ఏపీ బడ్జెట్‌ ఏడు రంగుల ఆంధ్ర ధనుస్సు

అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా రూ.2.86 లక్షల కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌

విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటికి ప్రాధాన్యం

ద్రవ్య, రెవెన్యూ లోటు తగ్గించే చర్యలు

నాలుగు నెలలకు రూ.88,215 కోట్ల వ్యయానికి ప్రతిపాదన 

మొత్తం బడ్జెట్‌ రూ.2,86,389.27 కోట్లు

మూలధన వ్యయం రూ.30,530.18 కోట్లు

రెవెన్యూ వ్యయం రూ.2,30,110.41  కోట్లు

రెవెన్యూ లోటు 24,758.22 కోట్లు

ద్రవ్య లోటు రూ.55,817.50 కోట్లు

రోటి, కపడా, ఔర్‌ మకాన్‌’ ఎవరు అవునన్నా, కాదన్నా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇదో నినాదం. ప్రజలకు వీటిని సమకూర్చడం పాలకుల కనీస బాధ్యత. ఇవి అందుబాటులో ఉన్నప్పుడే ఏ కుటుంబమైనా అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేయడానికి ఉపక్రమిస్తుంది. వీటిని విస్మరించి, గ్రాఫిక్స్‌తో ఎన్ని మేడలు కట్టినా అవి నీటి మూట­లేనని చరిత్ర చెబుతోంది. ప్రజల ఆనందాన్ని, వారి బాగోగులను చూసి ఆనందించే వాడే అసలైన పాలకుడని కూడా చరిత్ర వెల్లడిస్తోంది. తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు బాసటగా నిలిచినప్పుడే ప్రజా రంజక పాలన అనిపించుకుంటుంది. 

విద్య, వైద్యం, వ్యవసాయం.. ఈ మూడు రంగాల్లో చేయూత అందిస్తే చాలు, ప్రజలు స్వయం సమృద్ధి దిశగా అడుగులేస్తారని విశ్వ వ్యాప్తంగా విఖ్యాత ఆర్థిక నిపుణులు నొక్కి వక్కాణిస్తుండటం తరచూ వినిపిస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభ్యున్నతికే ఎన్నో దేశాలు, రాష్ట్రాలు సతమతం అవుతున్న వేళ.. ఇంతకు మించిన సంక్షేమాభివృద్ధిని సాకారం చేస్తూ మన రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వడివడిగా అడుగులు ముందుకు వేస్తోంది. నవరత్నాల పథకాలు, సప్త స్వరాల్లాంటి థీమ్‌ల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన జీవనాన్ని అందించాలనే తపన, తాపత్రయం.. బడ్జెట్‌లో కళ్లకు కడుతోంది.

సాధారణ ఎన్నికలకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024–25 ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రూపుదిద్దుకుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ 2024 – 25 ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను బుధవారం అసెంబ్లీకి సమర్పించారు. ద్రవ్యలోటు, రెవెన్యూ లోటును తగ్గించేందుకు ప్రయత్నం చేసిన  ఆర్థిక మంత్రి మేనిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాల అమలు ద్వారా గత ఐదేళ్లలో సాధించిన ప్రగతి, ఫలితాలు, సంక్షేమాన్ని బడ్జెట్‌ ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు.

కొత్త ఆలోచనలు, వినూత్న విధానాలను అమలు చేయడం ద్వారా అతి తక్కువ వ్యవధిలో ప్రభుత్వం సంతృప్త స్థాయిలో ప్రజలందరి జీవితాల్లో గణనీయమైన మార్పులు తేగలిగిందన్నారు. ఎన్నికల నేపధ్యంలో 2024–25 ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ నుంచి ఏప్రిల్‌ – జూలై వరకు నాలుగు నెలలు పాటు వ్యయానికి రూ.88,215 కోట్ల పద్దును అసెంబ్లీ ఆమోదానికి ప్రతిపాదించారు. భారీ అంచనాలకు వెళ్లకుండా వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్‌ ప్రతిపాదనలకే పరిమితమయ్యారు. ఎప్పటిలాగానే విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, సాగునీటి రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారు.   

► 2024–25 ఓటాన్‌ అకౌంట్‌ మొత్తం బడ్జెట్‌ను రూ.2,86,389.27 కోట్లు గా బుగ్గన ప్రతిపాదించారు. మూలధన వ్యయం రూ.30,530.18 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ.2,30,110.41 కోట్లుగా ప్రతిపాదించారు. రెవెన్యూ లోటు 24,758.22 కోట్లు ఉంటుందని, ద్రవ్య లోటు రూ.55.817.50 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. ద్రవ్యలోటు జీఎస్‌డీపీలో దాదాపు 3.51% ఉంటుందని, రెవెన్యూ లోటు జీఎస్‌డీపీలో దాదాపు 1.56 శాతం ఉంటుందని అంచనా వేశారు. 2023–24 సవరించిన అంచనాల మేరకు  రెవెన్యూ లోటు జీఎస్‌డీపీలో 2.19 శాతం, ద్రవ్య లోటు జీఎస్‌డీపీలో 4.18 శాతం ఉంటుందని తెలిపారు.   

► సాధారణ విద్యకు బడ్జెట్‌ కేటాయింపుల్లో పెద్ద పీట వేశారు. సాధారణ విద్యా రంగానికి రూ.33,898 కోట్లు కేటాయించారు. సంక్షేమ, అభివృద్ది రంగాలకు తగినన్ని నిధులు కేటాయించారు. గ్రామీణాభివృద్ధికి రూ.17,816 కోట్లు, పట్టణాభివృద్దికి రూ.9546 కోట్లు, వైద్య, ఆరోగ్య రంగానికి రూ.17,916 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.14,236 కోట్లు, సాగునీటి రంగానికి రూ.12,038  కోట్లు, మొత్తం సంక్షేమ రంగానికి రూ.44,668 కోట్లు కేటాయించారు. విద్యుత్‌ రంగానికి రూ.6,595 కోట్లు, రవాణా రంగానికి రూ.10,334 కోట్లు కేటాయింపులు చేశారు. పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక సదుపాయాల పెట్టుబడులకు రూ.3,940 కోట్లు కేటాయించారు. 

ఐదేళ్లలో ‘సుపరిపాలిత ఆంధ్ర’గా.. 

2019.. అప్పటికి రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తయింది. విభజన గాయాలు మానేందుకు, సాంత్వన చర్యలు తీసుకునేందుకు గత టీడీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పైగా.. పరిస్థితిని పెనం మీంచి పొయ్యలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని పునరి్నర్మించుకోవడంపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానంగా దృష్టిపెట్టారు. ఈ సమస్యలను అధిగమించాలంటే మూస పద్ధతిలో కాకుండా సరికొత్త విధానంలో మాత్రమే అభివృద్ధి సాధించగలమని ఆయన తన సుదీర్ఘ పాదయాత్ర ద్వారా బలంగా విశ్వసించారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లుగా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.

ముఖ్యంగా సుపరిపాలనలో భాగంగా పాలనలో వికేంద్రీకరణ ప్రవేశపెట్టడం అత్యంత ప్రధానమైనది. ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు సీఎం జగన్‌ తీసుకెళ్లారు. గ్రామస్థాయి నుంచి ప్రభుత్వాన్ని పటిష్టపరిచారు. విస్తృతస్థాయిలో పాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించి సమాజంలోని వివిధ వర్గాల వారికి సాధికారత అందించి రాష్ట్రాన్ని ‘సుపరిపాలిత ఆంధ్ర’గా తీర్చిదిద్దారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బుధవారం తన బడ్జెట్‌  ప్రసంగంలో రాష్ట్రం ‘సుపరిపాలిత ఆంధ్ర’గా ఎలా రూపాంతరం చెందిందో స్పష్టంగా వివరించారు.   

పాలనా వికేంద్రీకరణ.. 
ప్రజలు సాధికారిత, వికేంద్రీకరణ, సుపరిపాలన అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనవి. వీటిని ప్రజల చెంతకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామస్థాయి నుంచి ప్రభుత్వాన్ని పటిష్టపరచడం, విస్తృత స్థాయిలో పాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించడం, సమాజంలోని వివిధ వర్గాల వారికి సాధికారతనందించింది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలు, పోలీసు వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ మాత్రమే కాకుండా స్థానిక సంస్థలను బలోపేతం చేసింది. కమ్యూనిటీ కాంట్రాక్టుల విధానం, స్థానిక పాలనలో పౌరుల చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించింది. అలాగే.. 

► దాదాపు 1,35,000 మంది ఉద్యోగులతో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేసింది. వీటిల్లో 2.66 లక్షల మంది వలంటీర్లను నియమించింది. తద్వారా అర్హులైన లబ్ధిదారులందరికీ ఎలాంటి లోపాలు లేకుండా సకాలంలో పారదర్శకంగా సంక్షేమ పథకాలకు తోడు పౌర కేంద్రీకృత సేవలు గడప గడపకు అందిస్తోంది.  
► అందుబాటులో ఉన్న వనరులను సముచితంగా వినియోగించి జిల్లాల సంఖ్యను 13 నుంచి 26కు.. రెవెన్యూ డివిజన్లను 52 నుంచి 77కి పెంచి  పరిపాలనాపరమైన పునర్నిర్మాణాన్ని చేపట్టింది. ఇది ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడంతో పాటు ప్రభుత్వాన్ని మరింత జవాబుదారీగా,  సమర్థవంతంగా చేసింది.  
► నూతన సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాల నిర్మాణం ప్రజలకు సేవలను మరింత చేరువ చేస్తాయి.  
► ఇక పౌరుల రక్షణ, భద్రతను పెంపొందించడానికి అవసరమైన చోట్ల రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోలీసు సబ్‌–డివిజన్లు ఏర్పాటుచేసింది.  
► ప్రతి జిల్లాలో దిశా పోలీసుస్టేషన్లు ఏర్పాటుచేయడమే కాక రాష్ట్రవ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు మరియు పర్యాటక ప్రాధాన్యత కలిగిన 20 ముఖ్య ప్రాంతాల్లో పర్యాటక పోలీసుస్టేషన్లు ప్రారంభమయ్యాయి.  
► భద్రతా మౌలిక సదుపాయాలు పెంచడం ద్వారా ప్రజాభద్రత మరింత మెరుగుపడింది.   

గడప గడపకు మన ప్రభుత్వం.. 
► ఈ కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు పౌరుల నుంచి నేరుగా ప్రాథమిక సౌకర్యాలు, మౌలిక సదుపాయాల అవసరాలను తెలుసుకుని వాటిని సమకూర్చడం ద్వారా బాధ్యతాయుతమైన పాలనను అందిస్తున్నారు.  
► ఈ కార్యక్రమంలో భాగంగా 58,288 పనులను రూ.2,356 కోట్ల అంచనాతో మంజూరు చేయగా, ఇప్పటివరకు రూ.729 కోట్లతో 17,239 పనులు పూర్తయ్యాయి.  
► రాష్ట్రంలో స్థానిక సంస్థలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు నాల్గవ రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సులను ఆమోదించి, ఐదవ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని కూడా ఏర్పాటుచేసింది.  

వివక్షకు దూరంగా..
గత ఎన్నికల ప్రచార సమయంలో చెప్పిన మాదిరిగానే ముఖ్యమంత్రి జగన్‌ రాజకీయాలు, ప్రాంతాలు, కులమతాలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి ఫలాలను అందించినట్లు బడ్జెట్‌ ప్రసంగంలో బుగ్గన పేర్కొన్నారు. పాలనా వికేంద్రీకరణకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన చర్యలను వివరిస్తూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావించారు.

ప్రతిపక్ష నాయకుడి నియోజక వర్గమని వదిలేయకుండా కుప్పంను రెవిన్యూ డివిజన్‌గా ప్రకటించడంతోపాటు పౌరుల రక్షణ, భద్రత కోసం కొత్త పోలీసు సబ్‌ డివిజన్, పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వం అందరినీ సమానంగా చూస్తోందనేందుకు ఇదే ఉదాహరణ అని చెప్పారు. సంక్షేమ ఫలాలను వివరిస్తూ కొందరు లబ్ధిదారులకు చేకూరిన ప్రయోజనాన్ని బుగ్గన వీడియో ప్రజంటేషన్‌ ద్వారా తెలియచేశారు. ఇలాంటి ఉదంతాలు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ కనిపిస్తాయన్నారు. 

► తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జి.ఎర్రగుడి గ్రామానికి చెందిన వడ్డే రాజేశ్వరి పొదుపు సంఘాల రుణాల మాఫీ, పింఛన్, ఆసరా కింద లభించిన సాయంతో గొర్రెలను కొనుగోలు చేశారు. తనను కష్టాల నుంచి ఈ ప్రభుత్వం గట్టెక్కించిందని ఆమె సంతోషంగా చెబుతోంది.
► విశాఖ జిల్లా భీమిలి మండలం టి.నగరపాలెంకు చెందిన పల్లా కృష్ణవేణి చేయూత కింద అందిన మొత్తంతో కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకుంది. అమ్మ ఒడి సాయం కూడా అందుతోంది. కుట్టు మిషన్‌ ఉంది. రోజుకు రూ.1,000 దాకా సంపాదిస్తున్నానని, కిరాణా దుకాణంతో తమ బతుకులు మారాయని సగర్వంగా చెబుతోంది.
► విశాఖపట్నం ఆరో వార్డు మధురవాడకు చెందిన వాండ్రాసి అన్నపూర్ణ తాము టీడీపీ మద్దతుదారులైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు ఇతర పథకాలనూ అందిస్తోందని ధన్యవాదాలు తెలియచేస్తోంది.
► నడవలేని స్థితిలో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరుకు చెందిన వృద్ధురాలు కవుజు బేబీ అనే మహిళకు ప్రతి నెలా రూ.3,000 పెన్షన్, ఇతర పథకాలను ఇంటి వద్దే అందిస్తుండటంతో ఈ ప్రభుత్వం తనను ఎంతో ఆదుకుంటోందని కృతజ్ఞతలు తెలిపింది.
► విశాఖకు చెందిన రోబంకి చిరంజీవులు అనే వృద్ధ దంపతులకు వైఎస్సార్‌ కంటి వెలుగు ద్వారా కంటి ఆపరేషన్లు, ఆరోగ్యశ్రీ ద్వారా కాలికి ఆపరేషన్‌ నిర్వహించడంతోపాటు ఆసరా, పెన్షన్‌ అందిస్తుండటంతో ఈ ప్రభుత్వం కన్న కొడుకులా ఆదుకుంటోందంటూ సంతోషంగా చెబుతున్నారు. 
► ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి పంపడంతో ఒంటరిగా ఉన్న తాను దేవాలయాల వద్ద యాచిస్తూ జీవనం సాగించానని, ఈ ప్రభుత్వం వచ్చాక రూ.3,000 పెన్షన్‌ ప్రతీ నెలా ఇస్తుండటంతో భిక్షాటన మానుకుని గౌరవంగా బతుకుతున్నానంటూ విజయనగరం జిల్లా బాడంగి మండలం వాడాడ గ్రామానికి చెందిన బత్తిన అప్పమ్మ చెబుతోంది.  

ఇదిగో.. సామర్థ్య ఆంధ్ర  

Jagans government has improved the education sector - Sakshi

 ఆంధ్రప్రదేశ్‌ పరిపూర్ణ మానవ అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అనతి కాలంలోనే ‘సామర్థ్య ఆంధ్ర’గా ఆవిర్భవించింది. విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో గణనీయమైన పురోగతితో దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ‘సామర్థ్య ఆంధ్ర’ కింద 2024–25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో ఏకంగా రూ.53,508.04 కోట్లు కేటాయించింది.   

బుధవారం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ శాసన సభలో బడ్జెన్‌ను ప్రవేశపెట్టారు. పాఠశాల, సాధారణ విద్యకు పెద్దపీట వేస్తూ రూ.33,898.04 కోట్లు కేటాయించారు. సాంకేతిక విద్యకు రూ.578.59 కోట్లు, కార్మిక శక్తి, ఉద్యోగాల కల్పనను పెంచేలా రూ.1,114.74 కోట్లు కేటాయించారు. ఇక గ్రామీణ పేదలకు ఇంటి వద్దనే ఆరోగ్య సేవలు అందిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేసేలా, ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యాన్ని పెంచడానికి రూ.17,916.67 కోట్లు కేటాయించడం విశేషం.  –సాక్షి, అమరావతి

‘విద్య’యీ భవ 
పిల్లలకు మంచి విద్య అందించి, ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నది సీఎం వైఎస్‌ జగన్‌ సంకల్పం. అందుకే ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచి ఇంగ్లిష్‌ మీడియం తీసుకొచ్చింది. వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ అమలు చేస్తోంది. త్వరలో ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌ (ఐబీ) పాఠ్య ప్రణాళికలను అమలు చేయనుంది. ఆంగ్ల భాషా నైపుణ్యం పెంచేలా టొఫెల్‌ సరి్టఫికేషన్‌ అందిస్తోంది. విద్యా బోధనలో సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. పిల్లలకు ఉచిత కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను ఉచితంగా అందిస్తోంది.

3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్‌తో బోధన ప్రవేశపెట్టింది. జగనన్న విద్యాకానుక కిట్ల ద్వారా ఏటా రూ.3,367 కోట్లతో 47 లక్షల మంది విద్యార్థులకు యూనిఫామ్‌లు, బ్యాగ్‌లు, బూట్లు, పాఠ్యపుస్తకాలను అందిస్తోంది. మనబడి నాడు–నేడు ద్వారా 56,703 ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, జూనియర్‌ కళాశాలల రూపురేఖలను మార్చింది. నాడు – నేడు ద్వారా ఇప్పటివరకు రూ.7163 కోట్ల స్కూళ్లను అత్యాధునికంగా తీర్చిదిద్దింది. 

రెడీ టు వర్క్‌ 
విద్యార్థులు చదువుల సమయంలోనే పరిశ్రమలు, ఐటీ సంస్థలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులుగా తీర్చిదిద్దుతోంది. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 192 స్కిల్‌ హబ్‌లు, పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో 27 స్కిల్‌ కాలేజీలు స్థాపించింది. తద్వారా 2023–24 ఆర్థిక సంవత్సరంలో 21 రంగాల్లో 1.06 లక్షల మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వగా.. వీరిలో 95 శాతం మంది ఉద్యోగాలు పొందారు.

యువతకు శిక్షణ ఇవ్వడానికి 201 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో వర్చువల్‌ ల్యాబ్‌లు, క్లాస్‌ రూమ్‌లు ఏర్పాటు చేసింది. 14 పారిశ్రామిక శిక్షణ కేంద్రాల్లో (ఐటీఐ) కియా మోటార్స్, మారుతీ, టయోటా, ఇసుజు మొదలైన సంస్థల సహాయంతో అధునాతన యంత్రాలతో ల్యాబ్‌లను అభివృద్ధి చేసింది.  

ఉన్నతంగా విద్య 
జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే. ఇప్పటివరకు  విద్యా దీవెన కింద రూ.11,901 కోట్లు, వసతి దీవెన కింద రూ.4,276 కోట్లు ఖర్చు చేసింది. తద్వారా విద్యార్థుల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గి ఉన్నత విద్యలో డ్రాప్‌ అవుట్‌ శాతం భారీగా తగ్గింది. ప్రపంచంలోని టాప్‌–50 (సబ్జెక్టుల వారీగా) విశ్వ విద్యాలయాల్లో రాష్ట్ర విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆకాంక్షతో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ప్రవేశపెట్టింది.

ఇంటర్న్‌షిప్‌ ద్వారా చదువుతో పాటే విద్యార్థులు బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగులు పొందే అవకాశాన్ని కల్పించింది. దేశంలోనే తొలిసారిగా ఏపీలోనే ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో వైద్య, దంత వైద్య కోర్సుల్లో 50 శాతం కోటా, మిగిలిన అన్ని కోర్సుల్లో 35 శాతం సీట్లను ప్రభుత్వ కోటాలో పేదలు ఉచితంగా చదువుకునే వెసులుబాటు కల్పించింది. 

ఆరోగ్యశ్రీతో పునరుజ్జీవనం
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నాడు–నేడు ద్వారా రూ.16,852 కోట్లతో  ఉప ఆరోగ్య కేంద్రాల నుంచి బోధన ఆస్పత్రుల వరకు సమూల మార్పులు చేసి మెరుగైన వైద్యాన్ని అందిస్తోంది. గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్‌ విధానంతో 14 రకాల వైద్య పరీక్షలను, 105 రకాల మందులను ఇంటి వద్దనే అందిస్తోంది.  డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ పేదల పాలిట సంజీవనిగా మారింది. కుటుంబ ఆదాయ పరిమితిని రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచి, మరింత మందికి ఆరోగ్యశ్రీ సేవలను అందిస్తోంది.

ప్రొసీజర్స్‌ను పెంచి, క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు పరిమితి లేని చికిత్సలు అందిస్తోంది. ఆరోగ్య ఆసరా కింద 25 లక్షల మంది రోగులకు రూ.1366 కోట్లు అందించింది. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా 1.67కోట్ల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు, మందులు పంపిణీ చేసింది.

కిడ్నీ రోగులకు కార్పొరేట్‌ సౌకర్యాలతో 200 పడకలతో పలాసలో వైఎస్సార్‌ కిడ్నీ రిసెర్చ్, సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మించింది. వైద్య శాఖలో 53,126 మంది శాశ్వత సిబ్బందిని నియమించింది. జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల పోస్టుల ఖాళీలు సగటున 61 శాతం ఉంటే.. ఏపీలో దానిని 4 శాతానికంటే తక్కువకు తగ్గించడం గమనార్హం.  

గోరుముద్దతో ఆరోగ్యం..  
ప్రభుత్వం జగనన్న గోరుముద్ద కింద ఏడాదికి రూ.1,910 కోట్లు ఖర్చు చేస్తూ 43 లక్షల మందికిపైగా విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ఇది గత ప్రభుత్వం చేసిన దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ. గిరిజన ప్రాంతాల్లో వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్, మైదాన ప్రాంతాల్లో వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కిట్లతో మహిళల్లో రక్తహీనత సమస్యను తగ్గిస్తోంది. 

సామర్ధ్యాంధ్ర కేటాయింపులు  
రూ. 53,508.04 కోట్లు 
సాధారణ విద్య  రూ.33,898.04 కోట్లు  
వైద్య రంగంరూ.17,916.67 కోట్లు 
సాంకేతిక విద్య రూ.578.59 కోట్లు 
ఉద్యోగ, ఉపాధి రంగాలురూ. 1,114.74 కోట్లు

చేయూతనిచ్చాం.. ఆసరాగా నిలిచాం 

Govt aim at womens welfare - Sakshi

 రాష్ట్ర ప్రభుత్వం ‘చేయూత’ను ఇచ్చి ‘ఆసరా’గా నిలవడంతో పేద మహిళలు మహారాణులుగా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతున్నారు. ‘ఒక సమాజం పురోగతిని.. ఆ సమాజంలోని మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను కొలుస్తాను’ అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అన్న మాటలనే ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంది. 

ఇందుకు తగ్గట్టే రాష్ట్ర జనాభాలో సగ భాగం ఉన్న మహిళల అభ్యున్నతిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. సామాజికంగా, ఆర్థికంగా వారిని ఉన్నత స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా వారికి తోడ్పాటును అందిస్తోంది.  

మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. లక్షలాది మంది పేద కుటుంబాలు సంతోషంగా జీవనం సాగిస్తున్నాయి.  ఈ మేరకు వైఎస్సార్‌సీపీ పాలనలో రాష్ట్రంలోని పేదల కుటుంబాల్లో చోటుచేసుకున్న మార్పులను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..

మహిళా సాధికారత కోసం..
రాష్ట్ర జనాభాలో సగం ఉన్న మహిళలు సంక్షేమం, సాధికారతకు నోచుకోకపోతే ఏ రాష్ట్రమైనా పురో­గతి సాధించలేదు. దీన్ని గుర్తించిన ప్రభు­త్వం వారి కోసం అనేక వినూత్న కార్యక్రమాలను ప్రారంభించింది. మహిళలను ఆర్థిక వ్యవస్థలో సమాన భాగస్వాములుగా చేయడంతో తమ కాళ్లపై తాము నిలబడు­తున్నారు. దీనిద్వారా ఆర్థిక అడ్డంకులను అధిగమించి సాధికారతను సాధిస్తున్నారు.

అంతేకాకుండా అభివృద్ధి కార్య­క్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. మహి­ళలు, పిల్లల ఆరోగ్యం, రక్షణ, వారి సమగ్రాభివృద్ధికి సంబంధించి 2021–22 నుంచి ప్రభుత్వం ప్రత్యేకంగా జెండర్‌ – చైల్డ్‌ బేస్డ్‌ బడ్జెట్‌లను ప్రవేశపెడుతోంది. పేదరికాన్ని తొలగించాలనే లక్ష్యంతో జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి అందరికీ నాణ్యమైన విద్యను అందించాం. దీనిద్వారా 43.61 లక్షల మంది మహిళలకు రూ.26,067 కోట్లు ఇచ్చాం.

ఈ పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు 83 లక్షల మంది విద్యార్థులకు మేలు చేకూరింది. దీని ఫలితంగా ప్రాథమిక విద్యలో చేరే విద్యార్థుల నికర నమోదు నిష్పత్తి 2019లో 87.80 శాతం ఉండగా 2023 నాటికి 98.73 శాతానికి పెరిగింది. అలాగే ఉన్నత, మాధ్యమిక విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 2019లో 46.88 శాతం ఉండగా, 2023కి అది 79.69 శాతానికి చేరుకుంది. 

టీడీపీ ప్రభుత్వ వైఫల్యంతో అప్పుల ఊబిలోకి మహిళలు..
రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు మద్దతు ఇవ్వడంలో గత టీడీపీ ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందింది. దీంతో మహిళలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. మా ప్రభుత్వం మేనిఫెస్టోలోని హామీ మేరకు 2019 ఏప్రిల్‌ 11 నాటికి స్వయం సహాయక సంఘాలకు ఉన్న రుణ బకాయిలను తిరిగి చెల్లించడానికి వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని అమలు చేసింది. దీనికింద 2019 నుంచి రూ.25,571 కోట్లను తిరిగి చెల్లించింది. తద్వారా 7.98 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 78.94 లక్షల మందికి మేలు చేకూర్చింది.

సున్నావడ్డీతో క్రియాశీలకంగా సంఘాలు..
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో స్వయంసహాయక సంఘాలు మనుగడ కోల్పోయాయి. తిరిగి వీటిని క్రియాశీలకం చేయడానికి వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద మహిళలకు రూ.4,969 కోట్లను ప్రభుత్వం అందించింది. ఫలితంగా అప్పట్లో 18.63 శాతంగా ఉన్న మొండి బకాయిలు గణనీయంగా తగ్గిపోయాయి. దేశంలోనే అతి తక్కువ స్థాయి 0.17 శాతానికి చేరాయి. అలాగే వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా 26 లక్షల మంది మహిళలు ఆర్థిక కార్యకలాపాలు చేపట్టేందుకు, వారి జీవనోపాధికి శాశ్వత భద్రత కల్పించేందుకు రూ.14,129 కోట్లను అందించాం.

జగనన్న పాలవెల్లువ పథకం కింద 3.60 లక్షల మంది మహిళలు డెయిరీ ద్వారా అధిక ఆదాయాన్ని పొందేందుకు రూ.2,697 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. అదేవిధంగా మహిళలు, పిల్లలకు పటిష్ట భద్రతలో భాగంగా దిశ మొబైల్‌ యాప్, దిశ పెట్రోల్‌ వాహనాలు, 26 దిశ పోలీసుస్టేషన్లను ప్రారంభించాం. ఏకంగా కోటి మందికి పైగా మహిళలు దిశ మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 

సంక్షేమ వెలుగులు ధగధగ 

7062 crores for housing construction - Sakshi

సంక్షేమ ఆంధ్రను ఆవిష్కరించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. బుధవారం ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్ద పీట వేసింది. రాష్ట్రంలో అన్ని విధాలుగా అవసరమైన సంక్షేమానికి మొత్తం రూ.44,668 కోట్లు కేటాయించింది. ఇందులో బీసీ సంక్షేమానికి రూ.29,001.31 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ.9,291.55 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.4,133.73 కోట్లు, మైనారిటీల సంక్షేమానికి రూ.2,242.36 కోట్లు కేటాయించడం విశేషం. సంక్షేమంతోపాటు రాష్ట్రంలో గృహ నిర్మాణానికి రూ.7,062 కోట్లు కేటాయించింది.  

 పేదరికంపై యుద్ధం చేసి ప్రజలను గెలిపించేలా.. దృఢమైన సామాజిక భద్రతా వలయంగా సంక్షేమ అ్రస్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించింది. వివక్ష లేని సంక్షేమంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అర్హులందరికీ సంక్షేమాన్ని వారి గడప వద్దకే చేర్చింది. అట్టడుగు వర్గాలకు అందించిన సంక్షేమ ఫలాలతో వారికి ఎంతో మేలు చేసింది.

ఫలితంగా ప్రజల స్థితిగతులు మారడంతో సురక్షితమైన, గౌరవ ప్రదమైన జీవనం గడిపేలా చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దార్శనికత దేశానికే దిక్సూచిగా నిలిచింది. ఇంటి స్థలాల కేటాయింపు, ఇంటి నిర్మాణం, సంక్షేమ పింఛన్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్‌) ద్వారా ఇంటింటికి రేషన్‌ పంపిణీ తదితర పథకాలు, కార్యక్రమాల ద్వారా ఆర్థిక మద్దతు అందిస్తోంది. వైఎస్సార్‌సీపీ పాలనలో అందించిన సంక్షేమంతో సాధించిన అద్భుత ఫలితాలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ‘సంక్షేమ ఆంధ్ర’ థీమ్‌తో అసెంబ్లీలోవెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.  

పెద్ద మనస్సుతో పేదలకు భరోసా 
♦  వైఎస్సార్‌ బీమా కింద 49,000 కుటుంబాలకు రూ.650 కోట్లు  
♦  అగ్ర వర్ణాల కోసం ప్రత్యేక విభాగం (కాపు, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, ఆర్య వైశ్య, క్షత్రియ వర్గాల్లో కోటి 15 లక్షల మందికి రూ.36,321 కోట్లు 
♦  ఈబీసీ నేస్తం కింద 4.39 లక్షల మందికి రూ.1,257 కోట్లు, వైఎస్సార్‌ కాపు నేస్తం కింద 77 లక్షల మందికి రూ. 39,247 కోట్లు 
♦  వైఎస్సార్‌ నేతన్న నేస్తం కింద 81,783 మందికి రూ.983 కోట్లు 
​​​​​​​♦  జగనన్న తోడు కింద 16.73 లక్షల మందికి రూ.3,374 కోట్లు, జగనన్న చేదోడు కింద 3.40 లక్షల మందికి రూ.1,268 కోట్లు 
​​​​​​​♦  వైఎస్సార్‌ వాహన మిత్ర కింద 2.78 లక్షల మందికి రూ.1,305 కోట్లు  
​​​​​​​♦   వైఎస్సార్‌ లా నేస్తం కింద 6,069 మందికి నెలకు రూ.5 వేలు చొప్పున భృతి  
​​​​​​​♦  వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా కింద 46,329 మందికి రూ.350 కోట్లు 
​​​​​​​♦  ఉపాధి హామీ పథకం కింద 2,141 లక్షల పని దినాల ద్వారా 45 లక్షల కుటుంబాల్లోని 72 లక్షల మందికి చెల్లింపులు 
​​​​​​​♦  అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.883.5 కోట్లు సాయం  

2,19,763 ఎకరాలకు 1,29,842 మంది గిరిజనులకు వ్యక్తిగత పట్టాలు, 67,946 ఎకరాలకు గాను 526 కమ్యూనిటీ పట్టాలు పంపిణీ. 39,272 ఎకరాలకు 26,287 డీకేటీ పట్టాలు పంపిణీ. ఎస్టీల గృహాలకు ఉచిత విద్యుత్‌ నెలకు 100 యూనిట్ల నుంచి∙200 యూనిట్లకు పెంపు. కాఫీ తోటల పరిధి విస్తరణ. గిరిజన సహకార సంఘం ద్వారా మార్కెటింగ్‌ సహకారం. 

​​​​​​​♦  వెనుకబడిన కులాల(బీసీ)ల సంక్షేమం కోసం 56 కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు. కోటి 2 లక్షల మందికి రూ.71,740 కోట్ల లబ్ధి.  
​​​​​​​♦  2023–24లో దాదాపు 5 వేల మంది మైనారీ్టలకు ఉద్యోగావకాశాల కోసం శిక్షణ. ఇమామ్‌లకు అందించే సహాయం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు.. 4,983 మందికి ప్రయోజనం. మోజన్లకు రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంపు. 4,983 మందికి మేలు. 
​​​​​​​♦  2021–22 నుంచి 8,427 మంది పాస్టర్లకు రూ.5 వేలు చొప్పున ఆర్థిక సహాయం. 2023 నుండి విజయవాడలోని ఎంబార్కేషన్‌ పాయింట్‌ నుంచి హజ్‌ యాత్ర చేసే ప్రతి యాత్రికునికి రూ.80 వేలు చొప్పున 1,756 మందికి లబ్ధి. 2019 నుండి 1,178 మంది యాత్రికులు జెరూసలేం వెళ్లడానికి రూ.60 వేల చొప్పున ఆర్థిక సాయం.  

ఎస్సీ విద్యార్థులకు జేఈఈ, నీట్‌ 
వంటి పోటీ పరీక్షలకు శిక్షణ. తద్వారా 200 మంది విద్యార్థులు ఐఐటీ, ఎన్‌ఐటీ, ఇతర ప్రీమియర్‌ కళాశాలలలో ప్రవేశం. ‘కెన్నెడీ లుగర్‌–యూత్‌ ఎక్సే్ఛంజ్‌’ కార్యక్రమం, విదేశీ విద్యా అధ్యయన కార్యక్రమాలకు ఎనిమిది మంది విద్యార్థులకు అవకాశం. 2023 సెపె్టంబర్‌లో సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనపై న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశానికి ఈ వర్గానికి చెందిన ఒక విద్యార్థి ప్రాతినిధ్యం.   

ఇళ్ల స్థలాలు, ఇళ్లు.. నగదు బదిలీ 
​​​​​​​♦  రాష్ట్రంలో గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి 4,63,697 ఇళ్లు మాత్రమే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019 నుంచి ఇప్పటి వరకు రూ.1.53 లక్షల కోట్ల విలువైన 30,65,315 ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. ప్రతి లబ్ధిదారుని ఇంటి ఖర్చుకు రూ.లక్షా 80 వేలు మంజూరు చేసింది. మౌలిక సదుపాయాల కోసం ఒక్కో ఇంటికి రూ.6.90 లక్షల చొప్పున (మొత్తంగా రూ.22,909 కోట్లు) వెచ్చిస్తోంది. ఫలితంగా 22 లక్షల ఇళ్లలో దాదాపు 9 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్లు 2024 డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇప్పటి వరకు 1,62,538 మంది లబ్దిదారులు నివాసం ఉంటున్నారు. 
​​​​​​​
♦ అవినీతి, అవకతవకలకు అవకాశం లేకుండా అర్హతే ప్రాతిపదికగా గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తోంది. కోవిడ్‌ సమయంలో, ఇతరత్రా ప్రభుత్వ దార్శనికతను సాకారం చేసి దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు అవిశ్రాంతంగా పనిచేసిన సచివాలయాల సిబ్బంది, వలంటీర్లను ప్రభుత్వం అభినందించింది.    
​​​​​​​
♦ 2019లో స్థిర ధరల సూచి ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,031తో దేశంలో 18వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం అది రూ.2,19,518తో 9వ ర్యాంకుకు ఎగబాకింది.   
​​​​​​​
♦ వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పథకం లబ్దిదారుల అర్హత వయస్సును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించి సంతృప్త స్థాయిలో అమలు చేస్తోంది. 2019లో పింఛన్ల మొత్తం నెలకు రూ.1,385 కోట్లు ఉండగా, జనవరి నెల నాటికి అది రూ.1,968 కోట్లకు పెరిగింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలక్షల మందికి రూ.84,731 కోట్లు అందించింది.  
​​​​​​​
♦ ప్రజల ఇంటి ముంగిటికే సరుకులు సరఫరా చేయాలనే లక్ష్యంతో 9,260 సంచార వాహనాలను ప్రవేశపెట్టింది. తద్వారా వృద్ధులు, దివ్యాంగులు, వేతన కార్మికులకు ఎంతో ఊరట కలిగింది. ఈ వాహనాల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి ఉపాధి లభించింది. సబ్సిడీ బియ్యం కోసం గత ప్రభుత్వం రూ.14,256 కోట్లు, ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.29,628 కోట్లు ఖర్చు చేసింది. 

మౌలిక వసతులతో... రాష్ట్రం సుసంపన్నం  

43307 crores for creation of infrastructure - Sakshi

 రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ‘ఏపీ పారిశ్రామిక విధానం 2023–27’ ప్రభుత్వం తీసుకువచ్చింది. మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు 2024–25లో రూ.43 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించారు.   

   రూ.24 వేల కోట్లతో తీరప్రాంతాభివృద్ధి 
రాష్ట్రంలో రూ.24 వేల కోట్లతో ఓడరేవులు, ఫిషింగ్‌ హార్బర్లు, షిప్‌ ల్యాండ్‌ కేంద్రాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వేలో రూ.20 వేల కోట్లతో పర్యావరణహిత ఓడరేవులు నిర్మిస్తున్నారు. రూ.3800 కోట్లతో 10 ఫిషింగ్‌ హార్బర్లను జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బుడగట్లపాలెం, కొత్తపట్నం, ఓడరేవు, పూడిమడక, బియ్యపుతిప్ప, మంచినీళ్లపేట వద్ద ని ర్మిస్తున్నారు.

రూ.127 కోట్లతో చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట, దొండవాక, ఉప్పలంక, రాయదరువుల్లో ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాలను అభివృద్ధి చేశారు. అంతర్గత జల రవాణా అభివృద్ధికి ఏపీ ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీని 2023లో స్థాపించి, కృష్ణానదిపై ముక్త్యాల–­మద్దిపాడు మధ్య తొలి నదీ ప్రవాహ ప్రాజెక్టును రూపొందించారు. భోగాపురం విమానాశ్రయ అభివృద్ధి పనులు చేపట్టారు.
   
గ్రామాల అనుసంధానం 

భారత్‌ నెట్‌ రెండో దశ ప్రాజెక్ట్‌ అమలులో భాగంగా 613 మండలాల్లోని 11,254 గ్రామ పంచాయతీలను కలుపుతూ 55 వేల కి.మీ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేశారు.
 
వైద్య విద్య బలోపేతం 
♦ రాష్ట్రంలో రూ.8480కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు 
♦ ఉద్దానం ప్రాంత కిడ్నీ రోగులకోసం పలాసలో వైఎస్సార్‌ కిడ్నీ పరిశోధన కేంద్రం, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం. 

అత్యున్నత విద్యాలయాలు 
♦ కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్‌  కాలేజీ, సాలూరులో సెంట్రల్‌ గిరిజన వర్సిటీ, విజయనగరంలో గురజాడ జేఎన్‌టీయూ, ఒంగోలులో ఆంధ్రకేసరి వర్సిటీ, వైఎస్సార్‌ కడపలో వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ వర్సిటీ కర్నూలులో క్లస్టర్‌ వర్సిటీ, రెండో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం.
పోలవరం పురోగమనం 
♦  2019మే నాటికి 42 శాతం హెడ్‌ వర్క్‌లు 70 శాతానికి చేరిక 
♦ గోదావరి నదిలో తొలి సారిగా రేడియల్‌ గేట్ల ఏర్పాటు.  
♦ గతేడాది నవంబర్‌ 30వ తేదీన అవుకు రెండో టన్నెల్‌ ప్రారంభం.  
♦ అవుకు మొదటి, రెండో టన్నెళ్లు పూర్తి. మూడో టన్నెల్‌ త్వరలో పూర్తి. 
♦  గతేడాది సెపె్టంబర్‌ 19న 77 చెరువుల అనుసంధానం ప్రాజెక్ట్‌ ప్రారంభం. 
♦ 2022 సెపె్టంబర్‌ 6వ తేదీన గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీల ప్రారంభం.
♦  పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్‌ నిర్మాణం పురోగతి.  

పారిశ్రామిక పరుగులు 
♦  2019 నుంచి ఇప్పటి వరకు 311కుపైగా ఏర్పాటైన భారీ పరిశ్రమలు 
♦ రూ.5995 కోట్లతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు 
♦ రూ.19345 కోట్ల పెట్టుబడులతో 117 ఒప్పందాలు చేసుకున్న ఒబెరాయ్, నోవోటెల్, వంటి ప్రముఖ సంస్థలు. 

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు 
♦ పట్టణాభివృద్ధిలో భాగంగా 1426 ఎకరాల్లో జగనన్న స్మార్ట్‌ టౌన్‌íÙప్‌ల ఏర్పాటు 
♦ రూ.189 కోట్లతో 481 ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు 
♦ గ్రామీణ మౌలిక సదుపాయాల కింద 10,893 గ్రామ పంచాయతీ భవనాలు, 10216 వ్యవసాయ గోదాములు, 8299 భారత్‌ నిర్మాణ్‌ సేవా కేంద్రాలు, 3734 భారీ పాల శీతలీకరణ కేంద్రాల నిర్మాణం

భూ హక్కులకు భద్రత  

Drafting of Land Rights Act to provide security - Sakshi  

  భద్రమైన భూముల వ్యవస్థ, సమర్థమైన భూ పరిపాలన కోసం ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన సంస్కరణలు దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచాయి. భూముల సమస్యలను పరిష్కరించడంలో, భూ పరిపాలనలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. అనేక సంవత్సరాలుగా పేరుకుపోయిన భూ సమస్యలను పరిష్కరించడానికి ఈ ఐదేళ్లలో అనేక విప్లవాత్మకమైన చర్యలు చేపట్టింది. 

భూ రికార్డుల్లో అస్పష్టత, సర్వే రికార్డుల్లో సమస్యలు, వివాదాలు, వ్యాజ్యాలవల్ల స్తంభించిన భూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి గతంలో ఏ ప్రభుత్వం తీసుకోని చర్యలను ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌ సర్కారు సాహసోపేతంగా తీసుకుంది. భూములతో ముడిపడి ఉన్న చిక్కుముడుల్ని విప్పడంతో భూ యాజమాన్యం ఇప్పుడు సమర్థవంతంగా మారింది. భూ సమస్యలతో దశాబ్దాలుగా చితికిపోయిన వారు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. 

♦ నూతన పింఛను పథకం కింద ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడానికి జీపీఎస్‌ (ఏపీ హామీ పింఛను పథకం) అమలుచేయడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఉద్యోగులకు లాభదాయకమైన, స్థిరమైన, ప్రత్యామ్నాయ పింఛను పథకంగా ఇది ఉంది. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వానికి, ఇతర రాష్ట్రాలకు మా ప్రభుత్వం ప్రత్యా­మ్నాయ పరిష్కారాన్ని అందించింది.

♦ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రసంగిస్తూ ఏమన్నారంటే.. వందేళ్ల తర్వాత రాష్ట్రంలో ఉన్న భూములను పునఃపరిశీలన (రీసర్వే) చేయడం కోసం వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాన్ని 2020, డిసెంబర్‌ 21న ప్రభుత్వం ప్రారంభించింది. కొత్తగా 11,118 గ్రామ సర్వేయర్లను నియమించడం, నిరంతరాయంగా పనిచేసే సరికొత్త జియో రిఫరెన్స్‌ స్టేషన్‌ల (సీఓఆర్‌ఎస్‌) టెక్నాలజీని ప్రవేశపెట్టడం ద్వారా రీ సర్వే అత్యంత శాస్త్రీయంగా జరుగుతోంది.

♦ ఇప్పటివరకు 17.53 లక్షల మంది రైతులకు శాశ్వత భూహక్కు పత్రాలు ఇచ్చాం. 4.80 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. రీ సర్వేలో 45వేల భూ సరిహద్దు వివాదాలు పరిష్కారమయ్యాయి. 

♦ 1.37 లక్షల ఎకరాల గ్రామ సర్వీస్‌ ఈనాం భూములను నిషేధిత జాబితా 22(ఎ) నుంచి తొలగించడం ద్వారా 1.13 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. 33,428.64 ఎకరాల షరతులు గల పట్టా భూములు, 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడం ద్వారా 1.07 లక్షల మంది రైతులకు ఆ భూములపై సర్వహక్కులు ఏర్ప­డ్డాయి.

1982 నుంచి 2014 వరకు భూమి కొనుగోలు పథకం కింద భూములు పొందిన 22,837 ఎకరాలకు చెందిన 22,346 మంది భూమిలేని దళితుల భూములను 22 (ఎ) జాబితా నుంచి తొలగించడం ద్వారా లబ్ధిపొందారు. భూమిలేని నిరుపేదలకు 46,463 ఎకరాల డీకేటీ పట్టాలను పంపిణీ చేశాం. 

ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట..
♦మా ప్రభుత్వం ఐదేళ్లలో 4.93 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించింది. వీటిలో 2,13,662 ఉద్యోగాలు శాశ్వత నియామకాలు. 2014–19 మధ్యకాలంలో ఇచ్చిన 34,108 ఉద్యోగాల కంటే ఇవి ఎన్నో రెట్లు ఎక్కువ. సుమారు 10 వేల మంది ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నాం. 51,387 మంది ఆర్డీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కోసం ఆప్కాస్‌ సంస్థను ఏర్పాటుచేశాం. 

♦ 27 శాతం మధ్యంతర భృతిని ఉద్యోగుల సంక్షేమానికి మంజూరు చేశాం. 11వ వేతన సవరణ సంఘం సిఫారసులను అమలుచేశాం. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాం. 

♦ ఆశ్కా వర్కర్లు, గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు, మున్సిపాల్టీల్లో పనిచేసే ఔట్‌సోర్సింగ్, ప్రజారోగ్య కార్మికులకు, సెర్ప్‌కి చెందిన విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌లు, మెప్మాకు చెందిన రీసోర్స్‌ పర్సన్‌లు, హోమ్‌గార్డులు, మధ్యాహ్న భోజన పథకం కింద పనిచేస్తున్న సహాయకులు, అంగన్‌వాడీ వర్కర్లు, సహాయకులకు ప్రభుత్వం వేతనం పెంచింది. 

Back to Top