రాజన్న క్యాంటిన్‌లో రూ.2లకే భోజనం

– రైల్వే కోడూరులో రాజన్న క్యాంటిన్‌ ప్రారంభం
– భోజన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు

వైయస్‌ఆర్‌ జిల్లా: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎన్నో సంక్షేమ పఝథకాలు ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మహానేత పాలనకు గుర్తుగా వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు రాజన్న క్యాంటిన్‌ ఏర్పాటు చే శారు. పేదల ఆకలి తీర్చాలనే లక్ష్యంతో మహానేత పేరుతో ఏర్పాటు చేసిన ఈ క్యాంటిన్‌లో రూ.2లకే భోజనం పెడుతున్నారు.

ఈ క్యాంటిన్‌ను నూతనం సంవత్సరం సందర్భంగా రైల్వే కోడూరులో ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయితే పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నారు. మళ్లీ రాజన్న పాలన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top