‘ఒక రాజ‌ధాని వ‌ద్దు...మూడు రాజ‌ధానులే ముద్దు’

రాష్ట్రవ్యాప్తంగా భారీ ప్రదర్శనలు
 

విజయవాడ: ఒక రాజధాని వద్దు..మూడు రాజధానులే ముద్దు అంటూ రాష్ట్రవ్యాప్తంగా భారీ ప్రదర్శనలు చేపట్టారు. ఊరూరా ప్రజలు బయటకు వచ్చి నినదిస్తూ..సీఎం వైయస్‌ జగన్‌ అధికార వికేంద్రీకరణ నిర్ణయాన్ని అభినందించారు. విజయవాడ, తిరుపతి, విజయనగరం, విశాఖ, కర్నూలు, అనంతపురం తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలు చేపట్టారు.    ఈ సందర్భంగా మంత్రులు పేర్నినాని, కొడాలి నాని, అవంతి శ్రీనివాస్‌, భూమన కరుణాకర్‌రెడ్డిలు మాట్లాడారు. 8 నెలల పరిపాలన కాలంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. అభివృద్ధిలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే సీఎం జగన్‌ ఆలోచన అని చెప్పారు. రాజకీయ లబ్ధికోసం రాజధాని ప్రజలను ప్రతిపక్ష నేత చంద్రబాబు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు ఉదయం లేచిందే మొదలు రాజకీయం కావాలని.. అదే బాటలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కూడా నడుస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబును నమ్మొద్దని..ఆయనది వాడుకుని వదిలేసే నైజం అని..పవన్‌ను కూడా అలాగే చేస్తారని తెలిపారు. అమరావతి రైతులకు సీఎం వైయస్‌ జగన్‌ న్యాయం చేస్తారని వెల్లడించారు.   

Back to Top