని సగర్వంగా చెప్పుకుంటోంది ఆంధ్రప్రదేశ్. 
ఖరీప్ సమయంలో రూ.7500
రబీ సమయానికి రూ.4000

ధాన్యం ఇంటికి చేరి అన్నదాతలు పండుగ చేసుకునే సంక్రాంతి వేళ రూ.2000 అందిస్తూ రైతుల సంతోషమే రాజ్యం సంతోషం అని నిరూపిస్తున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్. 
రైతులకోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు
ఇప్పటికే పంటలకు మద్దతు ధర ప్రకటిస్తూ రైతులకు అండగా నిలబడుతోంది వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు భరోసా ప్రారంభంతో పాటుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకు ప్రభుత్వమే రైతు పంటను కొనుగోలు  చేస్తుంది. దళారుల బారిన పడి రైతు నష్టపోకుండా ఉండేందుకు రైతుల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర లభించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని ప్రకటించారు ముఖ్యమంత్రి వైయస్ జగన్. పంట చేతికొచ్చే సమయానికే కొనుగోలు కేంద్రాలన్నీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిరైతూ తాను సాగు చేసిన పంట వివరాలు గ్రామ సహాయకుల ద్వారా ఈ-క్రాప్ లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే పంటల నిల్వకు నూతన గిడ్డంగులు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం, విపత్తు నివారణ నిధులనూ సమకూర్చి రైతును రాజుగా సగర్వంగా నిలబడేలా చేయనుంది. 

తాజా వీడియోలు

Back to Top