అమరావతి: ప్రకాశం బ్యారేజీ వద్దకు వరదకు కొట్టకొచ్చిన బోట్ల కేసు నిందితుడు మంత్రి నారా లోకేష్‌కు సన్నిహితుడిగా తేలింది. ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకురావడం వెనుక కుట్రకోణం ఉందంటూ గత అర్థరాత్రి పోలీసులు కోమటి రామ్మోహన్, ఉషాద్రి అనే ఇద్దరు వ్యక్తులను సీఎం చంద్రబాబు ఆదేశాలపై పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో రామ్మోహన్ పేరుమీద ఒక్క బోటు కూడా లేదు. నాలుగైదేళ్ల క్రితమే తన బోట్లను అమ్మేశారు. పైగా రామ్మోహన్ @JaiTDP ఎన్నారై విభాగం అధ్యక్షుడు కోమటి జయరాంకు సమీప బంధువు. ఈ కేసులో అరెస్టయిన రెండో వ్యక్తి ఉషాద్రి తనకు వైయస్ఆర్‌సీపీతో సంబంధాలు లేవని స్పష్టం చేసినా పోలీసులు అతన్ని ఇరికించి అరెస్టు చేశారు. నారా లోకేష్‌తో ఉషాద్రికి సంబంధాలు ఉన్నాయనేదానికి ఈ ఫోటోలే సాక్ష్యాలు.. పబ్లిసిటీ పిచ్చిలో వరద బాధితుల్ని గాలికి వదిలేయడంతో ఇప్పటికే మీ కూటమి ప్రభుత్వంపై జనం ఉమ్మేస్తున్నారు.. దాన్ని తుడవడానికి ఎల్లో మీడియా ముప్పుతిప్పలు పడుతోంది. ఇప్పట్లో వరద బాధితుల ఆగ్రహం తగ్గేలా లేదు.. దాంతో ఇష్యూని డైవర్ట్ చేయడానికి తలాతోక లేని బోట్ల అంశాన్ని తెరపైకి తెచ్చి ఫేక్ ప్రచారమా టీడీపీ? మీరు ఇలా ఎన్ని జిత్తుల మారి వేషాలేసినా.. విజయవాడని ముంచిన మీ పాపాన్ని కడుక్కోలేరు..