సైగలకు స్పందించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్

 గంటల వ్యవధిలో ఆర్థిక సహాయం చేశారు 

మ‌చిలీప‌ట్నం: తన గోడు విన్నవించుకున్న వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని గంటల వ్యవధిలో ఆర్థిక సహాయం చేసి ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి తనది విశాల హృదయం మరోమారు రుజువు అయ్యింది. ఈ నెల 22న సోమవారం కృష్ణాజిల్లా మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన అనంతరం తిరుగు ప్రయాణంలో స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ వద్ద ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

మచిలీపట్నం 34 వ డివిజన్ వర్రె గూడెంకు చెందిన గోపాల నాగ వెంకట చంద్రబాబుకు కొద్దికాలం క్రితం వీపు వెనక ఒక పెద్ద క్యాన్సర్ కణితి వచ్చింది ఆ చెడు కణజాలం శరీరంలో వేగంగా వ్యాపించింది. దీంతో శస్త్ర చికిత్స చేయడంతో పాటు పాడైపోయిన ఒక కిడ్నీని వైద్యులు తొలగించారు.
 దాదాపు మరణపు అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చిన నాగ వెంకట చంద్రబాబు అనారోగ్య పరిస్థితితో పాటు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నానని, తన కుటుంబాన్ని ఆదుకోవాలని,వైద్య చికిత్సకు సాయం చేయాలని అర్థిస్తూ తన వద్దకు వచ్చిన అతడి దీనస్థితి చూసి ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి  చలించిపోయారు. బాధితుడు ఇచ్చిన అర్జీని, వైద్య చికిత్స తాలూకా పత్రాలు చదివి సీఎం స్పందిస్తూ 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం తక్షణమే బాధితునికి అందచేయవలసిందిగా వెంటనే కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రాజాబాబుకు  సీఎం ఆదేశించారు.

దీంతో మంగళవారం ఉదయం కలెక్టరేట్ చాంబర్లో బాధితునికు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం బ్యాంక్ చెక్కు రూపంలో పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా గోపాల నాగ వెంకట చంద్రబాబు మాట్లాడుతూ,అన్నా భయపడకు.. నీకు నేనున్నాను అంటూ గంటల వ్యవధిలో ఆర్థిక సహాయం చేయడం ఎంతో ఆశ్చర్యంగా ఉందని చెబుతూ, ముఖ్యమంత్రి చేసిన ఈ మేలు తాను ఎన్నటికీ మరువనని నాగ వెంకట చంద్రబాబు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు

ఈ చెక్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, మాజీ మంత్రివర్యులు మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య( నాని), పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు, 34వ డివిజన్ ఇంచార్జ్ బడే భాను, గోపిశెట్టి సతీష్, తిరుమలేశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top