దొంగలకు చంద్రబాబు అండ!

కోడెలకు మద్దతుగా నిలిచిన  టీడీపీ అధినేత

ప్రజా వ్యతిరేకిగా ముద్ర

అమరావతి:  నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నా వ్యక్తి తప్పు చేసిన వారికి మద్దతుగా నిలిచారు. ప్రజా ధనాన్ని దోచుకున్న వారికి అండగా నిలిచి ప్రజా వ్యతిరేకిగా చంద్రబాబు ముద్ర వేయించుకున్నారు.14 కేసుల్లో నిందితుడు, కే టాక్స్ తో కల్లోలం సృష్టించి, తాజాగా అసెంబ్లీ ఫర్నిచర్‌ను దొంగతనంగా తరలించుకుపోయిన మాజీ స్పీకర్ కోడెల విషయంలో చంద్రబాబు ఇంతవరకూ స్పందించలేదు. ఇన్నిఆరోపణలు వస్తున్నా కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఖండిచనైనా లేదు. గ్యాప్ తీసుకుని కోడెలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనే అంతా అనుకున్నారు.
ఇంతలోనే గుండెపోటు హైడ్రామాతో కోడెల ఆసుపత్రిలో చేరాడు. చంద్రబాబు ఆసుపత్రికి వెళ్లి కోడెలను పరామర్శించి వచ్చాడు. తెలుగు తమ్ముళ్ళు ఎన్ని తెగులు పనులు చేసినా చంద్రబాబు వాళ్లపై ఏ చర్యలూ తీసుకోడు. గతంలో చింతమనేని, బోండా ఉమ, యరపతినేని వంటి నేతలపై అవినీతి ఆరోపణలు ఎన్ని వచ్చినా ముఖ్యమంత్రిగా ఉన్న బాబు కనీసం విచారణకు కూడా ఆదేశించలేదు. 
ఇప్పుడు కోడెల అక్రమాలు వెలుగులోకి వచ్చినా, అసెంబ్లీ ఆస్తుల దొంగతనంలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా చంద్రబాబు కోడెలను కాపాడేందుకే ప్రయత్నిస్తున్నాడు.  అక్రమార్కులను కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్న టీడీపీ అధినేత మరోపక్క ప్రజలకోసమే తాను కష్టపడుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. తన ఐదేళ్ల పాలనలో తెలుగు తమ్ముళ్లు అరాచకాలను అడ్డుకోకపోగా, ఇప్పటికీ వత్తాసు పలుకుతున్న బాబు ప్రజావ్యతిరేకే అంటున్నారు ఏపీ ప్రజలు. 

తాజా వీడియోలు

Back to Top