జగనిజం

టిఆర్ఎస్ కు మద్దతు ఉంటుంది..కానీ అది ప్రత్యేక హోదా విషయంలో మాత్రమే. అందులోనూ ఏపీ ఎన్నికల అనంతరం మాత్రమేంవైఎస్ జగన్ గారి నిర్ణయం ఇది. జగన్ సింగిల్ గా పోటీ చేయడంలేదు టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాడు అని కొద్ది గంటలుగా నానా హంగామా చేస్తూఉన్న వారందరికీ ఇది కడుపు మండిపోయే వార్తే. 
అదే మాటమీదం
అంతేమరి జగనిజం ఇలాగే ఉంటుంది. ఒకే మాట మీద, ఒకే ధర్మం కోసం, ఒకే నిర్ణయంతో ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలకు ఈ సింగం సింగిల్ గానే వెళ్తోంది. ఆ మాటకే కట్టుబడి ఉన్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. స్నేహం ఆశించి వచ్చి కేటీఆర్ తో ఆత్మీయంగా కలిసి మాట్లాడారు. ప్రత్యేకహోదా ఏపీకి ఇస్తే తెలంగాణాకు కూడా ఇవ్వాల్సిందే అని పట్టుపట్టిన వారితో మీ రాష్ట్రానికి హోదా వచ్చేందుకు మా వంతు సహకారం అందిస్తాం అనేలా చేసిన ఘనత ఖచ్చితంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే. అసాధ్యాలు సుసాధ్యం చేయడంలో ఆయనకు పోటీయే లేదు. 
ఎవ్వరి సాయం లేకుండానే..
ప్రత్యేక హోదా ఉద్యమాన్ని కింది స్థాయి నుంచి దిల్లీ స్థాయి వరకూ నడిపించిన ప్రతిపక్ష నేత ఎక్కడా మరో పార్టీని మద్దతిమ్మని తిరగలేదు. స్వరాష్ట్రంలో యువతను ఏకం చేసాడు. ప్రజలను చైతన్య వంతులను చేసాడు. ప్రభుత్వం దిగివచ్చేలా చేసాడు. దిల్లీ నడిబొడ్డున హోదా కోసం ఎందాకైనా అంటూ గర్జించాడు. నేరుగా కేంద్రంతోనే తలపడ్డాడు. హోదా ఇవ్వకుంటే మా ఎంపీలు వైదొలుగుతారని ప్రకటించాడు. తాను పాదయాత్ర చేస్తూనే తన ఎంపీలతో హోదా ఉద్యమాన్ని ఉవ్వెత్తున కొనసాగించాడు. తాను కదలకుండానే హోదా ఉద్యమ రధాన్ని కదిలించాడు. జగన్ ఒక్క పిలుపుతో రాష్ట్రమే కదిలి వస్తోంది. నాయకులు కదిలి వస్తున్నారు. పార్టీలు తమ మద్దతు తెలుపుతున్నాయి. 
బాబును నమ్మని నాయకులు
చంద్రబాబు హోదా కోసం దీక్షలన్నాడు. దిల్లీలో మీటింగ్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసాడు. బీద అరుపులు అరిచాడు. దొంగ ఏడ్పులు ఏడ్చాడు. కానీ ఏ ఒక్క నాయకుడిచేతా హోదాకు మద్దతు సాధించలేక పోయాడు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న బాబును కనీసం పొరుగు రాష్ట్రంలో ఉన్న తెలుగు ముఖ్యమంత్రి కూడా నమ్మడం లేదు. 

ఇదీ జగన్ విజయం
నేడు టిఆర్ఎస్ స్వయంగా కదిలి వచ్చి ఫెడరల్ ఫ్రంట్ కోసం మద్దతు కోరింది. కేటీఆర్ జగన్ ని కలవడం గురించి టీడీపీ, ఎల్లో మీడియా కలిసి చేసిన రాద్ధాంతం మామూలుది కాదు. కేటీఆర్, జగన్ భేటీ వార్త వచ్చిన దగ్గరనుండి వీరికి నీళ్లూ, నిద్ర కరవుయ్యాయి. ఇదేదో అపరాధంలా, రాష్ట్రానికి అన్యాయంలా ప్రచారం చేసేందుకు వాళ్లు పడ్డ తాపత్రయానికి అంతేలేదు. ఇక న్యూట్రల్ గా ఉంటున్నట్టు కనిపిస్తూ చంద్రబాబుకు పనిచేసే మీడియా ఛానళ్లు, ప్రముఖులు, జనసేన లాంటి పార్టీల నేతలు, ఫాలోవర్లు దీన్ని పట్టుకుని చిందులు మొదలెట్టారు. వైసీపీ టిఆర్ఎస్ తో పొత్తు అంటూ సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. కానీ వైఎస్ జగన్ నిర్ణయంతో పొత్తుల విషయంలో బురదజల్లాలని తెగ ఎదురుచూస్తున్న వీరందరి గొంతులో పచ్చివెలక్కాయ పడింది. మరోసారి ప్రతిపక్ష నేత జగన్ మాట అన్నాడంటే అది శాశనమే అని రుజువైంది. 

 

తాజా వీడియోలు

Back to Top