‘వెనుకబడిన కులాలే వెన్నెముక’ 

రేపే విజ‌య‌వాడ‌లో ‘జయహో బీసీ’ మహాసభ 
 
 గడిచిన మూడున్నరేళ్లలోనే బీసీలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ లబ్ధి 

బీసీల సంక్షేమం కోసం ఏడాదికి రూ. 1.37 లక్షల కోట్లు మంజూరు 

జనాభాలో 50 శాతం మంది ఉన్న బీసీలకు 50 శాతం నామినేటెడ్‌ పదవులు 

బీసీలకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు వైయ‌స్ఆర్‌సీపీ సిద్ధం 

విజయవాడ: బీసీలు మరింత అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో వారి సమస్యలను తెలుసుకునేందుకే ‘వెనుకబడిన కులాలే వెన్నెముక’ అనే నినాదంతో ‘జయహో బీసీ మహాసభ’ కార్యక్రమాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బుధవారం భారీఎత్తున నిర్వహిస్తున్నట్లు వైయస్అర్ సీపీ నుబంధ విభాగాల ఇన్‌చార్జి, పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ నెల ఏడో తేదీన విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమ ఏర్పాట్లను విజయసాయిరెడ్డితో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్సీలు తలశిల రఘరాం, జంగా కృష్ణమూర్తి, లేళ్ల అప్పిరెడ్డి పరిశీలించారు.

బ్యాక్ బోన్ క్లాస్(BC) కు ఎవరేమి చేశారు ?

 

 •  సీఎం వైయ‌స్ జగన్ డీబీటీ రూపంలో మూడున్నరేళ్లలో రూ. 1.78 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేస్తే.. ఇందులో బీసీ వర్గాలకు చెందిన ప్రజలకు మాత్రమే రూ.86  వేల కోట్లు  జమ చేశారు వైయస్ జగన్
 • సామాజిన న్యాయం చేతల్లో చూపిన సీఎం వైయ‌స్‌ జగన్
 • చంద్ర‌బాబు  కేబినెట్‌లో 8 మంది BC మంత్రులు ఉండగా వైయ‌స్‌ జగన్‌ కేబినెట్‌లో 10 మంది ఉన్నారు
 • చంద్ర‌ బాబు 5 ఏళ్ల పాలనలో (2014-19 ) బీసీ, ఎస్సీ ఎస్టీ లకు ఒక్క రాజ్యసభ సీటూ ఇవ్వలేదు
 • వైయ‌స్ జగన్‌ సీఎం అయినాక వచ్చిన 8 ఖాళీల్లో 4 రాజ్యసభ సీట్లు బీసీలకు ఇచ్చారు
 • (మొత్తం 40 ఏళ్ల  రాజకీయ జీవితం లో బాబు BC లకు ఇచ్చిన రాజ్యసభ సీట్లు-3  )
 • ఎన్నికల్లో వైయ‌స్ జగన్ 6 ఎంపీ సీట్లు ఇచ్చాడు
 •  శాసన మండలిలో వైయ‌స్ఆర్‌ సీపీకి 32 ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా 12 మంది బీసీలే 
 • వైయ‌స్ జగన్‌ స్పీకర్‌ పదవిని బీసీ అయిన తమ్మినేని సీతారాం కు ఇచ్చారు 
 • శాసన మండలి చైర్మన్‌గా ఎస్సీ అయిన మోసెన్‌ రాజును, వైస్‌ చైర్మన్‌గా జకియాఖానంను నియమించారు
 •  13 కార్పొరేషన్లలో 7 మేయర్‌ పదవులు బీసీలకిచ్చారు. వీరిలో 92 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే
 •  13 జెడ్పీ చైర్మన్‌ పదవుల్లో 9 (70 శాతం) బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీలకిచ్చారు వైయ‌స్ జగన్
 •   87 మున్సిపాలిటీల్లో గెలిచిన 84 చైర్‌పర్సన్‌ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు 73 శాతం ఇచ్చారు వైయ‌స్‌ జగన్
 •  మొత్తం 648 ఎంపీపీ లకుగాను వైయ‌స్ఆర్‌సీపీ  635 గెలిస్తే అందులో 67 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించారు వైయ‌స్ జగన్
 •  చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిర్వేషన్‌ కల్పించాలని కేంద్రంంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని, ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషనర్లు కల్పించేలా, రాజ్యసభలో వైయ‌స్ఆర్‌ సీపీ ప్రైవేటు బిల్లు పెట్లింది
 •  స్థానిక ఎన్నికల్లో వైయ‌స్ జగన్ ప్రభుత్వం బీసీలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సంకల్పిస్తే , చంద్ర‌బాబు హయాంలో ఉపాదిహామీ పధకానికి రాష్ట్ర డైరెక్టరుగా నియమింపబడిన బిర్రు ప్రతాపరెడ్ది అనే టీడీపీ నేత హైకోర్టుకు వెళ్లడంతో 24 శాతానికి తగ్గిపోయింది
 • SC లలో పుట్టాలని ఎవరు కోరుకుంటారు
 • నాయీ బ్రాహ్మణుల తోక కత్తిరిస్తా , మత్సకారుల తోలు తీస్తా
  బీసీలు న్యాయమూర్తులుగా ఉండటానికి వీల్లేదంటూ 2017 మార్చి 21న కేంద్రానికి లేఖ రాసిన దుర్మార్గుడు చంద్రబాబే.
 •  

ఏపీలోనే బీసీలు ఎక్కువ‌గా అభివృద్ధి
 జనాభాలో 50 శాతం ఉన్న ఆ వర్గాలకు వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వం గడచిన మూడున్నరేళ్లలో 50 శాతం నామినేటెడ్‌ పదవులు ఇచ్చి రాజకీయంగా, సంక్షేమం కింద రూ.1.37 లక్షల కోట్లను మంజూరు చేసి ఆర్థికంగా, విద్యా, ఉద్యోగ ఆవకాశాలు కల్పించి సామాజికంగా తలెత్తుకు తిరిగేలా చేసింది.  బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో కంటే ఏపీలో బీసీలు ఎక్కువ అభివృద్ధి సాధించడం సీఎం వైయ‌స్‌ జగన్‌ ఘనత.

రాష్ట్రవ్యాప్తంగా సభల నిర్వహణ
 సామాజిక, ఆర్థిక, రాజకీయంగా బీసీలు అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతోనే 139 బీసీ కులాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఈ సభను నిర్వహిస్తారు. క్షేత్రస్థాయిలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సభ ద్వారా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుంది.  సభ అనంతరం జోనల్, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో ఇదే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహిస్తామని పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శివిజయసాయిరెడ్డి వెల్లడించారు.

అలాగే, రాబోయే రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మహాసభలను కూడా నిర్వహిస్తామన్నారు. మరోవైపు.. సభలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ టీకే రాణా, డీసీపీలు విశాల్‌ గున్ని, శ్రీనివాసరావు, జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుడ్కర్‌కు ఎంపీ సూచించారు. ఈ సందర్భంగా భోజనశాల, వాహనాల పార్కింగ్, స్టేజ్, ప్రజలు వచ్చి వెళ్లే మార్గాలను ఎంపీ పరిశీలించారు. 

82 వేల మందికి ఆహ్వాన పత్రాలు
ఇక వార్డు మెంబర్లు, పంచాయతీ సర్పంచ్‌లు, పీఏసీఎస్‌ అధ్యక్షులు, సభ్యులు, ఇతర నామినేటెడ్‌ పదవుల్లో ఉన్న 82,432 మంది బీసీలకు జయహో బీసీ మహాసభ ఆహ్వాన పత్రాలను పంపించినట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇక సభకు వచ్చే వారికోసం 24 రకాల వంటకాలను సిద్ధంచేయిస్తున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు.

చంద్రబాబు బీసీల ద్రోహి: బొత్స
బొత్స మాట్లాడుతూ.. బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుని టీడీపీ రాజకీయ లబ్ధిపొందిందని మండిపడ్డారు. 14 ఏళ్ల తన పాలనలో చంద్రబాబు బీసీలను ఆణగదొక్కారన్నారు. ఆ కాలంలో బీసీ ఉపకులాలకు చెందిన వ్యక్తులకు మొక్కుబడిగా ఇస్త్రీ పెట్టెలు, మోకులు, కత్తెర్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. అదే ప్రతిపక్ష నేత హోదాలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల మేరకు ఏడాదికి రూ.80 వేల కోట్లను బీసీల బ్యాంకు ఖాతాల్లో జమచేశారని గుర్తుచేశారు. టీడీపీలోని బీసీ నాయకులే చంద్రబాబును చూసి ‘ఇదేం ఖర్మరా బాబూ!’ అని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

షెడ్యూల్‌ ఇదీ..
ఉదయం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అనంతరం 10 గంటలకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభను ప్రారంభిస్తారని విజయసాయిరెడ్డి చెప్పారు. 10 నుంచి 12 గంటల వరకు బీసీ మంత్రులు, నాయకులు ప్రసంగిస్తారు. 12 నుంచి ఒంటి గంట వరకు సీఎం ప్రసంగిస్తారు. 

Back to Top