2022లో విద్యారంగం పురోగతి

‘డిజిటల్‌’ స్థాయికి విద్యా రంగం

సీఎం వైయ‌స్‌ జగన్‌ వినూత్న విధానాలతో అభివృద్ధి పథంలో విద్యా రంగం

బాలలకు అందుబాటులోకి అధునాతన విద్యా విధానాలు

డిజిటల్‌ తరగతులతో సులువుగా బోధన

8వ తరగతి పిల్లలు, టీచర్లకు రూ.686 కోట్లతో ట్యాబులు పంపిణీ

వాటిలోని బైజూస్‌ ఈ–కంటెంట్‌తో బోధన

వెయ్యి స్కూళ్లకు సీబీఎస్‌ఈ గుర్తింపు

అమరావతి: ఆధునిక ఆలోచనలు, పిల్లల భవిష్యత్తు పట్ల నిబద్ధత ఉన్న ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రంలో విద్యారంగం ఎంత ఆధునికతను సంత­రించుకుంటుందో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చెబుతుంది. ఆధునిక భావాలు, అధునాతన విద్యా విధానా­లపై అవగాహన ఉన్న వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్య­మంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో విద్యారంగం తీ­రుతెన్నులు మరాయి.

ఓ వైపు ‘మన బడి నాడు­–నేడు’ కార్యక్రమం ద్వారా పాఠశాలలను మె­రుగు పరుస్తూనే, మరోవైపు ఆధునిక విద్యా విధా­నానికి శ్రీకారం చుట్టారు. విద్యా విధానంలో సమూ­ల మా­ర్పులు తెస్తున్నారు. ప్రభుత్వ చర్యలతో 2022­లో విద్యా రంగం మరో ముందడుగు వేసింది.

చిన్నారు­లకు పునాది స్థాయి నుంచే అభ్యసన సామ­ర్థ్యాలను మెరుగుపర్చేందుకు సాంకేతికతను, డిజి­టల్‌ సాధ­నా­లను సమర్థంగా వినియోగించుకొనేం­దుకు ప్ర­భు­త్వం డిజిటల్‌ విద్యా విధానానికి శ్రీకా­రం చుట్టింది. విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీ­ర్చిదిద్ది వా­రు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అ­వకాశాలను అందిపుచ్చుకొనేలా చర్యలు తీసుకుంది. 

ట్యాబులు, స్మార్ట్‌ టీవీలు, వాల్‌టాప్‌ కంప్యూటర్లు
రాష్ట్రంలో శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూళ్ల నుంచి ఉన్నత పాఠశాలల వరకు అధునాతన పరికరాలను ప్రభు­త్వం అందుబాటులోకి తెస్తోంది. స్మార్ట్‌ టీవీలు, వాల్‌టాప్‌ కంప్యూటర్లు, ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్‌ (ఐఎఫ్‌పీ), ప్రొజెక్టర్‌ బేస్డ్‌ డీసీఆర్‌లను నెలకొల్పు­తోంది. 50 వేలకు పైగా శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూ­ళ్లు, ఫౌండేషన్‌ స్కూళ్లు, ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూళ్లు, హైస్కూల్, హైస్కూల్‌ప్లస్‌ స్కూళ్లలో ఈ డిజిటల్‌ పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు.

తరగతి గదులను డిజిటలీకరణ చేస్తున్నారు. విద్యార్థులను అత్యున్నత సామర్థ్యాలతో తీర్చిదిద్దేందుకు సీబీఎస్‌ఈ విధానా­న్ని ప్రవేశపెట్టింది. ఈ ఏడాదిలో 1,000 స్కూళ్లకు  సీబీఎస్‌ఈ గుర్తింపు కూడా వచ్చింది. మిగతా స్కూ­ళ్లకూ గుర్తింపు వచ్చేలా చర్యలు చేపట్టారు. డిజిటల్‌ తరగతులు ఏర్పాటు చేయించి ఆధునిక ఈ–కంటెంట్‌ ద్వారా బోధన కొనసాగిస్తున్నారు.

ప్రభుత్వ పాఠ­శాలల్లో 4 నుంచి 10 వ తరగతి వరకు దాదాపు 32 లక్షల మంది విద్యార్థులకు బైజూస్‌ సంస్థ ఈ–కంటెంట్‌ను కూడా ప్రభుత్వం ఉచితంగా అందుబాటు­లోకి తెచ్చింది. తల్లిదండ్రుల స్మార్ట్‌ ఫోన్లలో బైజూస్‌ యాప్‌ ద్వారా ఈ– కంటెంట్‌ను డౌన్‌లోడ్‌ చేయించింది.

దీనివల్ల స్కూళ్లలోనే కాకుండా ఇంటి వద్ద కూడా బాలలు వాటిని చదివేలా చేస్తున్నారు. ఏవై­నా సందేహాలున్నా తిరిగి వెనక్కి వెళ్లి ఈ–కంటెంట్‌­ను చూసుకొనే వెసులుబాటు ఉండటంతో విద్యార్థు­లు కూడా ఉత్సాహంగా చదువుకోగలుగుతున్నారు. 

విద్యార్థులు, టీచర్లకు ట్యాబుల పంపిణీ
సీబీఎస్‌ఈ విధానం, డిజిటల్‌ విద్యలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని 5.18 లక్షల మంది 8వ తర­గతి విద్యార్థులకు, ఆ తరగతి టీచర్లకు బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబులను ప్రభుత్వం ఉచితంగా అందించింది. ఒక్కో ట్యాబు ఖరీదు రూ.16 వేలు కాగా బైజూస్‌ కంటెంట్‌కు ఆ సంస్థ బయటి మార్కె­ట్లో ధర ఒక్కో విద్యార్థికి రూ.16 వేలు అవుతుంది.

ఈలెక్కన ఒక్కో విద్యార్థికీ రూ.32 వేలు విలువైన ట్యాబు, కంటెంట్‌ ఉచితంగా ప్రభుత్వం అందించింది. డిసెంబర్‌ 21న బాపట్ల జిల్లా యడ్లపల్లి జడ్పీ హైస్కూలులో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ ట్యాబుల పంపిణీ ప్రారంభించారు.

డిజిటల్‌ విద్యా విధానంతో ఎన్నో ప్రయోజనాలు
► బోధనాభ్యసన ప్రక్రియల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొంటారు
► సంప్రదాయ అభ్యసన విధానంలో విద్యార్థి ఏదైనా ఒక రోజు దాన్ని కోల్పోతే మరునాటి నుంచి అభ్యసనంలో వెనుకబడతాడు. డిజిటల్‌ విద్యా విధానంలో ఎక్కడి నుంచైనా ఆయా అభ్యాసాలను నేర్చుకోవచ్చు
► డిజిటల్‌ విద్యాభ్యాసంలో విద్యార్థుల అభ్య­సన వేగం, సామర్థ్యాలకు అనుగుణంగా స్టడీ మెటీ­రియల్‌ను సరళీకరించడానికి ఉపాధ్యా­యులకు అవకాశమిస్తుంది
► విద్యార్థులు తెలివిని పెంచుకోగలుగుతారు. 
► వారంతట వారే కొత్త అంశాలను డిజిటల్‌ విధానంలో నేర్చుకోగలుగుతారు.
► వారికి అవసరమైన అంశాలను ఆన్‌లైన్‌లో     వనరులను శోధించడం, అధ్యయనం చేయడం ద్వారా అభివృద్ధి సాధిస్తారు.
► సంప్రదాయ విద్యా విధానంలో ఉండే పు­స్త­కాల బరువు డిజిటల్‌ విధానంలో ఉండదు
► పాఠ్యాంశాలు కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతుంటాయి
► విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా రూపుదిద్దుకుంటారు. భవిష్యత్తులో వృత్తి, ఉ­ద్యోగాల్లో ఉన్నతావకాశాలను పొందుతారు. 

తాజా వీడియోలు

Back to Top