వరద ప్రాంతాల్లో వైఎస్ జగన్ విస్తారంగా పర్యటన

వరద ప్రాంతాల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
విస్తారంగా పర్యటిస్తున్నారు. పీడిత ప్రాంతాల్ని ఎక్కడికక్కడ పలకరిస్తూ జనం
అవసరాలు, ఆవేదనలు తెలుసుకొంటూ పర్యటన సాగిస్తున్నారు.


వరదల్ని పెద్దగా పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదట్లో ఏరియల్ సర్వే
తో సరిపెట్టారు. కానీ, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పర్యటిస్తున్నారని తెలియటంతో
కంగారు పడ్డారు. దీంతో మిగిలిన కార్యక్రమాల్ని పక్కన పెట్టి వరద ప్రాంతాల పర్యటనకు
పూనుకొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నారు కాబట్టి జిల్లా యంత్రాంగం అంతా
ఆయన వెంట ఉండాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశాలు ఇచ్చారు. వరదల సమయంలో జిల్లా
యంత్రాంగం, రెవిన్యూ డివిజనల్ స్థాయి యంత్రాంగం ఎక్కడికక్కడ సహాయ చర్యల్ని
ముమ్మరంగా చేపట్టాల్సి ఉంటుంది. కనీసం ఆయా ప్రాంతాల అధికారుల్ని, ప్రజా
ప్రతినిధుల్ని బ్రందాలుగా చేసి క్షేత్ర స్థాయిలో పనులు చేపట్టేలా చొరవ చూపాల్సి
ఉంది. దీనికి భిన్నంగా ప్రచారం కోసం పాకులాడుతూ చంద్రబాబు మొత్తం జిల్లా
యంత్రాంగాన్ని తన వెంట తిప్పుకొన్నారు. పచ్చ మీడియాలో కథనాల కోసం రెండు, మూడు రోజులపాటు
అక్కడే మకాం వేసి అధికారులు, సిబ్బందిని తన దగ్గర ఉంచుకొన్నారు.

ప్రజల అవసరాల్ని కనిపెట్టి
తదనుగుణంగా పర్యటనలు చేసే అలవాటున్న జన నేత జగన్ మాత్రం సరైన సమయంలో పర్యటనకు
వెళ్లారు. వరద సహాయ చర్యలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేట్లుగా పర్యటన షెడ్యూల్
రూపొందించుకొన్నారు. ప్రజల్ని ఎక్కడికక్కడ నేరుగా కలుసుకొంటూ వారి ఆవేదనను
తెలుసుకొనే ప్రయత్నం చేశారు. వరద సహాయ చర్యల్లో కూడా పక్షపాతం చూపిస్తున్న పచ్చ
పార్టీ ఆగడాలు తెలుసుకొన్నారు. ఇటువంటి ఆగడాల్ని ఖండిస్తూ, ప్రజలకు ధైర్యాన్ని
నూరిపోసే ప్రయత్నంచేశారు. పంట పొలాలు, అరటి తోటల దగ్గరకు వెళ్లి పంట నష్టం ఏ మేరకు
జరిగి ఉంటుందనే దాని మీద అంచనా వేసుకొన్నారు. వరద తాకిడితో  అల్లాడిపోతున్న ప్రజానీకం ఆవేదన ను అడిగి
తెలుసుకొన్నారు. చాలా చోట్ల నీటి పారుదల పనుల్ని పట్టించుకోకపోవటంతోనే సమస్య
తీవ్రం అయినట్లు స్థానికులు చెప్పారు. సహాయ సామగ్రి సక్రమంగా అందించటం లేదని
ఫిర్యాదు చేశారు. దీని మీద ప్రజలకు స్థైర్యాన్ని నూరిపోసే కార్యక్రమం చేపట్టారు. 

Back to Top