కావాలి జ‌గ‌న్‌- మా మంచి జ‌గ‌న్‌

చ‌రిత్ర‌ను మార్చ‌డానికి, మ‌లుపు తిప్ప‌డానికి ఎవ‌రూ పైనుంచి దిగిరారు. వారు మ‌న చుట్టునే ఉంటారు. అయితే అలాంటి వారు ప్ర‌పంచానికి ప‌రిచ‌యం కావ‌డానికి కొంచెం స‌మ‌యం ప‌డుతుంది. అలాంటి వారి నాయ‌క‌త్వంలో రాష్ట్రాన్ని పెడితే.. వెన‌క్కి తిరిగి చూడాల్సిన ప‌నిలేదు. అవును.. కొంచెం ఆల‌స్యం జ‌రిగింది కానీ.. స‌రైన స‌మ‌యంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ప్ర‌జ‌లు జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేతుల్లో పెట్టారు.  వ్య‌వ‌స్థ‌ల‌న్నీ ఛిన్నాభిన్న‌మై, ఆర్థిక రంగం కుదేలై.., పొరుగు రాష్ట్రాల ముంద‌ర ఆంధ్రుడు త‌ల‌వంచుకు నిల‌బ‌డాల్సి వ‌స్తుందేమో అనుకునే త‌రుణంలో జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యాడు. ఎవ‌రినీ నిందించ‌లేదు.. ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గింది లేదు. టైం ఇవ్వండ‌ని అడిగాడు కానీ.. స‌మ‌స్య‌ల నుంచి పారిపోలేదు. ఒక్కో స‌మ‌స్య‌కు ప‌రిష్కారాన్ని వెతుక్కుంటూ ఒక్కో అడుగు ముందుకేస్తుంటే.. జ‌నాల్లో ఆశ్చ‌ర్యం, ప్ర‌తిప‌క్షంలో వ‌ణుకు. అనుభ‌వం ఏదీ అన్నోళ్లంతా జ‌గ‌న్ ప‌నిచేసుకుంటూ పోతుంటూ క‌ళ్ల‌ప్ప‌గించి చూస్తున్నారు. అవినీతి ప‌రుడు అన్నోళ్లు ఇంకో అయిదేళ్ల ముందే ఈయ‌న వ‌చ్చుండాల్సింది అంటున్నారు. అధికారులేమో స్నేహితుడంటున్నారు.., ప‌నితీరుకి ఫిదా అవుతున్నారు. యువ‌త మాత్రం మా అన్న‌కి వెయ్యేళ్లు ఇవ్వ‌మ‌ని దేవుణ్ని మొక్క‌తున్నారు. నాలుగు నెల‌ల్లో నాలుగు ల‌క్ష‌ల ఉద్యోగాలు మాకెవ‌రిస్తారు.. మ‌ళ్లీ మ‌ళ్లీ మీకు జ‌న‌వ‌రి ఉందని భ‌రోసా ఎవ‌రిస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. 

ఏదీ విమ‌ర్శిద్దామంటే ఎక్క‌డా గొప్ప‌లు చెప్పుకోడే.. తిట్టిపోద్దామంటే త‌ప్పు చేయ‌డే. ముఖ్య‌మంత్రి అన్న అహం లేదు.. పేద వాడంటే చిన్న చూపులేదు. స‌మ‌స్య‌లు చెప్పుకుంటున్న రైతుల మీద అస‌హ‌నం లేదు. త‌నువంతా పుళ్లు ప‌డ్డ రోగుల మీద అస‌హ్యం లేదు. కోప్ప‌డటం లేదు.. కాల‌యాప‌న లేదు. ఇంత చేసినా ప‌బ్లిసిటీ కోసం వెంబ‌ర్లాడ‌డే. ప్ర‌తిప‌క్షం బుర‌ద జ‌ల్లుతుంద‌న్నా అంటే.. న‌వ్వుతాడే. ఎన్నిక‌ల‌య్యాయి.. అంద‌రూ మ‌న‌వాళ్లే అంటాడు. 
నీ క్ష‌మాగుణం, నీ స‌హ‌నం, నీ నేర్పు.. మాచేత "కావాలి జ‌గ‌న్ - మా మంచి జ‌గ‌న్" అనిపిస్తోంది

Back to Top