పీపీఏల విషయంలో ఏపీ గెలుపు

విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కేంద్రం జోక్యానికి చెక్ పెట్టిన హైకోర్టు

లెటర్ ఆఫ్ క్రెడిట్స్ పై కేంద్రం ఒత్తిడిని తప్పుబట్టిన ధర్మాసనం

ఎల్‌.సీ ఇవ్వకుంటే విద్యుత్ కొనుగోళ్లు నిలిపేస్తామంటూ ఏపీ డిస్కంలకు లేఖ రాసిన పీఎస్ఓసీఎల్

దీనిపై హైకోర్టును ఆశ్రయించిన ఏపీ ఎస్సీడీసీఎల్, ఈపీడీసీఎల్ 

పీపీఏల విషయంలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పెత్తనం పనికిరాదని తేలుస్తూ మధ్యంతర ఉత్తర్వులు

పీపీఏల విషయంలో కేంద్రం మొండిపట్టుదలకు హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం అత్యధిక ధరలకు సౌర, పవన విద్యుత్ కొనుగోలు చేసి ప్రభుత్వ డిస్కంల నెత్తిన 20,000 కోట్లకు పైగా రుణభారాన్ని మోపింది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అప్పులను తీర్చడమే కాదు, చౌక ధరలకు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లు చేస్తోంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పునఃసమీక్షకు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఇటు రాష్ట్రంలో ప్రతిపక్ష టీడీపీ, అటు కేంద్ర విద్యుత్ శాఖ తెగ కంగారు పడుతున్నాయి.  
తాజాగా మరోసారి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ రాష్ట్రప్రభుత్వానికి లేఖలతో మరోసారి తన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో ముందస్తు చెల్లింపులకోసం లెటర్ ఆఫ్ క్రెడిట్ (LC) ఇచ్చి తీరాలని పట్టుబడుతూ రాష్ట్రానికి లేఖ రాసింది. లేకుంటే బహిరంగ మార్కెట్ లో కొనుగోళ్లను నిలువరిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ఏస్సీడీసీఎల్, ఈపీడీసీఎల్ సీఎండీలు హైకోర్టును ఆశ్రయించారు. బకాయిల చెల్లింపుల విషయంలో సౌర విద్యుత్ యూనిట్ రూ.2.44, పవన విద్యుత్ రూ.2.43 చొప్పున చెల్లింపులకు ఇటీవల హైకోర్టు ఉత్తర్వులిచ్చిన ఈ విషయాన్ని కోర్టు ముందుంచారు. రాష్ట్రంలో నిధుల కొరత ఉందని, వీలును బట్టి బకాయిలు చెల్లిస్తున్నామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తూ, విద్యుత్ కొనుగోళ్లను అడ్డుకోవద్దని కేంద్రానికి ఉత్తర్వులిచ్చింది. 
వైయస్ జగన్ ప్రభుత్వం భారమైన పీపీఏల విషయంలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని చూసి మరికొన్ని రాష్ట్రాలు ఇదే బాట పట్టాయి. అధిక ధరలతో ఉన్న గత విద్యుత్ ఒప్పందాలపై పునః సమీక్షకు సిద్ధ పడుతున్నాయి. రివర్స్ టెండర్ , రివిజన్ ఆఫ్ పీపీఏ ల ద్వారా సంచలనం సృష్టిస్తున్నారు ఏపీ సీఎం వైయస్ జగన్. ఒక పక్క రాష్ట్రానికి మేలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, మరోపక్క ఖజానాపై ఆర్థిక భారాన్ని తగ్గించే చర్యలు తీసుకుంటున్న యువ ముఖ్యమంత్రి పట్టుదలను చూసి దేశమే నివ్వెరపోతోంది. 

Read Also: వైయస్‌ఆర్‌ సీపీలో చేరిన అల్లూరి కృష్ణంరాజు

Back to Top