ప్ర‌తి ఇంటా జెండా పండుగ  

ఆగ‌స్టు 13 నుంచి 15 వ‌ర‌కు ఘ‌నంగా కార్య‌క్ర‌మాలు

రాష్ట్ర వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ 

అమ‌రావ‌తి: స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రతి భారతీయుని మదిలో స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తి ఉప్పొంగేలా.. దేశ వ్యాప్తంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు ఘనంగా కార్యక్రమాలు

ఎగరాలి ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా.. ఉప్పొంగాలి జాతీయ భావం మది నిండా.

https://youtu.be/i7RL9Gr3Bf8

రాష్ట్రంలో కోటి జాతీయ జెండాల పంపిణీ
 రాష్ట్ర వ్యాప్తంగా ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్టు పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా కోటి జాతీయ జెండాలను పింఛన్‌దారులకు ఉచితంగా పంపిణీ చేశామన్నారు.  శనివారం ఉదయం విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ నుంచి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వరకు మూడు కిలో మీటర్ల జాతీయ పతాక ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 278 మంది స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సన్మానించడంతో పాటు 399 చెరువులను ఆధునికీకరించి అమృత్‌ సరోవర్‌ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. త్యాగధనుల స్ఫూర్తిని చాటేలా చారిత్రక సంపద, వారసత్వ కట్టడాలను సుందరంగా తీర్చిదిద్దామన్నారు. అన్ని వర్గాలను జెండా పండుగలో మమేకం చేయడానికి మూడు లఘు చిత్రాలను రూపొందించి సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించినట్టు వివరించారు.  

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top