అభివృద్ధి మొత్తం బోగస్‌

– శంకుస్థాపనల పేరిట ఎల్లో మీడియాలో నకిలీ వార్తలు

– ‘శిలాఫలకం– శంకుస్థాపనల’ సూత్రాన్ని అనుసరిస్తున్న చంద్రబాబు

– కాంగ్రెస్‌తో పొత్తును ఛీదరించుకున్న తెలంగాణ ప్రజలు

ఒక్క నిజాన్ని గెలవడానికి వేయి అబద్ధాలు పోరాటం చేస్తున్నాయి. ఒక సత్యాన్ని జయించాలని అసత్యాలన్నీ కంకణం కట్టుకున్నాయి. వెలుగును చీకటితో కమ్మేద్దామని పగటి కలలు కంటున్నాయి. ప్రతిపక్ష నేత లక్ష్యంగా అధికార తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుట్రలకు తెగబడుతున్నాడు. నాలుగేళ్లుగా ప్రజల మద్దతుతో పోరాటం చేస్తున్న నిప్పురవ్వను ఆర్పేయాలని విష ప్రయోగాలకు వెనుకాడటం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘గెలవాలంటే నిలవాలి.. ’ అనే సిద్ధాంతాన్ని పక్కనపెట్టి గెలవాలంటే అడ్డుతొలగించుకోవాలన్నంత నీచమైన రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తున్నాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. గడిచిన ఏడాది కాలంగా ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల మధ్యనే ప్రజా సంకల్పయాత్రలో ఉండి అధికార పార్టీపై పోరాడతుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం జిమ్మికులతో జనాన్ని బుట్టలో పడేయాలని నానా అవస్ధలు పడుతున్నాడు. 

మూడు సంవత్సరాలు బీజేపీతో అంటకాగిన చంద్రబాబు.. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో బయటకొచ్చాడు. ఎన్నికలకు ముందు.. తర్వాత నాలుగేళ్లు మోడీని వీరుడు.. శూరుడు అని పొగిడిన నోటితోనే ఇప్పుడు మోడీని దేశ ద్రోహి.. ఆం«ధ్రాలో చిచ్చు పెట్టాడని కొండంత రాగాలు తీస్తున్నాడు. చెంబుడు నీళ్లు, మట్టి ఇచ్చినప్పుడే తేల్చుకోకుండా మిన్నకుండిపోయిన బాబు.. మూడున్నరేళ్లు ఇద్దరు ఎంపీలను కేంద్రంలో మంత్రులుగా కొనసాగించాడు. దేశాన్ని కాపాడటానికే కాంగ్రెస్‌తో కలుస్తున్నానని కలరింగ్‌ ఇచ్చే చంద్రబాబు.. తన పార్టీ ఎంపీ సుజనా చౌదరి రూ. 10 వేల కోట్ల మేర బ్యాంకులకు బురిడీ కొట్టించినా ఏనాడూ రాజీనామా చేయించబోతున్నాడు అనే గాసిప్పులు కూడా రాలేదు. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి విభజన హామీలు నెరవేర్చాలని కోరుతున్న ప్రతిపక్ష పార్టీ ఉద్యమాలను అణచివేస్తున్న చంద్రబాబు... బీజేపీకి ఠీ కొట్టిన నాటి నుంచి.., నవ నిర్మాణ దీక్షలకు ధర్మ పోరాట దీక్షలు అని పేరు మార్చి జనాన్ని మోసగించడం తప్ప మరేమిటీ కాదు. హోదాపై యూటర్న్‌ల మీద యూటర్న్‌లు తీసుకున్న చంద్రబాబు తన అవసరాల కోసం దిగజారుడుతనాన్ని పలుమార్లు వ్రూవ్‌ చేసుకున్నాడు. కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించి ద్రోహం చేసిందన్న చంద్రబాబు.. అదే పార్టీతో కలిసి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి ఘోర పరాభవం చవిచూశాడు. ఏ పార్టీకి వ్యతిరేకంగా ఆనాడు ఎన్‌టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించాడో అదే పార్టీతో దేశ భవిష్యత్తు కోసం జట్టు  కట్టానని చెప్పిన కాకమ్మ కథలను జనం ఛీకొట్టారు. 

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చంద్రబాబు శిలాఫలకాల సూత్రాన్ని ఆచరణలో పెట్టాడు. పచ్చ మీడియా మాత్రమే ఉన్న రోజుల్లో అనుసరించిన ఈ సూత్రాన్ని గత పది రోజులుగా పటిస్తున్నాడు. పోలవరం గేటుకు శంకుస్థాపన, కడప స్టీల్‌ ప్లాంట్, రాజధానికి శంకుస్థాపన, త్వరలో కర్నూల్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవం.. ట్రయల్‌ రన్‌ పేరుతో జనాన్ని బుట్టలో పడేయడానికి సిద్ధమయ్యాడు. చంద్రబాబు ఏం చేసినా దేశం కోసమే అన్నట్టు అచ్చేసే ఎల్లో మీడియా ఈసారి కూడా బాబును జాకీలేసి పైకిలేపే వ్యూహంతో పావులు కదుపుతోంది.. కానీ సోషల్‌ మీడియా ప్రభావం ముందు ఎల్లో మీడియా ఏనాడో తోక ముడిచిందని బోధ పడినట్టు లేదు. 

తాజా వీడియోలు

Back to Top