దీక్ష కాదు ఖజానాకు శిక్ష

ఢిల్లీలో చంద్రబాబు దీక్ష ప్రజలకు శిక్షలా ఉంది. దాదాపుగా 12 కోట్లు ఖర్చు చేస్తూ చంద్రబాబు ఈ దీక్షను చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ పెద్దలను పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలించి, ఏసీ గదుల్లో వసతి కల్పించి కోట్లు తగలేస్తున్నారు అని మండిపడుతున్నారు. చివరకు ప్రభుత్వ ఉద్యోగులను కూడా బలవంతంగా దీక్షలకు తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకోసం విమాన టికెట్లు కూడా ప్రభుత్వ సొమ్ము తో నే కొనుగోలు చేస్తున్నారు. లోక్సత్తా, ఆప్ వంటి రాజకీయ పార్టీల నేతలు, విద్యార్థి సంఘాల ను కూడా ప్రభుత్వ ఖర్చులతోనే దీక్ష కు తరలిస్తున్నారు. నేతలు బస చేసిన హోటల్ నుంచి దీక్షాస్థలానికి తరలించేందుకు బస్సులు కూడా ఏర్పాటు చేశారు. ఏపీ భవన్ మొదలు, దీక్షాస్థలి వరకు, ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో భారీ హోర్డింగుల కోసం లక్షలు ఖర్చు పెట్టారు.

ప్రధాని మోదీ తన రాజకీయ పర్యటనల కోసం అయ్యే  ఖర్చు మొత్తం తమ పార్టీ మాత్రమే ఖర్చు చేస్తుంది అని చెప్పారు. చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం, రాజకీయ అవసరాల కోసం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నాడు. ధర్మ పోరాట దీక్ష ల పేరుతో ప్రతి జిల్లాలోనూ చేసిన దీక్షలకు ఇప్పటికే 100 కోట్లకు పైగా ఖర్చు అయింది. బాబు దొంగ దీక్షలు, ప్రచార ఆర్భాటాలు రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప, ప్రజల కోసం కాదని అంటున్నారు విశ్లేషకులు. 

నిజంగా విభజన హామీల కోసం ప్రధానిపై పోరాటం చేయదలుచుకుంటే, మోడీ ఏపీలో ఉండగా అక్కడే ఎదురుపడి ప్రశ్నించవచ్చు. కేంద్రం ఇచ్చానని చెబుతున్న లక్షల కోట్ల నిధులపై వివరణ కోరవచ్చు. నిధుల దుర్వినియోగం పై ప్రధాని చేసిన ఆరోపణలు నిజమో కాదో ప్రజల ముందు తేల్చే ప్రయత్నం చేయొచ్చు. రైల్వే జోన్, ప్రత్యేక హోదా, పోలవరం నిధులు గురించి నిలదీయవచ్చు.

 కానీ బాబుకు ఆ దైర్యం ఉండదు. మోడీ వెనక చాటుగా అన్యాయం అని అరవడం తప్ప కేంద్రంతో బాబు పోరాడింది ఏమీ లేదు. ప్రతిపక్ష వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విభజన హామీలకై, ప్రత్యేక హోదాకై పోరాటాలు చేసినప్పుడు ఇదే చంద్రబాబు వారిపై కేసులు పెట్టించాడు. ప్రతిపక్ష నేత జగన్ హోదా కోసం నిరవధిక దీక్ష చేస్తున్నప్పుడు బలవంతంగా ఆపించాడు. హోదా పేరెత్తితే జైలుకే అంటూ బెదిరించాడు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినందుకు ప్రధానికి కృతజ్ఞతలు చెప్పాడు. అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం పెట్టాడు. వెంకయ్య ని పిలిచి సన్మానం చేశాడు. నేడు ఇదే చంద్రబాబు మోడీ మోసం చేశాడని మొసలి కన్నీరు కారుస్తున్నాడు. ధన్యవాదాలు చెప్పిన నోటితోనే ప్రధానిని దూషిస్తున్నాడు. ఎన్నికల కాలం సమీపించినప్పుడు చంద్రబాబుకు ప్రజాస్వామ్యం, ప్రజలు, అన్యాయాలు గుర్తుకు వస్తాయి. ఇది బాబు మార్కు పక్కా పచ్చి అవకాశ వాద స్వార్ధపూరిత రాజకీయ దీక్ష తప్ప మరొకటి కాదు అంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు.

Back to Top