సీఎం వైయ‌స్ జగన్‌ సాయం జీవితాంతం మరువలేనిది

 తూర్పు గోదావరి:  వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక లబ్ధిదారుల ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఆయన మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారాయన. బాధితులను చూసి కాన్వాయ్‌ ఆపి దిగి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.  

 ముఖ్యమంత్రి ఆదేశాలతో నలుగురు బాధితులతో మాట్లాడి అవసరమైన సాయం అందించారు జిల్లా కలెక్టర్‌ మాధవీలత. సీఎం స్పందనతో బాధిత కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. తమ సమస్యపై ఇంత త్వరగా సీఎం వైఎస్‌ జగన్‌ స్పందించడం జీవితాంతం మరువలేమంటున్నారు.

సాయి గణేష్‌
లాలా చెరువు హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన 16 ఏళ్ళ సాయి గణేష్‌ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని, మెరుగైన చికిత్స అందించేందుకు తగిన ఆర్ధిక స్ధోమత లేదని ముఖ్యమంత్రికి విన్నవించుకున్న సాయి గణేష్‌ తండ్రి, తక్షణ సహాయానికి హామీనిచ్చిన సీఎం

సి. డయానా శాంతి
నిడుదవోలు శెట్టిపేటకు చెందిన రెండేళ్ళ డయానా శాంతి స్పైనల్‌ మస్క్యులర్‌ వ్యాధితో బాధపడుతోంది. తనకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు తగిన ఆర్ధిక స్ధోమత లేదని సీఎంకి విన్నవించుకున్న తల్లి సూర్యకుమారి. తక్షణ సహాయానికి హమీనిచ్చిన సీఎం.

సిరికొండ దుర్గా సురేష్‌ 
రాజమహేంద్రవరం దేవిచౌక్‌కు చెందిన సిరికొండ దుర్గా సురేష్‌ తన కుమార్తెకు గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతుందని, తనకు 8 నెలల క్రితం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో డ్రైవర్‌ గా చేస్తున్న ఉద్యోగం కూడా పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

వి. అమ్మాజి
డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా గూడపల్లికి చెందిన అమ్మాజి తన కుమారుడు చర్మ వ్యాధితో బాధపడుతున్నాడని, ఇప్పటికే వైద్య ఖర్చుల నిమిత్తం పెద్ద మొత్తంలో ఖర్చు చేసి తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నట్లు సీఎం దృష్టికి తీసుకొచ్చింది. అమ్మాజి కుటుంబాన్ని ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.

Back to Top