హైదరాబాద్: ప్రతిపక్ష నాయకుడు గా వైఎస్ జగన్ తన విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న తప్పిదాల్ని స్పష్టంగా బయట పెడుతున్నారు. రాజధాని పేరుతో ఆయన చేస్తున్న రాజకీయాల్ని బయట పెట్టారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని సూటి ప్రశ్నలు గుప్పించారు.<br/>1. రైతుల మెడ మీద కత్తి పెట్టి లాక్కొంటున్న భూముల్ని ప్రైవేటు సంస్థలకు అందునా సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టటం న్యాయమా2. రాజదాని లో సెక్షన్ 30, 144లు ఎందుకు అమలు చేస్తున్నారు.3. గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పును ఎందుకు అమలు చేయటం లేదు4. అసైన్డ్ భూముల్ని మీ అత్తగారి సొమ్ములు అనుకొంటున్నారా5. మీ కమీషన్ల కోసం లంచాల కోసం ప్రజల కడుపు కొడతారా6. కేంద్రం ఇచ్చిన రూ. 1,850 కోట్లను ఏ చేసినట్లు7. కేంద్రం కట్టిస్తామన్నా వినకుండా సింగపూర్ కంపెనీలకు ఎందుకు కట్టబెడుతున్నట్లు8. మీ బినామీలతో రాజధాని చుట్టూ వందల ఎకరాలు కొనుక్కోలేదా9. ప్రజల సొమ్ము ఒక్క రోజు కోసం రూ. 400 కోట్లు బూడిద పాలు చేస్తారా10. విదేశీ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయిలు దోచిపెట్టడం కాదా ఈ ప్రశ్నలకు చంద్రబాబు దగ్గర జవాబు లేదు. అందుకే రాజధాని శంకుస్థాపనకు రాదలచుకోలేదని సూటిగా చెప్పారు. కానీ, రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు.