<p style="text-align:justify">తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు తరచు రెండు కళ్ల సిద్దాంతం గురించి చెబుతుంటారు. అంటే దీనర్థం రెండు ప్రాంతాల్లో రెండు రకాలుగా రాజకీయాలు చేయాలన్నది ఆయన వ్యూహంగా తెలుస్తోంది. <p style="text-align:justify">ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కక్ష తో ప్రత్యర్థి పార్టీల నాయకుల్నితమతో తీసుకొని వెళ్లేందుకు రక రకాల కుట్రలు,ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంపీలు, ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు ప్రయత్నించారు. ఇద్దరు ఎంపీలను తన వైపు తిప్పుకొన్నారు. గ్రామాల్లోని ఎంపీటీసీ లు, జడ్పీటీసీ లను భయపెట్టి, మభ్య పెట్టి తెలుగుదేశం వైపు లాక్కొన్నారు. ఇదంతా రాజకీయ ఎత్తుగడలుగా ప్రచారం చేసుకొన్నారు.</p><p style="text-align:justify">కానీ, తెలంగాణ లో కొంత కాలంగా అధికార టీ ఆర్ ఎస్ పార్టీ ఇదే బాట పట్టింది. ప్రత్యర్థి పార్టీల్లోని ఎమ్మెల్యేలను తమ పార్టీ లోకి ఆకర్షిస్తూ వస్తోంది. తాజాగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న కూడా సైకిల్ దిగి కారు ఎక్కేశారు. దీని మీద చంద్రబాబు మండి పడ్డారు. ఈ విధంగా పార్టీలు మారే వారంతా ప్రజల్లో చులకన అవుతారని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఇతర పార్టీల నేతల్నితమ పార్టీలో చేర్చుకొంటే సదరు పార్టీ కూడా చులకన అవుతుందని ఆయన ప్రబోదించినట్లు సమాచారం.</p><p style="text-align:justify">అక్కడ ఆంధ్రలో ఇతర పార్టీల నేతల్ని లాక్కొంటే ఒప్పు అని, తెలంగాణ లో ఇతర పార్టీల్లోకి తెలుగు తమ్ముళ్లు వెళ్లిపోతే తప్పు అని రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నారన్న మాట. అదిరిందయ్యా చంద్రం..!</p></p>