అన్నొస్తాడ‌ని చెప్పండి

కడప సమర శంఖారావం సభలో వైయస్‌ జగన్‌ హామీ

గత పదేళ్లుగా మీరెలా ఉన్నారో నాకు తెలుసు

నా కోసం మీరందరూ అవమానాలు, అక్రమ కేసులు భరించారు

మీ అందర్నీ అన్ని రకాలుగా ఆదుకుంటాను

మీ బాగోగులు నేను చూసుకుంటాను

పిల్లలను బడికి పంపిస్తే ఏడాదికి రూ.15 వేలు  ఇస్తాడని చెప్పండి

రైతులకు ప్రతి మే నెలలో రూ.12,500 ఇస్తామని చెప్పండి

45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.75 వేలు ఇస్తాం

పొదుపు సంఘాల రుణాలు మొత్తం నాలుగు దఫాల్లో నేరుగా మీకే ఇస్తామని చెప్పండి

వైయస్‌ఆర్‌ జిల్లా:  నాకోసం ఎన్నో క‌ష్టాలు ఎదుర్కొన్నారు..మీ అంద‌రి బాగోగులు నేను చూసుకుంటాన‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బూత్ క‌మిటీ స‌భ్యుల‌కు, పార్టీ శ్రేణుల‌కు హామీ ఇచ్చారు. అన్నా..ముఖ్య‌మంత్రి అవుతాడు..మ‌న‌కు అండ‌గా ఉంటాడ‌ని గ్రామాల్లో చెప్పాల‌ని పార్టీ శ్రేణుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ సూచించారు. గురువారం క‌డ‌ప న‌గ‌రంలోని మున్సిప‌ల్ స్టేడియంలో నిర్వ‌హించిన స‌మ‌ర శంఖారావం స‌భ‌లో బూత్ క‌మిటీ స‌భ్యుల‌ను ఉద్దేశించి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించారు. ఆయ‌న మాట్లాడుతూ..మూడు దశాబ్దాలు నాన్నగారు 1978లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. నాన్నగారు 2009లో చనిపోవడం జరిగింది. 31 సంవత్సరాలు నాన్నగారిని గుండెల్లో పెట్టుకొని చూసింది ఈ జిల్లా. 31వ సంవత్సరాల నాన్నగారి రాజకీయ జీవితంలో కేవలం 5 సంవత్సరాల మూడు నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా పాలన చేశారు. అయినా నాన్నగారిని గుండెల్లో పెట్టుకొని ఆధరించింది ఈ జిల్లా. 2009లో చనిపోయినప్పుడు చాలా బాధ అనిపించింది. ఆ బాధలోంచి ధైర్యం గుండె చప్పుడు నుంచి వచ్చింది. నాన్నగారు ఎక్కడికి పోలేదని, తాను చనిపోతూ ఇంతపెద్ద కుటుంబాన్ని ఇచ్చాడనే ధైర్యం వచ్చింది. 2009లో నాన్నగారి మరణం తరువాత దాదాపు ఇవాల్టికి 10 సంవత్సరాలు ఈ పదేళ్లు నాన్నగారు పోయిన తరువాత జగన్‌ అనే నన్ను ఒక కొడుకుగా ఆదరించింది ఈ జిల్లా. మీరు ఆదరించారు కాబట్టే రాష్ట్రం వైపు కన్నెత్తి చూడగలుగుతున్నాను. ఈ జిల్లా ప్రజలను, మరీ ముఖ్యంగా గ్రామ గ్రామంలోను తోడుగా మీమంతా ఉన్నామన్నా అంటూ ఎన్నికల వేళ పూర్తిగా బాధ్యతలు మోయడానికి ముందుకు వచ్చిన ప్రతి బూత్‌ కమిటీ సభ్యుడికి, ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి, చేతులు జోడించి, శిరస్సు వంచి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 

గత పదేళ్లుగా నేను గమనిస్తూనే ఉన్నా.. మీరు ఎలా ఉన్నారనే సంగతి నాకు తెలుసు. ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు. కొందరు అవమానాలు సహించారు. కొందరు కేసులను భరించారు. కొందరు లాఠీదెబ్బలు తిన్నారు. కొందరు ఆస్తులు పోగొట్టుకున్నారు. మరికొంత మంది కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నారు. మీ అందరికీ ఒక మాట చెబుతున్నా. మీ బాగోగులు చూసుకునే కార్యక్రమం నేను తీసుకుంటా. అన్ని రకాలుగా ఆదుకుంటాను. 

ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి కార్యక్రమంలో మీ అందరి పాత్ర క్రీయాశీలకంగా ఉంటుంది. ఈ ఫిబ్రవరి నెలాఖరులో షెడ్యుల్‌ వస్తుందంటున్నారు. మరో నెలలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు దగ్గరపడిన నేపథ్యంలో మీ అందరి భుజస్కందాల మీద వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించే బాధ్యత ఉంది. చంద్రబాబు నాయుడి అన్యాయమైన రణనీతిని, దిగజారుడు రాజకీయాలు నడపడం చూస్తున్నాం. దిగజారుడు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు హయాంలో ఎన్నికలు దగ్గరపడే సరికి ఏమేం చేయబోతున్నాడో మన కళ్లకు కనిపిస్తుంది. గ్రామాల్లో ఓటర్‌ లిస్టులో పేర్లు తొలగిస్తున్నారు. దొంగ సర్వేల పేరుతో వైయస్‌ఆర్‌ సీపీ సానుభూతి పరుల ఓట్లు గుర్తించి వాటిని తొలగించే ఆరాటం కనిపిస్తుంది. మీరంతా అప్రమత్తంగా ఉండాలి. గ్రామాల్లో ఓటర్‌ లిస్టు చూడండి, ఎవరి పేరును తొలగించారో.. వారి పేర్లు మళ్లీ నమోదు అయ్యేలా ఫాం–6 వెంటనే నింపి ముందుండి ఈ కార్యక్రమం నడిపించాలి. ఓటర్‌ లిస్టులు గమనించండి. మన ఓటు కనిపించకపోతే ఆ ఓటు కచ్చితంగా మళ్లీ నమోదు అయ్యేలా చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలి. 

ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు నాయుడు డబ్బుల పంపకాలు, మూటల మూటల డబ్బులు గ్రామాల్లోకి పంపే కార్యక్రమం చేస్తాడు. మనకు సంబంధించిన వారి ఓట్లు ఉన్నాయో లేదో చూసుకోవడం ఒక పని, రెండో పని చంద్రబాబు రెండు రెండు ఓట్లు ఎక్కిస్తున్నాడు. మెన్ననే ఎలక్షన్‌ కమిషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాం. అక్షరాల రాష్ట్రంలో 59 లక్షల 18 వేల దొంగ ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు చేశాం. 59 లక్షల్లో 20 లక్షల ఓట్లు తెలంగాణ ఉంటే మరో 39 ఓట్లు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇలాంటి దొంగ ఓట్లను తొలగించే పనిచేయాలి. 

ఎన్నికలకు ఆరు నెలల ముందు..మూడు నెలల కోసం చంద్రబాబుకు పింఛన్లు పెంచాలని ఆలోచన రాదు. మనం పింఛన్లు రూ.2 వేలు పెంచుతామని అన్నాం. వెంటనే చంద్రబాబుకు భయం పట్టుకుంది. వెంటనే పింఛన్లు రూ.2 వేలు ఇస్తానని మొదలుపెట్టారు. అంతటితో ఆగలేదు. వైయస్‌ జగన్‌ వ్యవసాయ ట్రాక్టర్లు ,ఆటోలకు ట్యాక్సీలు రద్దు చేస్తానన్నారు. రూ.10 వేలు ఏడాదికి ఇస్తామన్నారని తెలుసుకొని..చంద్రబాబు ఏం చేసారో తెలుసా..ఆటోడ్రైవర్ల వద్దకు వెళ్లి ఖాకీ చొక్కా వేసుకున్నారు. ఆటోలకు రోడ్డు ట్యాక్సీలు రద్దు, వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్సీలు రద్దు అంటారు. జగన్‌ ప్రతి కులానికి కార్పొరేషన్‌ అన్నారు. ప్రతి పేదవాడికి మంచి చేస్తా అన్నారు. చంద్రబాబు వెంటనే ప్రతి కులానికి కార్పొరేషన్‌ అంటారు. చివరకు పదో తరగతి చదువుతున్న పిల్లలను సైతం వదల్లేదు. పిల్లల మెస్‌ చార్జీలు పెంచాలన్న జ్ఞానం రాదు. జగన్‌ మంచి చేస్తా అంటే చాలు..ఈ పెద్ద మనిషి మేల్కొని హాస్టల్‌ విద్యార్థులకు కోడి కూర పెడతా అంటారు. 2013లో చంద్రబాబు బీసీ డిక్లరేషన్‌ చేశారు. ఆయన ఇచ్చిన 119 హామీలకు దిక్కు లేదు. నిన్ననే ఆయన రాజమండ్రికి వెళ్లి బీసీ డిక్లరేషన్‌పై మాట్లాడలేదు. మూడు నెలల ముందు అంగన్వాడీలు, ఆశావర్కర్లు గుర్తుకు వస్తారు. ఈ రెండో సినిమా డైలాగులు వింటుంటే మీకేమనిపిస్తుంది. 57 నెలలు మన కడుపు మాడ్చి..చివరి మూడు నెలల్లో అన్నం పెడతా అనే  వాడిని ఏమనాలి..?అన్నా అనాలా? లేక దున్నా అనాలా? 
ప్రతి  ఒక్కరికి చెప్పండి..1983వ సంవత్సరంలో ఎన్టీ రామారావు తొలిసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఎన్‌టీ రామారావు ప్రజల్లోకి వచ్చి రూ.2 కిలో బియ్యం అన్నారు. ప్రజలు ఎన్‌టీ రామారావును అభిమానించారు. అప్పట్లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఏం చేశారో తెలుసా..ఎన్టీఆర్‌ రూ.2 కిలోబియ్యం అన్నారు..ఆరు నెలల ముందు రూ.1.90లకే కిలో బియ్యం ఇచ్చారు. అయినా ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేయలేదు. ఎన్‌టీఆర్‌కే ఓట్లు వేశారు. ఆయన చెప్పారు కాబట్టి..నీవు చేశావని అప్పటి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పారు. చంద్రబాబుకు కూడా ఇదే జరుగుతుంది.
ఎవరైనా ఓ రాక్షసుడు పంచభక్ష పరమాణాలతో భోజనం పెడతానని పిలిస్తే..ఎవరైనా నమ్ముతారా? మనల్ని తినడానికే ఈ భోజనానికి పిలిచారని భావిస్తారు.

ఐదేళ్లలో మనం చూశాం. ఇచ్చిన మాట ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. ప్రజలకు చెప్పినది ఏ ఒక్కటి చంద్రబాబు చేయలేదు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకోవడంలో బాగా పనిచేశాడు. దోచిన సొమ్ములో నుంచి బిస్కెట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాడు. ఓటుకు రూ. 2, 3 వేలు ఇస్తాడు. మీరంతా అప్రమత్తంగా ఉండండి. ఓటుకు డబ్బులు ఇస్తే చంద్రబాబు ప్రలోభాలు పెడుతూ మాట్లాడినప్పుడు మీరంతా అప్రమత్తంగా ఉండండి. ఎన్నికలు రెండు నెలల్లో ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు రోజుకో స్కీమ్‌ ప్రకటిస్తాడు. చంద్రబాబు నైజం మీకంతా తెలుసు. అబద్ధాలు చెప్పడంలో ఆయన్ను మించినవాడు ఎవరూ లేరు. అబద్ధాలే కదా.. పోయేది ఏముంది ప్రజలే కదా నష్టపోయేది నేను కాదుకదా అని సులభంగా అబద్ధాలు వస్తాయి. మీరంతా అప్రమత్తంగా ఉండండి. చంద్రబాబు చెప్పే మోసాలు, అబద్ధాలు, ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియా ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఏబీఎన్, టీవీ–5 ఉంది. ఇంకా ఏమేమి ఉన్నాయో మీ అందరికీ తెలుసు. 

మనం యుద్ధం చేసేది చంద్రబాబు ఒక్కరితోనే కాదు. ఆయన్ను మోస్తున్న ఎల్లోమీడియాతో కూడా యుద్ధం చేయబోతున్నాం. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. చంద్రబాబు చెప్పే అబద్ధాలు, మోసాలు ప్రజల దగ్గరకు తీసుకెళ్లాలి. ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పాలి. అమ్మా చంద్రబాబు మాటలు నమొద్దు. ఐదేళ్ల క్రితం ఓట్లేసి అధికారంలోకి తీసుకొస్తే ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని ఘరానా మోసం చేసేందుకు సినిమా చూపిస్తున్నాడని ప్రతి అక్కకు, చెల్లికి, సోదరుడికి, స్నేహితుడికి, అవ్వకు, తాతకు చెప్పండి. 

అన్నా ఎవరూ చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేల డబ్బుకు ఏ ఒక్కరూ మోసపోవద్దని గట్టిగా పిలుపునివ్వండి. అమ్మా, అన్న వస్తాడు. అక్కా.. అన్న వస్తాడు.. చెల్లి అన్న వస్తాడు. అన్న వస్తాడు వెంటనే మన పిల్లలను బడికి పంపిస్తే చాలు సంవత్సరానికి రూ. 15 వేలు ఇస్తాడని ప్రతి అమ్మకు, అక్కకు, చెల్లికి చెప్పండి. 

ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు చెప్పండి చంద్రబాబు ఇచ్చే డబ్బు తీసుకొని మోసపోవద్దని చెప్పండి. అన్న మనకు వ్యవసాయ భూమి ఉంది. అన్న వస్తున్నాడు. అన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే మే మాసం వచ్చే సరికే ప్రతి రైతన్న చేతుల్లో రూ. 12,500లు పెట్టబోతున్నాడని చెప్పండి. చంద్రబాబు ఇచ్చే డబ్బుతో మోసపోవద్దని గట్టిగా చెప్పండి. అక్కా చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయితాడు. వెంటనే రూ. 45 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకు ఇంటికి వచ్చి నాలుగు సంవత్సరాల్లో రూ. 75 వేలు ఇస్తాడని చెప్పండి. 

అన్న వచ్చిన వెంటనే పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు మొత్తం నేరుగా నాలుగు దఫాలుగా మీ చేతులకే ఇస్తాడని చెప్పండి. రుణాలు ఇవ్వడమే కాదు. అన్న వడ్డీలేని రుణాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాడని చెప్పండి. చంద్రబాబు నాయుడు ఇవాళ ఇస్తున్న రూ. 2 వేలు చూసి మోసపోవద్దని ప్రతి అవ్వా, తాతకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అన్న రూ. 2 వేలు ఇస్తానని చెప్పాడు కాబట్టే చంద్రబాబు ఎన్నికల ముందు రూ. 2 వేలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాడని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అవుతాడు వెంటనే పెన్షన్‌ రూ. 2 వేల నుంచి పెంచుకుంటూ రూ. 3వేలకు తీసుకెళ్తాడని చెప్పండి. ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి చెప్పండి అన్న ముఖ్యమంత్రి అయితాడు. మన పిల్లలు అందరూ చదువుకోవడానికి అప్పులపాలు అయ్యే పరిస్థితి లేకుండా దగ్గరుండి చదివిస్తాడు. ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్‌ వంటి పెద్ద పెద్ద చదువులు చదివిస్తాడని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతి నిరుపేదకు దగ్గరుండి ఇల్లు కట్టిస్తాడని చెప్పండి. వైద్యం అందక అప్పుల పాలయ్యే పరిస్థితిని మార్చేస్తాడు. అన్న ముఖ్యమంత్రి అయితే వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే చాలు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా దగ్గరుండి అన్న ఆపరేషన్‌ చేయిస్తాడని చెప్పండి. ప్రతి అమ్మ, అక్క, చెల్లి, అవ్వా, తాతలకు నవరత్నాల గురించి చెప్పండి. 

ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. ఎల్లో మీడియాను వాడుకుంటాడు. ఎల్లో మీడియాలో లగడపాటి దొంగ సర్వేలు కూడా వేయిస్తాడని గుర్తు పెట్టుకోవాలి. ఎన్నికలు దగ్గరపడే కొద్ది విచ్చలవిడిగా పోలీసులను వాడుకునే కార్యక్రమం చేస్తాడు. వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు బనాయిస్తారు. ఇవన్నీ మనసులో పెట్టుకొని అన్నింటికీ అప్రమత్తంగా ఉండాలి. ఇవన్నీ జరుగుతాయి. ఎన్నికలు నాలుగు రోజులు ఉన్నాయనగా గంటకో డ్రామా ఆడుతాడు. వారికి సంబంధించిన ఎల్లో మీడియాలో గంటకో డ్రామా కనిపిస్తుంది. ఇవన్నీ మనసులో పెట్టుకొని చంద్రబాబు ఏం చేయబోతున్నాడో మనసెరిగి అప్రమత్తమై ప్రతి ఓటర్‌ను చైతన్యం చేయాలి.  

ప్రజలకు అది చేస్తా..ఇది చేస్తానని సినిమా చూపించారు
2014లో చంద్రబాబు సినిమా తీసినప్పుడు వ్యవసాయ రుణాలు మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. రైతులకు రూ.5 వేల కోట్లతో ధరల స్థీరికరణనిధి తెస్తామన్నారు. రైతుల ఖర్చుల మీదా 50 శాతం లాభంతో ఇస్తామన్నారు. ఆ తరువాత అక్క చెల్లెమ్మల రుణాలన్నీ మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. చిన్న పిల్లలను కూడా వదల్లేదు. చదువుకుంటున్న పిల్లలపై కన్నుపడింది. జాబు రావాలంటే బాబు రావాలని డైలాగ్‌ కొట్టారు. జాబు ఇవ్వకపోతే ఇంటింటికి రూ.2 వేలు ఇస్తానని మాట ఇచ్చారు. అంతటితో ఆగకుండా అధికారంలోకి రాగానే మొదటి సంతకం పెడతానని, బెల్టుషాపులు రద్దు చేస్తానని, కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఏపీఎస్‌ఎస్‌సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.

మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టు కట్టి చూపిస్తా అన్నారు. ఆపదలో ఉన్న మహిళ ఫోన్‌ కొడితే ఐదు నిమిషాల్లో ఆదుకుంటానన్నారు. ఏపీకి బుల్లెట్‌ ట్రైన్‌ తెస్తాన్నారు. రింగ్‌ రోడ్డు ఏర్పాటు చేస్తానన్నారు. ఆ తరువాత ఎన్నికల ప్రణాళికలో ఒక్కో కులానికి ఒక్కో పేజీ కేటాయించారు. ప్రతి కులాన్ని మోసం చేస్తూ మాటలు రాశారు. బోయలు, కురువలు, మత్స్యకారులు, గాండ్లను, రజకులను, ఇలా ప్రతి కులానికి ఒక్కో పేజీ పెట్టి మోసం చేశారు. కాపులను బీసీలుగా చేస్తానని మాట ఇచ్చారు. ఇది 2014లో చంద్రబాబు తీసిన మొదటి సినిమా. ఆయన చెప్పిన మాటల్లో కనీసం ఏ ఒక్కటైనా చంద్రబాబు చేశారా?. 

రెండో సినిమా బాగా ఫ్రెష్‌గా ఉంది
ఎన్నికలకు ఆరు నెలల ముందు..మూడు నెలల కోసం అని కొత్త సినిమా తీశారు. ఇది బాగా ఫ్రెష్‌గా ఉంది. నాలుగేళ్లు బీజేపీ, పవన్‌తో కలిసి ఏపీని దోచేశారు. ఇప్పుడు వారితో పోరాటం చేస్తున్నట్లు కలరింగ్‌ ఇస్తున్నారు. పోలవరం కట్టకుండానే జాతికి అంకితం చేస్తున్నారు. నాలుగున్నరేళ్లుగా ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. తానే ధర్మ పోరాటం దీక్షలు చేస్తున్నట్లు డ్రామాలాడుతారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తానంటారు. వాటి ఊసే ఎత్తరు. ఆ రుణాలు తడిసి మోపెడయ్యాయి. ఈ రుణాల గురించి ఆలోచించరు. తాజాగా పసుపు–కుంకుమ డ్రామా ఆడుతున్నారు. రైతులందరికీ మనం రూ.50 వేలు ఉచితంగా ఇస్తామని చెబితే..ఈ పెద్ద మనిషి ఆరో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. తన హయాంలో రాని బడ్జెట్‌ను చంద్రబాబు ప్రవేశపెట్టారు. రూ.5 వేల కోట్లు రైతులకు కేటాయిస్తున్నట్లు బడ్జెట్‌లో చెప్పారు.

రైతుల రుణమాఫీ పథకంలో ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ అవుతాయి. దాని గురించి ఈ పెద్ద మనిషి పట్టించుకోడు. తనది కాని బడ్జెట్‌లో మాత్రం రైతులకు రూ.5 వేలు కేటాయిస్తున్నట్లు చెవ్వుల్లో పూలు పెడుతున్నారు. రాజధాని నగరం అంటున్నారు. వేల ఎకరాల భూములు తనకు నచ్చిన వారికి , బినామీలకు ఇష్టం వచ్చిన  రేట్లకు అమ్ముకుంటారు. రాజధాని ఎక్కడుందని అడిగితే బాహుబలి సినిమా గ్రాఫిక్స్‌ చూపిస్తున్నారు. నాలున్నరేళ్లు పిల్లలకు జాబులు లేవు, ఏపీపీఎస్సీ నియామకాలు లేవు. నిరుద్యోగభృతి లేదు. కేవలం 3 లక్షల కుటుంబాలకు రూ.1000 చొప్పున నిరుద్యోగ భృతి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. 
ఎన్నికలకు ఆరు నెలల ముందు..మూడు నెలల కోసం చంద్రబాబుకు పింఛన్లు పెంచాలని ఆలోచన రాదు. మనం పింఛన్లు రూ.2 వేలు పెంచుతామని అన్నాం. వెంటనే చంద్రబాబుకు భయం పట్టుకుంది. వెంటనే పింఛన్లు రూ.2 వేలు ఇస్తానని మొదలుపెట్టారు. అంతటితో ఆగలేదు. వైయస్‌ జగన్‌ వ్యవసాయ ట్రాక్టర్లు ,ఆటోలకు ట్యాక్సీలు రద్దు చేస్తానన్నారు. రూ.10 వేలు ఏడాదికి ఇస్తామన్నారని తెలుసుకొని..చంద్రబాబు ఏం చేసారో తెలుసా..ఆటోడ్రైవర్ల వద్దకు వెళ్లి ఖాకీ చొక్కా వేసుకున్నారు. ఆటోలకు రోడ్డు ట్యాక్సీలు రద్దు, వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్సీలు రద్దు అంటారు. జగన్‌ ప్రతి కులానికి కార్పొరేషన్‌ అన్నారు. ప్రతి పేదవాడికి మంచి చేస్తా అన్నారు. చంద్రబాబు వెంటనే ప్రతి కులానికి కార్పొరేషన్‌ అంటారు. చివరకు పదో తరగతి చదువుతున్న పిల్లలను సైతం వదల్లేదు. పిల్లల మెస్‌ చార్జీలు పెంచాలన్న జ్ఞానం రాదు. జగన్‌ మంచి చేస్తా అంటే చాలు..ఈ పెద్ద మనిషి మేల్కొని హాస్టల్‌ విద్యార్థులకు కోడి కూర పెడతా అంటారు. 2013లో చంద్రబాబు బీసీ డిక్లరేషన్‌ చేశారు. ఆయన ఇచ్చిన 119 హామీలకు దిక్కు లేదు. నిన్ననే ఆయన రాజమండ్రికి వెళ్లి బీసీ డిక్లరేషన్‌పై మాట్లాడలేదు. మూడు నెలల ముందు అంగన్వాడీలు, ఆశావర్కర్లు గుర్తుకు వస్తారు. ఈ రెండో సినిమా డైలాగులు వింటుంటే మీకేమనిపిస్తుంది. 57 నెలలు మన కడుపు మాడ్చి..చివరి మూడు నెలల్లో అన్నం పెడతా అనే  వాడిని ఏమనాలి..? అన్నా అనాలా? లేక దున్నా అనాలా? 
ప్రతి  ఒక్కరికి చెప్పండి..1983వ సంవత్సరంలో ఎన్టీ రామారావు తొలిసారి రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఎన్‌టీ రామారావు ప్రజల్లోకి వచ్చి రూ.2 కిలో బియ్యం అన్నారు. ప్రజలు ఎన్‌టీ రామారావును అభిమానించారు. అప్పట్లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఏం చేశారో తెలుసా..ఎన్టీఆర్‌ రూ.2 కిలోబియ్యం అన్నారు..ఆరు నెలల ముందు రూ.1.90లకే కిలో బియ్యం ఇచ్చారు. అయినా ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేయలేదు. ఎన్‌టీఆర్‌కే ఓట్లు వేశారు. ఆయన చెప్పారు కాబట్టి..నీవు చేశావని అప్పటి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పారు. చంద్రబాబుకు కూడా ఇదే జరుగుతుంది.
ఎవరైనా ఓ రాక్షసుడు పంచభక్ష పరమాణాలతో భోజనం పెడతానని పిలిస్తే..ఎవరైనా నమ్ముతారా? మనల్ని తినడానికే ఈ భోజనానికి పిలిచారని భావిస్తారు.

మూడో సినిమా..ఆరో బడ్జెట్‌
ఈ సినిమా మూడు రోజుల క్రితమే విడుదలైంది. ఈ సినిమా సూపర్‌డూపర్‌ ప్లాన్‌. తాను అధికారంలో ఉండగా అమలు చేయని బడ్జెట్‌ను విడుదల చేస్తారు. ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలియదు. ముఖ్యమంత్రి అయ్యే వారు బడ్జెట్‌ పెడతారు. కానీ చంద్రబాబు తన హయాంలో లేని బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రజల చెవ్వుల్లో పూలు పెట్టే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఐదేళ్లు ఏమీ చేయని వాడు..ఇవాళ ఎన్నికలు మూడు నెలల్లో ఉండగా ఘరానా మోసం చేసేందుకు ఆరో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. తల్లికి అన్నం పెట్టని వాడు అవసరం కోసం చిన్నమ్మకు బంగారు గాజులు పెడతానంటారు. చంద్రబాబు తీరు ఇలా ఉంది. ఆయన మోసాలను పూర్తిగా ఎండగట్టమని కోరుతున్నాను.

 
 

Back to Top