క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టొదోయ్‌

’వూ...ప్రజాస్వామ్యమంటే అంతేగా...

 డెమొక్రసీ అంటే ఏంటి...

 ఎన్నికలప్పుడు నిలబడ్డవాడు పదిరూపాయలు ఖర్చుపెట్టుకుంటాడు.

వాడికి ఇంకొకరు డబ్బులిస్తారు. మనీ జనరేట్‌ ఒక చోట జరుగుతుంది. ఒక చోట ఖర్చవుతుంది...’ అచ్చం ఇలానే కాకున్నా, ఇదే భాష, ఇదే భావంతో డెమొక్రసీకి కొత్త భాష్యం చెప్పారు మన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గారు.

’ప్రజాస్వామ్యంటే..ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వం’ అని కదా అర్థం...అని కదా చదువుకున్నాం అని సీరియస్‌గా ఆలోచించకండి. అసలే బ్రెయిన్‌ రోగాలు కూడా బాగా పెరిగిపోయిన కాలంలో వున్నాం మనం.

ప్రజాస్వామ్యం గురించి చెప్పేటప్పుడు... ప్రజల మాట వినిపించకుండా..డబ్బు మాటే వినిపించిన బాబుగారికి తెలిసినంత మీకు తెలుసనుకుంటే ...మీరు ఎక్కడో కాలేసినట్టే!

వ్యవసాయం దండగ, హిస్టరీ సబ్జెక్టే వేస్ట్‌ అని గతంలో ప్రవచించిన బాబుగారి, మేధోపాఖ్యానంలో ఇంకా ఎన్నెన్ని ఆణిముత్యాల భాష్యాలున్నాయో మరి! ఎన్నికలు దగ్గరపడే కొద్దీ...ఎండాకాలం వేడి పెరిగే కొద్దీ మరెన్ని వినాల్సి వస్తుందో...ముందస్తుగానే ప్రిపేరయిపోవడం మనందరికీ మంచిది. ఎందుకంటే వున్నది మనందరి ప్రభుత్వం కాదు కాబట్టి. చంద్రబాబు అండ్‌ కో దే ప్రభుత్వమైనా...ప్రభుత్వ యంత్రాంగమైనా!!

ఐటీ గ్రిడ్, బ్లూగ్‌ ఫ్రాగ్‌ ఇలా పేరుకే ప్రైవేటు సంస్థలు. అన్నింటికీ ప్రజాధనమే మూలధనం. ఇలాంటి విషయాల్లో బాబుగారి చేతికి ఎముకే వుండదు. ఈ చేత్తో ఇచ్చి, ఆ చేత్తో తనకు అవసరమయ్యే పనులు చేయించుకోవడం బాబుగారికి బాగా తెలిసిన విద్య. 

రాజకీయాల్లో ఆరితేరి పోయినవారు. రాజకీయాలనే తిని,తాగి, వాటితోనే నిద్రపోయే చంద్రబాబును ఢీకొనాలంటే...అల్లాటప్పా వాళ్లతో అయ్యేపనికాదు. ఒకరిద్దరితో అసలు చేతనయ్యే పనికాదు. మరెలా? తన రాజకీయ స్వప్రయోజనాల కోసం ....దేన్నయినా పణంగా పెట్టేసే..ఏకంగా ప్రజలనైనా తాకట్టుపెట్టే సీనియర్‌ పొలిటిషీయన్‌ సేవలు ఆగిపోవాలంటే ఏం చెయ్యాలి. అలా చెయ్యగలిగే గంధర్వులెవరు? ఇంకెవరు...ఓటర్లు కాక ఇంకెవరు. స్వీయవిచక్షణతో, ఎంతకాలమిలా మోసపోతామన్న ఆలోచనతో ఈ సారి ఓటు వేయండి. దెబ్బకు రోగం పోతుంది. ఏపీ ఆరోగ్యం కుదుట పడుతుంది. 

Back to Top