పెద్దలకో న్యాయం..పేదలకు అన్యాయమా?

ఇంగ్లిష్‌ మీడియం కేవలం ధనికులకే పరిమితమా..? 

పేదవాడు ఇంగ్లిష్‌ మీడియంలో చదివితే ఒప్పుకోరా..? 

పేదవాడు ఇంగ్లిష్‌లో మాట్లాడకూడదా..? 

నారాయణ, శ్రీచైతన్య స్కూళ్లలోనేనా ఇంగ్లిష్‌ మీడియం చదువులు..?

అమరావతి: విద్యా వ్యవస్థలో సంస్కరణలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శ్రీకారం చుడితే..ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. పెద్దలు మాత్రమే ఆంగ్లం నేర్చుకోవాలా? పేదలకు అవసరం లేదా అన్న అనుమానాలు టీడీపీ నేతల వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడతామని ప్రభుత్వం ప్రకటించడమే ఆలస్యం..ఇంగ్లీష్‌ ఎందుకు అంటూ తెలుగు భాషపై ఎనలేని ప్రేమను వెల్లబోసుకుంటున్నారు. వీరికి నిజంగా తెలుగుపై ప్రేమ ఉంటే తమ బిడ్డలను ఎందుకు తెలుగు మీడియం చదివించలేదన్న ప్రశ్నలు సామాన్య జనం నుంచి వినిపిస్తున్నాయి. వీటిని చంద్రబాబు వద్ద సమాధానం ఉందా?. పేదవాళ్లు ఇంగ్లీష్‌ మీడియం చదువులు చదువుకోవద్దా అన్న ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. చంద్రబాబు మొదటి నుంచి డబ్బులున్న ధనికులకే కొమ్ము కాస్తున్నారని, ఎక్కడ వారికి పేదలు పోటీ పడుతారనే తాపత్రయం ఆయనలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

రాష్ట్రంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య మొత్తంగా పరిశీలిస్తే 70,90,217 మంది విద్యార్థులు అక్టోబర్‌ వరకు నమోదైతే.. వారిలో 44,21,529 మంది అంటే 62.3 శాతం ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నారు. సామాజిక వర్గాల వారీగా పరిశీలన చేస్తే ముఖ్యంగా ఎస్టీకి చెందిన విద్యార్థులు 33.23 శాతం, ఎస్సీకి 49.61 శాతం, వెనుబడిన వారు 62.5 శాతం, ఇతర కులాలు 82.6 ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నారు. ఆంగ్ల మాధ్యమంలో స్కూళ్లు అందుబాటులో లేకపోవడం, ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు కేవలం ధనికులకు మాత్రమే పరిమితమైపోయి.. గ్రామీణ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీలు వెనబడ్డారని ప్రభుత్వం గుర్తించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా పోటీ ప్రపంచంలో రాణించాలని, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలని గొప్ప లక్ష్యంతో సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ఏర్పాటుకు నిర్ణయించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం రూ.17 కోట్ల ఇచ్చి నారాయణ పుస్తకాలు మున్సిపల్‌ పాఠశాలలకు అందించింది. ఇంగ్లిష్‌ మీడియంపై అనవసరపు విమర్శలు చేస్తున్న కన్నాలక్ష్మీనారాయణ, చంద్రబాబు, ఈనాడు అధినేత వారి మనవళ్లను తెలుగుమీడియంలో చదివిస్తున్నారా..? ఐఏఎస్‌ ఆఫీసర్ల పిల్లలు ఇంగ్లిష్‌ మీడియంలో చదువుతున్నప్పుడు వారి ఇంట్లో పనిచేసే వారి పిల్లల కోసం ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు ఏర్పాటు చేయడం తప్పా..?

ఇంగ్లిష్‌ మీడియం పేద విద్యార్థులకు ఎండమావిలా తయారైంది. ఆ పేదవాడి కలను నిజం చేయాలి.. వారూ చదువుల్లో రాణించాలని సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 2020–2021 విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం చేస్తామని, ఆ తరువాత ఏడాది 9వ తరగతి, మరుసటి ఏడాది పదో తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం చేస్తామని వైయస్‌ జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలుగు మీడియంలో చదువుకున్న వారు పెద్ద పెద్ద చదువులకు వెళ్లినప్పుడు ఇబ్బందులు పడకూడదని సీఎం వైయస్‌ జగన్‌ ఉద్దేశం.

Read Also: మాతృభాషా వికాసానికి కట్టుబడి ఉన్నాం

Back to Top